టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. జనసేన పార్టీ (Janasena Party)ని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ ఏపీ ఉపముఖ్యమంత్రిగాను బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ‘హరి హర వీరమల్లు’ ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వారసుడిగా అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ స్థానంలో అకీరా నందన్ (Akira Nandan)ను స్క్రీన్‌పై చూసుకొని సంతోషపడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ ‘ఓజీ’ సినిమాతో అకీరా ఎంట్రీ ఉంటుందని ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇది నూటికి నూరశాతం నిజమేనని తాజా అప్‌డేట్‌ను బట్టి తెలుస్తోంది.
అకీరానందన్ ఎంట్రీ పక్కా..
పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్ (Akira Nandan) ఫిల్మ్ ఎంట్రీ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీతోనే అకీరా తెరంగేట్రం చేయబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇది పూర్తిగా నిజమేనని తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం సర్‌ప్రైజింగ్‌గా అకీరా నందన్‌పై షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అకీరానందన్ ఎంట్రీ వందశాతం ‘ఓజీ’తోనే ఉండనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే అకీరా తెరంగేట్రాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచే ఛాన్స్ ఉందని అంటున్నారు. అకీరా ఎంట్రీని నేరుగా తెరపై చూడాల్సిందేనని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ‘ఓజీ’లో అకీరా ఏ పాత్రలో కనిపిస్తాడనేది మాత్రం ఎక్కడా రివీల్ కాలేదు. ఇక అకీరా రోల్‌కు సంబంధించి మున్ముందు మరిన్ని లీక్స్ వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటి కోసం ఫ్యాన్స్‌తో పాటు మనమూ వేచి చూద్దాం.
తండ్రి గురువు దగ్గర యాక్టింగ్ పాఠాలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లోకి రాకముందు ప్రముఖ నట గురువు సత్యానంద్ (Acting guru Satyanand) దగ్గర యాక్టింగ్ పాఠాలు నేర్చుకున్నారు. వైజాగ్‌లోని సత్యానంద్ శిక్షణాలయంలో నటనలోని ఓనమాలు అభ్యసించారు. ఇప్పుడు పవన్ తనయుడు అకీరానందన్ (Akira Nandan) కూడా ఆయన దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. భావోద్వేగాలను ఎలా పలికించాలో అకీరా తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించిన శిక్షణ కూడా అకీరా తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిని బట్టి చూస్తే పర్‌ఫెక్ట్ నటుడిగా మారేందుకు అకీరా బాగానే కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది. మరి స్క్రీన్‌పై అకీరా ఏ విధంగా మెరుస్తాడో చూద్దాం.
అకిరా ఎంతో టాలెంటెడ్!
అకిరా నందన్ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్ బాల్ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో మ్యూజిక్ కోర్సులు కూడా చేశాడు. అతడి మ్యూజిక్ టాలెంట్ తెలిసే మెగా ఫ్యామిలీ ఈ ఏడాది సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అతడి చేత ప్రత్యేక పర్‌ఫార్మెన్స్ చేయించింది. ఆ సందర్భంలోనే యానిమల్ సినిమాలోని ‘నాన్న నువ్వు నా ప్రాణం’ అంటూ పాటకు పియానో వాయించి అకిరా అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.
న్యూయర్‌కు బిగ్ ట్రీట్!
‘ఓజీ’ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త (Akira Nandan) నెట్టింట చక్కర్లు కొడుతోంది. న్యూయర్ కానుకగా 2025 జనవరి 1న ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే మొదట ఈ పాటను సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని మూవీ టీమ్ భావించింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం, పవన్ కూడా ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతాయుత పదవిలో ఉంటడంతో సాంగ్‌ను వాయిదాా వేశారు. అయితే కొత్త ఏడాది మాత్రం ఫ్యాన్స్‌కు గ్రాండ్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక పవన్‌ను ఢీ కొట్టే పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నాడు.
ఓజీపై ఎందుకంత హైప్?
పవన్ కల్యాణ్ చేతిలోని మూడు ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ఇందులో పవన్ పాత్ర ఓజాస్ గంభీర (Ojas Gambhira) కాగా దానిని షార్ట్‌కట్ చేస్తూ ‘ఓజీ’గా టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గతంలో వచ్చిన ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్ యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!