హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్తో కలసి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్లు [డ్యాన్స్](url) చేశారు. ‘18 పేజెస్’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మూవీ యూనిట్ పార్టీ ఇచ్చింది. ఈ వేడుకలో అనుపమతో కలసి అరవింద్, సుకుమర్ కాలు కదిపి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. కాగా ఈనెల 23న ‘18 పేజెస్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకుంది.