• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హీరోతో అమృత ప్రణయ్ రొమాన్స్

  హీరో కార్తికేయతో అమృత ప్రణయ్ రొమాన్స్ చేసింది. ‘బెదురులంక’ ప్రమోషన్లలో భాగంగా ‘‘కవ్వించే ఆడపిల్ల’’ సాంగ్‌కు కార్తీకేయతో కలసి అమృత స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అమృత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా మిర్యాలగూడలో ప్రణయ్ అనే వ్యక్తిని అమృత పెళ్లి చేసుకుంది. దీంతో ప్రణయ్‌ను ఆమె తండ్రి మారుతీరావు దారుణంగా చంపించాడు. అనంతరం మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. https://www.instagram.com/reel/CwSkD-gJzKr/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

  బాలయ్య సాంగ్‌కు శ్రీలీల, కాజల్ స్టెప్పులు

  నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘భగవంత్ కేసరి’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా వీరిద్దరూ సినిమా షూట్ మధ్యలో బాలయ్య సాంగ్‌కు డ్యాన్స్ వేశారు. ‘‘చిలక పచ్చ కోక’’ పాటకు కాజల్, శ్రీలీల అదిరే స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. https://www.instagram.com/reel/Ctq-oVYAmu-/?utm_source=ig_web_copy_link

  అదిరేటి స్టెప్పు నేనేస్తే: మెట్రోలో యువతి డ్యాన్స్

  [వీడియో:](url) ఓ యువతి ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో డ్యాన్స్ వేసి వార్తల్లో నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీకి చెందిన అవ్నీ కరీష్ అనే యువతి ఎర్ర చీర ధరించి ఓ భోజ్‌పురి సాంగ్‌కు స్టెప్పులు వేసింది. ఈ యువతి స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారు. ఈమె డ్యాన్స్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను వేల మంది వీక్షించారు. కాగా మెట్రో ఆవరణలో ఇలా వీడియోలు తీయడమేంటని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని కొంతమంది కోరుతున్నారు. https://www.instagram.com/reel/CouVvSbDvui/?utm_source=ig_web_copy_link

  చరణ్‌తో ఆనంద్ మహీంద్రా స్టెప్పులు; వీడియో వైరల్

  ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. టాలీవుడ్ హీరో రామ్‌చరణ్‌తో కలసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్ములావన్ రేస్ పోటీలను వీక్షించేందుకు రామ్‌చరణ్, ఆనంద్ మహీంద్రాలు విచ్చేశారు. అక్కడ వీరిద్దరూ సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం ‘నాటు నాటు’ పాటకు ఇద్దరూ కలసి డ్యాన్స్ చేశారు. కాగా చరణ్ ప్రస్తుతం ‘RC15’ మూవీలో నటిస్తున్నారు. Well apart from the race, one real bonus at the #HyderabadEPrix was getting lessons … Read more

  భాంగ్రా డ్యాన్స్; హొరెత్తించిన బుల్లి సర్దార్

  ఓ బాలుడు భాంగ్రా డ్యాన్స్ ఇరగదీశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ సిక్కు బాలుడు ఇచ్చిన భాంగ్రా ఫెర్మార్మెన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ డ్యాన్స్ చేసిన బుల్లి సర్దార్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. https://www.instagram.com/reel/CntteNDJIe-/?utm_source=ig_web_copy_link

  అంబానీ ఫ్యామిలీ డ్యాన్స్; పేలుతున్న జోకులు

  ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ నిశ్చితార్థం పార్టీ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు. కాగా ఈ వేడుకలో అంబానీ ఫ్యామిలీ [డ్యాన్స్](url) చేసింది. ‘వహ్ వహ్ రామ్‌జీ’ పాటకు వారు కాలు కదిపారు. వారి డ్యాన్స్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.‘ముఖేష్ అంబానీ రిహార్సల్స్ చేయడం మర్చిపోయినట్లు ఉన్నాడు’ అని, ‘కరణ్ జోహార్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రఫీ’ అంటూ జోకులు పేలుస్తున్నారు. #WATCH | The Ambani … Read more

  ‘నాటు నాటు’కు రాంచరణ్ అత్త డ్యాన్స్; వీడియో వైరల్

  ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు రాంచరణ్ అత్త శోభన కామినేని కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ [వీడియో](url)ను ఉపాసన షేర్ చేస్తూ ‘‘అల్లుడి ఘనతకు గర్విస్తోన్న అత్త.’’అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో శోభన పాల్గోంది. తాను ఎక్కడికి వెళ్లినా తన అల్లుడు చరణ్ గురించే అందరూ అడుగుతున్నారని.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అంతర్జాతీయ గుర్తింపు పొందడం సంతోషంగా ఉందని శోభన చెప్పుకొచ్చింది. Very proud mother in law … Read more

  పెళ్లయితే.. వరుడికి చుక్కలే..

  ప్రస్తుతం పెళ్లిలో వధూవరులు ఇద్దరూ జిమ్ వర్కౌట్లు చేస్తూ ఉన్న వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. పెళ్లి వేడుకలో వధూవరులిద్దరూ డ్యాన్స్‌తో పాటు పుషప్‌లు తీస్తూ కనిపించారు. వీరు చేసిన డ్యాన్స్, వర్కౌట్లకు అక్కడున్న అతిథులు చప్పట్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వధువు ఇప్పుడే ఇలా ఉందంటే.. పెళ్లయితే వరుడికి చుక్కలే’’ అంటూ నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

  హీరోయిన్‌తో చిందులు వేసిన దర్శక, నిర్మాతలు

  హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో కలసి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్‌లు [డ్యాన్స్](url) చేశారు. ‘18 పేజెస్’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మూవీ యూనిట్ పార్టీ ఇచ్చింది. ఈ వేడుకలో అనుపమతో కలసి అరవింద్, సుకుమర్ కాలు కదిపి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. కాగా ఈనెల 23న ‘18 పేజెస్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకుంది. Look who are Happy And Dancing … Read more

  మహిళతో కలసి చిందులేసిన ఎస్ఐ; వీడియో వైరల్

  తాను యూనిఫామ్‌లో ఉన్నాననే విషయాన్ని మరచి ఓ ఎస్ఐ మహిళతో చిందులేశాడు. ఇందుకు సంబందించిన వీడియో వైరల్‌గా మారడంతో చిక్కుల్లో పడ్డాడు. సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలోని నారాయణ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ తన బంధువుల ఇంట్లో నిశ్చితార్ధానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో అక్కడ ఓ మహిళతో కలసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. Video Of Delhi Cop's Dance In Uniform Goes Viral, He May Face … Read more