• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేచురల్ స్టార్ నానికి మాస్ రెస్పాన్స్‌

    [VIDEO: ](url)దసరా సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబయి వెళ్లిన నానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అక్కడ హోలీ వేడుకల్లో నాని పాల్గొన్నాడు. నేేచురల్ స్టార్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇందుకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. మార్చి 30న దసరా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది. Resounding response for Natural Star @NameisNani's FIRST EVER PUBLIC APPEARANCE … Read more

    దసరా చిత్రం నుంచి మేకింగ్ వీడియో

    నేచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా చిత్రబృందం ప్రమోషన్ల జోరు పెంచింది. సినిమాలోని ఓరి వారి పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. మార్చి 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాని లుక్‌ ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్‌ పేలుతున్నాయి. మాస్‌ సినిమా కావటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాని సరసన కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.

    ‘ఓరి వారి నీది గాదురా పోరి’ సాంగ్ ప్రోమో

    నాని ‘దసరా’ మూవీ నుంచి రెండో పాట ప్రోమో విడుదలైంది. ‘ఓరి వారి నీది గాదురా పోరి.. ఇడిసైరా ఇంగ ఒడిసెను దారి’ అంటూ సాగే గీతాన్ని సంతోష్ నారాయణన్ ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. వాలెంటైన్స్ డే సందర్బంగా రేపు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఇప్పటికే మొదటి పాటకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పాటపై అంచనాలు పెరిగాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 5 భాషల్లో ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది.

    గడ్డం, మీసం లేకుండా నాని..!

    న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని 30వ సినిమా గ్లింప్స్‌ వచ్చేసింది. ఇందులో నాని, ఓ చిన్నారి మధ్య తండ్రీ కూతుళ్ల సంభాషణతో సినిమా గురించి వెల్లడించారు. గడ్డం, మీసం లేకుండా నాని ఇందులోని పాత్రను చేయబోతున్నట్లు సమాచారం. ఇక మృణాల్ ఠాకూర్ నానికి జంటగా నటిస్తోంది. ‘ఎదుటివారికి ప్రేమను పంచడంలోనే అసలైన ప్రేమ దాగి ఉంది’ అనే విషయాన్ని గ్లింప్స్ ద్వారా చెప్పుకొచ్చారు. శౌర్యవ్ దర్శకత్వం వహిస్తుండగా.. హేషం అబ్దుల్ వహీం సంగీతం అందిస్తున్నారు. వైరా పతాకంపై సినిమా తెరకెక్కనుంది.

    FILMFARE AWARDS 2022: ఇటు మాస్.. అటు క్లాస్.. దక్షిణాది చిత్రాలకు అవార్డుల నీరాజనం

    67వ ఫిల్మ్‌ఫేర్ వేడుకలు బెంగుళూరులో ఘనంగా జరిగాయి. 2020, 2021కి గాను జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో అలరించిన సినిమాలకు, తారలకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో తెలుగు నుంచి ‘పుష్ప’, తమిళ్‌ నుంచి ‘సూరారై పొట్రు’, మళయాలం నుంచి ‘అయ్యప్పనుమ్ కొషియమ్’, కన్నడ నుంచి ‘యాక్ట్ 1978’ సినిమాలు అత్యధిక విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు ఈ అవార్డుల ప్రదానోత్సవం ఓ కన్నుల పండుగగా నిలిచింది. October 16న తమిళ, కన్నడ … Read more