సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప 2: ది రూల్’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 17న విడుదలైన తర్వాత అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంపై తాజాగా ఆసక్తికర వార్తలు వెలువడుతున్నాయి. పుష్ప రాజ్ ఊచకోత సన్నివేశం యాక్షన్ ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తుందని సమాచారం. ఈ సన్నివేశం ఊహించని విధంగా ఉంటుందని, యాక్షన్ ప్రేమికులకు ఇది నిజమైన పండగగా మారుతుందని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ‘పుష్ప: ది రైజ్’లో వీరి జంటకు అందరూ ఫిదా కాగా, ఈసారి ఈ కాంబినేషన్ మరింత ఎమోషనల్‌గా ఉంటుందని చెబుతున్నారు.
భారీ బడ్జెట్ నిర్మాణం
మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా కోసం రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్, తమన్ ఇద్దరూ కలిసి సంగీతం అందిస్తున్నారు. వీరి కాంబినేషన్ అందరికీ అద్భుతమైన అనుభూతిని కలిగించనుందని సినీ వర్గాలు అంటున్నాయి.
సోషల్ మీడియాలో ‘వైల్డ్ ఫైర్’
‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారీ వ్యూస్‌ను సాధించి, ట్రెండింగ్‌లో నిలిచిన ఈ ట్రైలర్‌పై ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంసలు కురుస్తున్నాయి. “ఇది నిజంగానే వైల్డ్ ఫైర్” అని రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులు ప్రశంసలు అందజేశారు.
క్లైమాక్స్ గురించి ఆసక్తికర సమాచారం
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు హై ఓల్టేజ్ ఎనర్జీ అందించనుందని తెలిసింది. క్లైమాక్ యాక్షన్ సీన్ల కోసం భారీ స్థాయిలో సెట్స్ వేశారని తెలిసింది. గతంలో అల్లు అర్జున్ ఎప్పుడూ చేయని యాక్షన్ ఫీట్స్ ఈ చిత్రంలో చేశాడని సమాచారం. అభిమానులకు క్లైమాక్స్ సీన్లు మంచి థ్రిల్‌ను పక్కాగా అందిస్తాయని ట్రైలర్ లోనే హింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప రాజ్ పాత్ర క్లైమాక్స్‌లో చూపించే ఊచకోత సీక్వెన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని సమాచారం. కేవలం సెట్స్‌కే రూ.10 కోట్ల మేర ఖర్చు పెట్టినట్లు తెలిసింది. ఈ క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ప్రముఖుల స్పందన
ఈ చిత్ర ట్రైలర్‌పై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు:
- రాజమౌళి: “పుష్పగాడి వైల్డ్ ఫైర్ దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న ఈ అగ్ని మరింత ఎత్తుకు చేరనుంది.”
- అనిల్ రావిపూడి: “ఇది పవర్ ప్యాక్డ్ ట్రైలర్. బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నా.”
- హరీశ్ శంకర్: “పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తపన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాపై మీ ప్రేమకు హ్యాట్సాఫ్.”
- రిషబ్ శెట్టి: “ట్రైలర్‌లో మాస్ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. మరో బ్లాక్‌బస్టర్ సిద్ధమవుతోంది.”
- ప్రశాంత్ వర్మ: “పుష్పరాజ్ తిరుగుబాటును విప్లవంగా మార్చాడు. ఈసారి మరింత ఘోరంగా రాబోతున్నాడు.”
ఫ్యాన్స్ కోసం బన్నీ రిప్లై
నటుడు కిరణ్ అబ్బవరం చేసిన ట్వీట్‌కు అల్లు అర్జున్ స్పందిస్తూ, “థ్యాంక్యూ మై బ్రదర్. నీ సినిమా ‘క’ చూసి త్వరలో కాల్ చేస్తాను” అంటూ ప్రేమతో రిప్లై ఇచ్చారు.
డిసెంబర్ 5 – పుష్ప పండుగ
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పుష్పరాజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్ విజువల్స్ థియేటర్లలో ఓ పండుగలా ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
‘పుష్ప’ ఎప్పుడు తగ్గడు, ఈసారి మరింత శక్తివంతమైన ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. “నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అనుకుంటారా..?” అంటూ డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన కామెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
ఇంతకు మించి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం మరెంత ఆసక్తిగా ఎదురుచూస్తారో మాటల్లో చెప్పలేం! డిసెంబర్ 5న పుష్ప 2 ప్రేక్షకులకు ఎలా సర్‌ప్రైజ్ ఇస్తుందో చూడాలి!
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!