• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాల‌య్య‌తో.. సుకుమార్ సినిమా?

  భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్‌తో నటుడు బాలకృష్ణ మంచి జోరుమీదున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, తర్వాత భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్‌తో మూడోసారి 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. అయితే బాలయ్య తన తదుపరి సినిమా బాబీ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర కాంబినేషన్ వినిపిస్తుంది. సుకుమార్‌తో కూడా మరో సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్నారని తెలుస్తోంది.

  విరూపాక్ష వసూళ్ల ప్రభంజనం

  విరూపాక్ష వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. ఈ చిత్రం విడుదలైన రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.28కోట్లు కొల్లగొట్టింది. సక్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళ్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా విరూపాక్ష నిలిచింది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్లు సాధించిన విరూపాక్ష శనివారం అంతకుమించిన కలెక్షన్ల రాబట్టింది. కాగా ఈ సినిమాలో సాయిధరమ్ సరసన సంయుక్త మీనన్ నటించింది. కార్తిక్ దండు ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మూడో రోజు కూడా కాసుల వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్లకుపైగా కొళ్లగొట్టింది. ఇప్పటివరకు … Read more

  దసరా ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే?

  నేచురల్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దసరా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దసరా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. కీర్తి సురేష్ నాని సరసన నటించింది. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, SLV సినిమాస్ వారు చిత్రాన్ని నిర్మించారు. మార్చి 31న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా … Read more

  హీరోయిన్‌తో చిందులు వేసిన దర్శక, నిర్మాతలు

  హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో కలసి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్‌లు [డ్యాన్స్](url) చేశారు. ‘18 పేజెస్’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మూవీ యూనిట్ పార్టీ ఇచ్చింది. ఈ వేడుకలో అనుపమతో కలసి అరవింద్, సుకుమర్ కాలు కదిపి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. కాగా ఈనెల 23న ‘18 పేజెస్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకుంది. Look who are Happy And Dancing … Read more

  బాస్ పార్టీ పాట రియాక్షన్ చూడండి

  చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి విడుదలైన బాస్ పార్టీ పాట రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట మెుదటిసారి విన్నప్పుడు రియాక్షన్ ఎలా ఉందనే దానిపై చిత్ర బృందం వీడియోను విడుదల చేసింది. ఇందులో బాబీ, సుకుమార్, చిరు… మాస్ పాటను ఆస్వాదించారు. కుర్చీల్లో కూర్చొని చిన్న చిన్న స్టెప్పులు వేశారు. జనవరి 13న సంక్రాంతికి సినిమా విడుదలవుతుంది. చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

  FILMFARE AWARDS 2022: ఇటు మాస్.. అటు క్లాస్.. దక్షిణాది చిత్రాలకు అవార్డుల నీరాజనం

  67వ ఫిల్మ్‌ఫేర్ వేడుకలు బెంగుళూరులో ఘనంగా జరిగాయి. 2020, 2021కి గాను జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో అలరించిన సినిమాలకు, తారలకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో తెలుగు నుంచి ‘పుష్ప’, తమిళ్‌ నుంచి ‘సూరారై పొట్రు’, మళయాలం నుంచి ‘అయ్యప్పనుమ్ కొషియమ్’, కన్నడ నుంచి ‘యాక్ట్ 1978’ సినిమాలు అత్యధిక విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు ఈ అవార్డుల ప్రదానోత్సవం ఓ కన్నుల పండుగగా నిలిచింది. October 16న తమిళ, కన్నడ … Read more

  లైగర్ మరో కల్ట్ మూవీ కానుందా? 1990 నుంచి తెలుగులో వచ్చిన కల్ట్ యాక్షన్ మూవీలు

   రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ మూవీ గురించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని కల్ట్ మూవీగా విజయ్ అభివర్ణించాడు. “కల్ట్ వ్యక్తులతో కల్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. దానిని మీతో పంచుకుంటున్నాం” అంటూ మైక్ టైసన్ తో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. దీంతో పూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టాలీవుడ్ లో మరో ట్రెండ్ సెట్టర్ గా నిలవనుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. అసలు ఇప్పటి వరకు తెలగులో యాక్షన్ చిత్రాల్లో కల్ట్ మూవీలు అనదగ్గవి … Read more