• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    దేవి శ్రీ ప్రసాద్

    దేవీశ్రీ ప్రసాద్ భారతీయ సంగీత దర్శకుడు. ఆయన ప్రధానంగా తెలుగుతో పాటు తమిళ్ చిత్రాలకు సంగీతం అందించారు. దేవీశ్రీ కుటుంబం శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. అందుకనే ఆయన చిన్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌ కావాలని కలలు కనేవారు. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన దేవి(1999) చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 'ఆనందం' చిత్రం ఆయనకు బ్రేక్ ఇచ్చింది. ఖడ్గం, మన్మథుడు, సొంతం, వెంకీ, ఆర్య, శంకర్‌దాదా MBBS, మాస్, నువ్వువస్తానంటే నేనొద్దంటానా, వర్షం, రెడీ, 100%లవ్, గబ్బర్ సింగ్, అత్తారింటికిదారేది, కుమారి 21F, రంగస్థలం, పుష్ప వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం సమకూర్చారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు)లలో భాగంగా తెలుగులో ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో అత్యధికంగా 11సార్లు నామినేటై, ఏడుసార్లు అవార్డును గెలుచుకున్నాడు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో పుష్ప (2021) సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నాడు.


    @2021 KTree