విరూపాక్ష వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. ఈ చిత్రం విడుదలైన రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.28కోట్లు కొల్లగొట్టింది. సక్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళ్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా విరూపాక్ష నిలిచింది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్లు సాధించిన విరూపాక్ష శనివారం అంతకుమించిన కలెక్షన్ల రాబట్టింది. కాగా ఈ సినిమాలో సాయిధరమ్ సరసన సంయుక్త మీనన్ నటించింది. కార్తిక్ దండు ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
మూడో రోజు కూడా కాసుల వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్లకుపైగా కొళ్లగొట్టింది. ఇప్పటివరకు సుమారు రూ. 44 కోట్లు వచ్చాయని చిత్రవర్గాలు తెలిపాయి. వారాంతం తర్వాత కూడా విజయవంతంగా నడుస్తుంది ఈ సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో చాలా రోజుల అనంతరం మూవీ విడుదల కావటంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ వారం కూడా కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
విరూపాక్ష సినిమాతో సాయిధరమ్ తేజ్ సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత షూటింగ్ చేసి రిలీజ్ చేసిన చిత్రం ఇది. అంతకముందు విడుదలైన రిపబ్లిక్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ప్రేక్షకులను నిరాశ పర్చటంతో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో. మాట పడిపోయినప్పటికీ అభిమానుల కోసం కష్టపడి చేశానని చెప్పాడు.
చిత్రానికి సుకుమార్ స్క్రీన్‌ప్లే మ్యాజిక్ చేసింది. ఆయన శిష్యుడు కార్తీక్ దండుకి ఇది మెుదటి సినిమా అయినప్పటికీ బాగా హ్యాండిల్ చేశాడు. కథను ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీర్చిదిద్ది సక్సెస్ కొట్టాడు. విజయంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుందని.. క్రెడిట్ అందరం పంచుకుంటామని కార్తీక్ చెప్పాడు. ఇక ఇలాంటి సినిమాలకు కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించడంలో విజయవంతం అయ్యాడు అజనీష్ లోక్‌నాథ్. ఇతడు కాంతారకు మ్యూజిక్ ఇచ్చిన సంగతి తెలిసిందేే.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!