నేచురల్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దసరా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దసరా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. కీర్తి సురేష్ నాని సరసన నటించింది. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, SLV సినిమాస్ వారు చిత్రాన్ని నిర్మించారు.
మార్చి 31న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. బొగ్గు గని బ్యాక్ డ్రాప్‌లో నాని యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఊర మాస్ క్యారెక్టర్‌లో నేచురల్ స్టార్ అదిరిపోయే పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. రస్టిక్ లుక్‌లో కనిపించడంతో బీ, సీ సెంటర్లలో విజయవంతం అయ్యింది. కీర్తి సురేశ్ బరాత్ డాన్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో మార్మోగుతున్న సంగతి తెలిసిందే.
దసరా చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్… సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజీపైన సుక్కు శ్రీకాంత్ గురించి చెప్పాడు. సెట్‌లో అన్ని సిద్ధంగా ఉండటానికి కారణం శ్రీకాంత్ అని… కష్టపడి పని చేస్తాడంటూ తెలిపాడు. గురువుకు తగ్గట్లుగానే శిష్యుడు మెుదటి సినిమాతో హిట్ కొట్టాడని సినీ వర్గాల ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.
సినిమా కథ చెప్పడానికి వెళ్లినప్పుడు శ్రీకాంత్‌ను ఏదైనా ఒక చిన్న ఎమోషనల్ సీన్ తీసుకొని రమ్మని చెప్పాడట. డెబ్యూ డైరక్టర్ అయినప్పటికీ శ్రీకాంత్ మెుదటి రోజే ఇగో టచ్ చేశాడని నాని ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఓ సీన్‌లో రెచ్చిపోయి చెద్దామని షూటింగ్ వెళ్తే దాదాపు 10 టేక్‌లు దాటిన సీన్ ఓకే చేయలేదని తెలిపాడు. మధ్యలో “బ్రేక్ కావాలా అన్న” అని ఇగో టచ్ చేశాడని పేర్కొన్నాడు నాని.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!