ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’ (Pushpa 2). యావత్ దేశంలోని సినీ లవర్స్ ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సంగీతం సమకూరుస్తున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా పూర్తికాకపోవడంతో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఆయనతో పాటు మరో ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ‘పుష్ప 2’ కోసం శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ మ్యూజిక్కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
నేపథ్య సంగీతంపై క్రేజీ బజ్..
‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రానికి నలుగురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడిన థమన్ ‘పుష్ప 2’ కోసం తనతో పాటు పలువురు పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ బజ్ ప్రకారం యాక్షన్ సీక్వెన్స్‌కు ఎస్.ఎస్. థమన్ (S.S. Thaman) నేపథ్య సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఇంపార్టెంట్ ఫైట్ సీక్వెన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌కు బీజీఎం అందిస్తున్నారట. ఇక ‘కాంతారా’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సెకండాఫ్‌లో ఎంతో కీలకమైన జాతర ఎపిసోడ్‌కు BGM ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరో సంగీత దర్శకుడు శ్యామ్ సి.ఎస్ మరికొన్ని సన్నివేశాలకు నేపథ్య సంగీతం ఇస్తున్నట్లు టాక్. ఇలా సినిమాను పార్ట్స్‌గా డివైడ్ చేసి నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయడం తెలుగు సినిమా హిస్టరీలో ఇదే తొలిసారని చెప్పవచ్చు.
థమన్ వర్క్‌పై సుకుమార్ అసంతృప్తి!
ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ తనకు ఇచ్చిన భాగానికి నేపథ్య సంగీతం ఫినిష్ చేసి సుకుమార్‌కు చూపించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అటు శ్యామ్ సి.ఎస్, అజనీష్ లోకనాథ్ కూడా తమకు ఇచ్చిన పనిని పూర్తి చేసి సుకుమార్‌కు పంపారట. అయితే థమన్ ఇచ్చిన బీజీఎం స్కోర్ సుకుమార్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయిందని టాక్. కానీ, శ్యామ్ సి.ఎస్, అజనీష్ ఇచ్చిన ఔట్పుట్ చూసి సుకుమార్ ఫిదా అయిపోయారట. తాను అనుకున్న దానికంటే వారు బాగా ఇచ్చారని సుకుమార్ చాలా హ్యాపీ అయినట్లు మూవీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు థమన్‌ను మరోమారు వర్క్ చేసుకొని రావాలని సుక్కు సూచించినట్లు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి అది కూడా మెుత్తం కాదని, కొంత పోర్షన్ వరకూ మాత్రమే బెటర్‌గా ఇవ్వాలని కోరినట్లు సమాచారం. రెండ్రోజుల్లో థమన్ అది కూడా పూర్తి చేస్తారని అంటున్నారు.
ఇంకా పెండింగ్‌లో మరో సాంగ్!
‘పుష్ప 2’ (Pushpa 2)లో ఎంతో కీలకమైన ఐటెం సాంగ్‌ను ఇటీవల చిత్రీకరించారు. తెలుగు స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ‘కిస్సిక్’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో చేశారు. అల్లు అర్జున్‌తో కలిసి ఆమె అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు సమాచారం. లేటెస్ట్ బజ్ ప్రకారం నాల్గో సాంగ్‌ను షూట్ చేసేందుకు సుకుమార్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 22 నుంచి ఫోర్త్ సాంగ్ షూటింగ్ మెుదలవుతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 5న రిలీజ్ పెట్టుకుని ఇంకా షూటింగ్ జరగడం చూసి అల్లు అర్జున్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సినిమా చెప్పిన తేదీకే వస్తుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి సుకుమార్ ఫాస్ట్‌గా మ్యూజిక్ వర్క్, పెండింగ్ షూట్‌ను ఫినిష్ చేయాలని కోరుకుంటున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!