కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1). 2022 విడుదలైన కాంతారా సినిమాకు ఇది ప్రీక్వేల్. కాంతారా చిత్రం పాపాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సూపర్‌హిట్ చిత్రానికి ప్రీక్వెల్‌గా రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో ‘కాంతార: చాప్టర్ 1’ రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది. 2022లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక కాంతారా చాప్టర్ 1 టీజర్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. టీజర్‌లో ప్రతి డీటేయిల్ చాలా ఇంటెన్సిటీతో ఉంది. “వెలుగులోకి వస్తే అంతా కంటికి కనపడుతుంది.. కానీ అది నిప్పు కాదు దర్శనం.. గతంలో జరిగింది, భవిష్యత్‌లో జరగబోయేది అంతా చూపిస్తుంది.. కనబడుతుందా.. ఆ వెలుగు అంటూ” టీజర్ ముందుకు సాగింది. టీజర్‌లో రిషబ్ శెట్టి చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. చేతిలో త్రిశూలం పట్టుకుని భయంకరంగా కనిపించాడు. ఒంటిపై నెత్తురు కారుతుంటే.. చాలా ఆవేశంగా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించాడు. కంటిలో అగ్ని గోలాలు కనిపించే లుక్ భయానంగా ఉంది. ఇక BGM టీజర్‌ను బాగా ఎలివేట్ చేసింది.(Kantara Chapter 1 Dialogue) వీణ మ్యూజిక్‌ను అంజనీష్ కుమార్ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. టీజర్ ఏ ఇలా ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. టీజర్ అంచనాలకు మించి ఉందని ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న (Kantara Chapter 1 Release Date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ‘కాంతారా చాప్తర్ 1’ (Kantara chapter 1) సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు ప్రశాంత్ వర్మ డైరక్షన్‌లో వస్తున్న జై హనుమాన్ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాంతారా చాప్టర్ 1 పూర్తికాగానే ఈ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!