• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘చమ్కీల అంగిలేసి’ దసరా సాంగ్‌ ప్రోమో

    మార్చి 30న థియేటర్లలో సందడి చేయబోతున్న నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్, పాటలు, ఈవెంట్లతో సందడి మొదలుపెట్టిన చిత్రబృందం మరో పాట ప్రోమోను విడుదల చేసింది. చమ్కీల అంగిలేసి అంటూ మరో పాటను విడుదల చేయబోతోంది.శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ నాని సరసన నటిస్తోంది.

    దసరా చిత్రం నుంచి మేకింగ్ వీడియో

    నేచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా చిత్రబృందం ప్రమోషన్ల జోరు పెంచింది. సినిమాలోని ఓరి వారి పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. మార్చి 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాని లుక్‌ ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్‌ పేలుతున్నాయి. మాస్‌ సినిమా కావటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాని సరసన కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.

    ‘బ్యాంచత్’ పదం వాడకంపై నాని క్లారిటీ

    ‘దసరా’ సినిమాలో ‘బ్యాంచత్’ అనే పదం వాడటంపై నాని క్లారిటీ ఇచ్చాడు. ఇది కేవలం ఎమోషన్‌లో భాగంగా వచ్చే పదమేనని తెలిపాడు. ఈ పదానికి బూతు అర్థం వస్తున్నప్పటికీ, తెలంగాణలో ఈ పదం వేరే రకంగా వాడుకలో ఉందని చెప్పాడు. ‘మన భావోద్వేగాలను బయటపెట్టేదే భాష. ఇది తప్పక చేసి చూపిస్తానని ఇతరులకు సవాల్ చేసే క్రమంలో ఈ పదాన్ని ఉపయోగిస్తాం. సినిమాలోనూ ఆ విధంగానే వాడాం. అంతే తప్ప ద్వంద్వార్థాలు వెతకొద్దు. పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పండి’ అని నాని వివరణ ఇచ్చాడు.

    ఓరి వారి నీది గాదురా పోరి అంటున్న నాని

    నేచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా చిత్రం నుంచి మరో పాట విడుదల అయ్యింది. ప్రేమికుల రోజు సందర్భంగా సినిమాలోని బ్రేకప్ సాంగ్‌ను విడుదల చేసింది. ఓరి వారి నీది గాదురా పోరి.. ఇడిసెయ్ అంటూ సాగే ఈ విరహా గీతాన్ని శ్రీమణి రచించగా సంతోష్ నారాయణ్ అద్భుతంగా ఆలపించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. దసరా చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ కథనాయికగా నటిస్తుంది. మార్చి 30న సినిమా విడుదల అవుతుంది. https://youtube.com/watch?v=2xeclPw5YBA%26t%3D128s

    నాని దసరా టీజర్

    నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న దసరా టీజర్ విడుదలయ్యింది. వివిధ భాషల్లో హీరోలు ధనుష్, దుల్కర్ సల్మాన్‌, రక్షిత్ శెట్టి టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఇప్పటికే విడుదలైన నాని మాస్‌ లుక్ ఆకట్టుకుంది. టీజర్‌లో మందుబాటిళ్లను నాని నడుముకు కట్టుకొని వస్తుండటం వంటి అంశాలు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సినిమాను మార్చి 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.