• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దసరా సెలవుల్లో మార్పులు

  ఏపీలో దసరా సెలవుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. ఈ నెల 24న హాలీడే బదులుగా సాధారణ సెలవుగా మార్పు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో సాధారణ సెలవులు ఉండనున్నాయి. దసరా పండుగ దృష్ణ్యా సెలవుల్లో ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేసింది.

  దసరా సెలవులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు

  తెలంగాణలో దసరా సందడి మొదలైంది. పాఠశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులతో బస్టాండ్‌లు రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దాదాపు అన్ని బడులలో నిన్న పరీక్షలు ముగిసాయి. ఈ రోజు స్కూల్స్, కాలేజీలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. అనంతరం పాఠశాలలు ముగిసిన తర్వాత హాస్టల్ విద్యార్థులు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో రైల్వేస్టేషన్, బస్టాండ్‌లు విద్యార్దులతోె కిటకిటలాడుతున్నాయి..

  ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్

  ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా 5,500 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసులు అక్టోబర్ 13 నుంచి 26 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సాధారణ చార్జీలతోనే బస్సులు నడపనున్నట్లు APSRTC స్పష్టం చేసింది. సెలవుల్లో ప్రయాణికుల రద్ధీ దృష్ట్యా వారి కోసం ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

  థియేటర్‌లో వావ్‌ అనిపించిన దసరా ర్యాప్‌ విన్నారా?

  రూ. 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘దసరా’ సినిమాలో నాని క్రికెట్‌ ఆడుతున్నపుడు ఓ ర్యాప్ వస్తుంది. పక్కా మాస్‌ సీన్‌కు ఈ ర్యాప్ అగ్నికి ఆజ్యంలా తోడయిందనే చెప్పాలి. సంతోశ్‌ నారాయణన్‌ మ్యూజిక్ అందించిన ఈ పాటకు తెలుగు లిరిక్స్ కాసర్ల శ్యామ్‌ రాయగా, ఇంగ్లిష్ లిరిక్స్ షాన్ విన్సెంట్ డి పాల్‌ రాశాడు. సిల్వర్‌ స్క్రీన్‌పై వావ్‌ అనిపించిన ఈ సాంగ్‌ను మీరూ చూడండి.

  దసరా నుంచి డిలీటెడ్ సీన్‌

  నేచురల్ స్టార్‌ నాని నటించిన దసరాా చిత్రం నుంచి మేకర్స్ డిలిటెడ్ సీన్‌ను విడుదల చేశారు. కీర్తి సురేశ్ ఆమె తల్లి, అత్త మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశంలా ఉంది. ఇందులో తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. గిదే నీ ఇల్లు, ఈడ్నే నీ బతుకు. నా మాట విని లోపలికి పోవే… నీ బాంచనే” అంటూ చెప్పిన డైలాగ్‌లు అదిరిపోయాయి. చిత్రానికి థియేటర్లలో మాస్ రెస్పాన్స్‌ వచ్చింది. ధరణి క్యారెక్టర్‌లో నాని ఇరగదీశాడు. ఓవర్సీస్‌లోనూ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

  హిందీ బెల్టులోనూ దసరా కలెక్షన్ల జోరు

  నాని హీరోగా నటించిన దసరా మూవీ హిందీలో డిసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. హిందీ రాష్ట్రాల్లో దసరా చిత్రం ఇప్పటివరకు రూ.3.5కోట్లు కొల్లగొట్టింది. నార్త్‌కు పెద్దగా పరిచయం లేనప్పటికీ నేచురల్ స్టార్‌ నానిని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాగా ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ, స్నేహం ఇతివృత్తంతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో వీర్లపల్లి అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘ధరణి’ పాత్రలో నాని … Read more

  దుమ్మురేపుతున్న కీర్తి తీన్మార్‌ డ్యాన్స్‌

  దసరా సినిమాలో థియేటర్లో విజిల్స్‌ వేయించిన సాంగ్‌ వీడియోను చిత్రబృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ‘వెన్నెల సెలెబ్రేషన్‌’ పేరుతో వచ్చిన ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. సినిమాలో ధరణితో వెన్నెల పెళ్లి సమయంలో ఈ డ్యాన్స్ చేస్తుంది. తెలంగాణలో అప్పట్లో పెళ్లి బారాత్‌లో ఉండే బ్యాండ్‌తో మాస్‌ బీట్స్‌ను అచ్చంగా దింపేసి జనాన్ని ట్రాన్స్‌లోకి తీసుకెళ్లిన ఈ సీన్‌ వెండితెరపై అద్భుతంగా పండింది.

  నాని కెరీర్‌లో బెస్ట్‌ ఫర్ఫామెన్స్ ఇదే: రాజమౌళి

  దసరా సినిమాపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాస్ పాత్రల మధ్య మనసుకు హత్తుకునే ప్రేమకథను తీయడంలో శ్రీకాంత్ ఓదెలా విజయం సాధించాడు. నాని తన నటజీవితంలోనే బెస్ట్‌ ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. కీర్తి తన రోల్‌లో అద్భుతంగా నటన పండించింది. ప్రతి నటుడు తన క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. సినిమాటోగ్రఫి ఫస్ట్ క్లాస్‌గా ఉంది’ అంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. Amidst the rugged landscape and raw characters, Srikanth Odela manages a tender heart touching lovestory. Career … Read more

  ‘చమ్కీల అంగీలేసి’కి మంచు లక్ష్మి స్టెప్పులు

  [VIDEO](url): దసరా సినిమా నేడు విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మేరకు చిత్రబృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా మరింత విజయం సాధించాలని కోరుతూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ‘చమ్కీల అంగీలేసి’ పాటకు మంచు లక్ష్మి స్టెప్పులేసింది. చీరకట్టుతో కీర్తి సురేష్‌ని అనుకరించే ప్రయత్నం చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ ఈ వీడియో చూసి మంచు లక్ష్మి డ్యాన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కెరీర్‌లో వైవిధ్యభరితమైన పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకెళ్తోందీ మంచు వారి … Read more

  దసరా నుంచి నాలుగో పాట

  నాని హీరోగా నటిస్తున్న దసరా చిత్రం నుంచి నాలుగో పాటు విడుదలయ్యింది. ఓ అమ్మలాలో అమ్మలాలో అంటూ సాగే పాట కూడ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. హీరో, హీరోయిన్ల మధ్య చిన్నప్పట్నుంచే ప్రేమ ఉందని తెలియజేసేలా మెలోడిని తీర్చిదిద్దారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు.