• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మెలోడియస్‌గా… గాజు బొమ్మ సాంగ్

  నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న “హాయ్ నాన్న” మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ రిలీజైంది. తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని తెలిపేలా సాంగ్ సాగింది. ‘గాజు బొమ్మ’ సాంగ్ కంపోజింగ్ మెలోడియాస్‌గా ఉంది. కాగా ఈ సినిమాను డిఫరెంట్ స్టోరీతో శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించాడు. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు.

  ‘హాయ్‌ నాన్న’ ఫస్ట్‌ పాట విడుదల

  నాని , మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘హాయ్‌ నాన్న’ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్‌ పాట విడుదలైంది. ‘సమయమా’ అంటూ సాగే ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, సితార ఆలపించారు. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ స్వరాలు అందించారు Tomorrow 🙂#Samayama #SaayaTera #Nizhaliyae #Vivarane #Hridayame#HiNanna pic.twitter.com/zYpkVQ1Kp9 — Nani (@NameisNani) September 15, 2023

  దసరా ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే?

  నేచురల్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దసరా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దసరా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. కీర్తి సురేష్ నాని సరసన నటించింది. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, SLV సినిమాస్ వారు చిత్రాన్ని నిర్మించారు. మార్చి 31న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా … Read more

  దసరా నుంచి డిలీటెడ్ సీన్‌

  నేచురల్ స్టార్‌ నాని నటించిన దసరాా చిత్రం నుంచి మేకర్స్ డిలిటెడ్ సీన్‌ను విడుదల చేశారు. కీర్తి సురేశ్ ఆమె తల్లి, అత్త మధ్య జరిగే ఎమోషనల్ సన్నివేశంలా ఉంది. ఇందులో తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. గిదే నీ ఇల్లు, ఈడ్నే నీ బతుకు. నా మాట విని లోపలికి పోవే… నీ బాంచనే” అంటూ చెప్పిన డైలాగ్‌లు అదిరిపోయాయి. చిత్రానికి థియేటర్లలో మాస్ రెస్పాన్స్‌ వచ్చింది. ధరణి క్యారెక్టర్‌లో నాని ఇరగదీశాడు. ఓవర్సీస్‌లోనూ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

  హిందీ బెల్టులోనూ దసరా కలెక్షన్ల జోరు

  నాని హీరోగా నటించిన దసరా మూవీ హిందీలో డిసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. హిందీ రాష్ట్రాల్లో దసరా చిత్రం ఇప్పటివరకు రూ.3.5కోట్లు కొల్లగొట్టింది. నార్త్‌కు పెద్దగా పరిచయం లేనప్పటికీ నేచురల్ స్టార్‌ నానిని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాగా ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ, స్నేహం ఇతివృత్తంతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో వీర్లపల్లి అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘ధరణి’ పాత్రలో నాని … Read more

  ‘చమ్కీల అంగీలేసి’కి మంచు లక్ష్మి స్టెప్పులు

  [VIDEO](url): దసరా సినిమా నేడు విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మేరకు చిత్రబృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా మరింత విజయం సాధించాలని కోరుతూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ‘చమ్కీల అంగీలేసి’ పాటకు మంచు లక్ష్మి స్టెప్పులేసింది. చీరకట్టుతో కీర్తి సురేష్‌ని అనుకరించే ప్రయత్నం చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ ఈ వీడియో చూసి మంచు లక్ష్మి డ్యాన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కెరీర్‌లో వైవిధ్యభరితమైన పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకెళ్తోందీ మంచు వారి … Read more

  దసరా నుంచి నాలుగో పాట

  నాని హీరోగా నటిస్తున్న దసరా చిత్రం నుంచి నాలుగో పాటు విడుదలయ్యింది. ఓ అమ్మలాలో అమ్మలాలో అంటూ సాగే పాట కూడ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. హీరో, హీరోయిన్ల మధ్య చిన్నప్పట్నుంచే ప్రేమ ఉందని తెలియజేసేలా మెలోడిని తీర్చిదిద్దారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

  బొమ్మల అంగీలేసి.. చిన్నారులతో నాని

  దసరా ప్రమోషన్లలో ‘నాని’ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో నానికి ‘వీ కేర్ ఎన్జీవో’.పిల్లలు ప్రత్యేక బహుమతి ఇచ్చారు. చిన్నారులంతా కలిసి కొన్ని బొమ్మల్ని వేశారు. ఈ బొమ్మల్ని ఒక షర్ట్‌పై కుట్టించారు. ఆ అంగీని నానికి బహుమతిగా ఇచ్చారు. ప్రముఖ స్టైలిస్ట్, కాస్టూమ్ డిజైనర్ నీరజ కోన నేతృత్వంలో ఈ స్పెషల్ షర్ట్‌ని డిజైన్ చేశారు. దీంతో నాని సంబరపడిపోయాడు. చిన్నారులను ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నాడు. తనకోసం ఇంత అభిమానాన్ని చూపించడంపై ఉప్పొంగిపోయాడు.

  ట్రాక్టర్‌పై నాని రయ్ రయ్..

  [వీడియో;](url) న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్‌లు జంటగా నటించిన ‘దసరా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లలో నాని బిజీగా బిజీగా ఉన్నారు. తాజాగా నాగ్‌పూర్‌లో నాని ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపి సందడి చేశారు. నగరంలోని ప్రజలు, దుకాణదారులు, చాయ్‌వాలాలతో ముచ్చటించారు. ‘దసరా’ చిత్ర విశేషాలను అక్కడి వారికి చెప్పి ఆకట్టుకున్నారు. కాగా ‘దసరా’ మూవీ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. #Nani Driving a Tractor ?, as … Read more

  కొచ్చిలో అదిరిన ‘దసరా’ ప్రమోషన్లు

  [VIDEO](url): దసరా ప్రమోషన్లలో హీరో ‘నాని’ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ఇటీవల ‘నాని’ కొచ్చి వెళ్లాడు. అక్కడ ఫ్యాన్స్‌ని కలిశాడు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మీడియాతో పాల్గొన్నాడు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో దసరా సినిమా విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మించింది. కీర్తి సురేష్ నాని సరసన నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. Natural … Read more