• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హిందీ బెల్టులోనూ దసరా కలెక్షన్ల జోరు

  నాని హీరోగా నటించిన దసరా మూవీ హిందీలో డిసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. హిందీ రాష్ట్రాల్లో దసరా చిత్రం ఇప్పటివరకు రూ.3.5కోట్లు కొల్లగొట్టింది. నార్త్‌కు పెద్దగా పరిచయం లేనప్పటికీ నేచురల్ స్టార్‌ నానిని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాగా ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ, స్నేహం ఇతివృత్తంతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో వీర్లపల్లి అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘ధరణి’ పాత్రలో నాని … Read more

  బొమ్మల అంగీలేసి.. చిన్నారులతో నాని

  దసరా ప్రమోషన్లలో ‘నాని’ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో నానికి ‘వీ కేర్ ఎన్జీవో’.పిల్లలు ప్రత్యేక బహుమతి ఇచ్చారు. చిన్నారులంతా కలిసి కొన్ని బొమ్మల్ని వేశారు. ఈ బొమ్మల్ని ఒక షర్ట్‌పై కుట్టించారు. ఆ అంగీని నానికి బహుమతిగా ఇచ్చారు. ప్రముఖ స్టైలిస్ట్, కాస్టూమ్ డిజైనర్ నీరజ కోన నేతృత్వంలో ఈ స్పెషల్ షర్ట్‌ని డిజైన్ చేశారు. దీంతో నాని సంబరపడిపోయాడు. చిన్నారులను ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నాడు. తనకోసం ఇంత అభిమానాన్ని చూపించడంపై ఉప్పొంగిపోయాడు.

  ట్రాక్టర్‌పై నాని రయ్ రయ్..

  [వీడియో;](url) న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్‌లు జంటగా నటించిన ‘దసరా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లలో నాని బిజీగా బిజీగా ఉన్నారు. తాజాగా నాగ్‌పూర్‌లో నాని ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపి సందడి చేశారు. నగరంలోని ప్రజలు, దుకాణదారులు, చాయ్‌వాలాలతో ముచ్చటించారు. ‘దసరా’ చిత్ర విశేషాలను అక్కడి వారికి చెప్పి ఆకట్టుకున్నారు. కాగా ‘దసరా’ మూవీ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. #Nani Driving a Tractor ?, as … Read more

  ట్రెండింగ్‌లో ‘దసరా’ సాంగ్స్

  న్యాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘దసరా’ సినిమా సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇండియాలోని టాప్ 20 ట్రెండింగ్ సాంగ్స్‌లో ఈ మూవీ పాటలు చోటు దక్కించుకున్నాయి. ‘ధూమ్‌ధామ్ దోస్తాన్’, ‘చమ్కీల అంగీలేసి’, ‘ఓరి వారి’ పాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. రూ.65 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీని మార్చి 30న విడుదల చేయనున్నారు.

  ‘దసరా’ నుంచి మరో సాంగ్ రిలీజ్

  న్యాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘దసరా’ మూవీ నుంచి మరో సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ‘‘చమ్కీల అంగీలేసీ.. ఓ వదినే’’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలై శ్రోతలను అలరిస్తున్నాయి. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. సుధాకర చెరుకూరి ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. సాయికుమార్, సముద్ర ఖని, దీక్షిత్ శెట్టి కీలకపాత్రలు పోషించారు. మార్చి 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

  ‘చమ్కీల అంగిలేసి’ దసరా సాంగ్‌ ప్రోమో

  మార్చి 30న థియేటర్లలో సందడి చేయబోతున్న నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్, పాటలు, ఈవెంట్లతో సందడి మొదలుపెట్టిన చిత్రబృందం మరో పాట ప్రోమోను విడుదల చేసింది. చమ్కీల అంగిలేసి అంటూ మరో పాటను విడుదల చేయబోతోంది.శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ నాని సరసన నటిస్తోంది.

  ‘బ్యాంచత్’ పదం వాడకంపై నాని క్లారిటీ

  ‘దసరా’ సినిమాలో ‘బ్యాంచత్’ అనే పదం వాడటంపై నాని క్లారిటీ ఇచ్చాడు. ఇది కేవలం ఎమోషన్‌లో భాగంగా వచ్చే పదమేనని తెలిపాడు. ఈ పదానికి బూతు అర్థం వస్తున్నప్పటికీ, తెలంగాణలో ఈ పదం వేరే రకంగా వాడుకలో ఉందని చెప్పాడు. ‘మన భావోద్వేగాలను బయటపెట్టేదే భాష. ఇది తప్పక చేసి చూపిస్తానని ఇతరులకు సవాల్ చేసే క్రమంలో ఈ పదాన్ని ఉపయోగిస్తాం. సినిమాలోనూ ఆ విధంగానే వాడాం. అంతే తప్ప ద్వంద్వార్థాలు వెతకొద్దు. పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పండి’ అని నాని వివరణ ఇచ్చాడు.

  ‘ఓరి వారి నీది గాదురా పోరి’ సాంగ్ ప్రోమో

  నాని ‘దసరా’ మూవీ నుంచి రెండో పాట ప్రోమో విడుదలైంది. ‘ఓరి వారి నీది గాదురా పోరి.. ఇడిసైరా ఇంగ ఒడిసెను దారి’ అంటూ సాగే గీతాన్ని సంతోష్ నారాయణన్ ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. వాలెంటైన్స్ డే సందర్బంగా రేపు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఇప్పటికే మొదటి పాటకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పాటపై అంచనాలు పెరిగాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 5 భాషల్లో ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది.

  యూట్యూబ్‌లో ‘ధూమ్ ధామ్’ రచ్చ

  న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ మూవీలోని ‘ధూమ్ ధామ్’ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ సృస్టిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ పాట ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ సాధించింది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో 102 K రీల్స్ సాధించి రికార్డులు సృస్టిస్తోంది. కాగా ఈ మూవీలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. మార్చి 30న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

  ‘దసరా’కు యమా డిమాండ్!

  న్యాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ‘దసరా’ మూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ చూస్తే నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను చదలవాడ రూ.24 కోట్లకు కొనుక్కోగా.. దానికి అదనంగా రూ.4 కోట్లు ఇచ్చి రూ.28 కోట్లతో దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దిల్ రాజుకు 5 నుంచి 10 కోట్ల ఆఫర్‌తో లాభాలు వస్తాయని ఫిలింనగర్ సమాచారం. నైజాం, వైజాగ్ మనహా మిగతా … Read more