• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గంజా శంకర్‌గా సుప్రీం హీరో

    మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో కొత్త సినిమాను ప్రారంభించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గంజా శంకర్ అనే టైటిల్‌ను ఖరారా చేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్ గంజాయి అమ్మే వ్యక్తిగా కనిపించనున్నారు. ఈరోజు సుప్రీం హీరో బర్త్‌ డే సందర్భంగా స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందిస్తున్నారు. సాయి ధరమ్ ఎన్నడు చేయని పాత్రను చేస్తున్నాడు. డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నట్లు టాక్.

    విరూపాక్ష వసూళ్ల ప్రభంజనం

    విరూపాక్ష వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. ఈ చిత్రం విడుదలైన రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.28కోట్లు కొల్లగొట్టింది. సక్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళ్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా విరూపాక్ష నిలిచింది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్లు సాధించిన విరూపాక్ష శనివారం అంతకుమించిన కలెక్షన్ల రాబట్టింది. కాగా ఈ సినిమాలో సాయిధరమ్ సరసన సంయుక్త మీనన్ నటించింది. కార్తిక్ దండు ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మూడో రోజు కూడా కాసుల వర్షం కురిసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్లకుపైగా కొళ్లగొట్టింది. ఇప్పటివరకు … Read more

    థ్రిల్లింగ్‌గా సాగుతున్న ‘విరూపాక్ష’ ట్రైలర్

    సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ ట్రైలర్ లాంచ్ అయింది. ఆద్యంతం ఆసక్తికరంగా ట్రైలర్ సాగింది. రుద్రవనం గ్రామంలో ప్రజల ఆకస్మిక మరణాల వెనుక కారణాలను విరూపాక్ష ఎలా తెలుసుకున్నాడనే పాయింట్‌పై కథ సాగనున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. మరి, రుద్రవనాన్ని విరూపాక్ష కాపాడాడా? అనేది ఏప్రిల్ 21న తెరపై చూడాల్సిందే. ట్రైలర్‌ థ్రిల్లింగ్ అంశాలతో సాగింది. అజనీష్ లోకనాథ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు బాగా కుదిరింది. కార్తీక్ దండు డైరెక్ట్ చేయగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.

    మాస్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

    విరూపాక్ష టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెట్‌లో టీజర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. టీజర్‌ను చూసిన పవన్‌… చిత్రబృందాన్ని అభినందించారు. ప్రతి సారి తనకు సపోర్ట్ చేస్తున్నందుకు సాయి ధరమ్‌ పవన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ టీజర్ రేపు విడుదల కానుంది.

    విరూపాక్ష మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

    సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈమేరకు మోషన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది. విరూపాక్ష మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రవారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. Get ready to Enter the World of #Virupaksha ?️? 'Supreme … Read more

    సాయిధరమ్ తేజ్‌ టైటిల్‌ గ్లింప్స్

    సాయిధరమ్‌ తేజ్‌ విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి చిత్రబృందం గ్లింప్స్‌ను కూడా విడుదల చేసింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న సినిమాలో సంయుక్త మేనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్‌, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. గ్లింప్స్‌కు తారక్ వాయిస్ అందించారు. ప్రస్తుతం ఈ వీడియో ఆకట్టుకుంటోంది.

    ఇలా మళ్ళీ మీ ముందు రావడం నా అదృష్టం: SDT

    పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఈ ఈవెంట్‌లో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాల్గొని మాట్లాడాడు. ఇలా మళ్ళీ స్టేజ్ ఎక్కి, మీ ముందుకు వస్తానని అనుకోలేదని తెలిపాడు. దేవుని దయ, మీ ప్రేమతో మళ్ళీ ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన తమ్ముడు వైష్ణవ్‌ను ఆటపట్టించాడు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.