ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ (A.R Rahman) ఆహ్వానం మేరకు నటుడు రామ్ చరణ్ కడపలోని దర్గా (Ram Charan Kadapa Dargah)ను సోమవారం (నవంబర్ 18) సందర్శించారు. 80వ నేషనల్ ముషాయిరా గజల్ (ఉర్దూ కవి) సమ్మేళనాన్ని రామ్‌చరణ్ ప్రారంభించారు. తొలుత డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో కలిసి కడపలోని విజయ దుర్గా దేవీ ఆలయాన్ని చరణ్ సందర్శించారు. తన తదుపరి సినిమా ‘RC16’ స్క్రిప్ట్‌ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. అనంతరం దర్గాకు చేరుకున్న చరణ్ ‘మగధీర’ టైమ్‌లో దర్గాతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే చరణ్ మాలలో ఉండి దర్గాను దర్శించడం వివాదస్పదమవుతోంది. దీనిని సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మెగా ఫ్యాన్స్ దీటుగా సమాధానం ఇస్తున్నారు.
చరణ్‌కు ఊరమాస్ స్వాగతం..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan Kadapa Dargah) సోమవారం రాత్రి (నవంబర్ 19) 7 గం.లకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి కడప బయలుదేరారు. అనంతరం కడప విమానాశ్రయంలో దిగిన రామ్‌చరణ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన గురించి ముందే తెలుసుకున్న మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్ద సందడి చేశారు. విమానశ్రయం నుంచి చరణ్ బయటకు రాగానే బిగ్గరగా అరుస్తూ పలకరించారు. అనంతరం కడప దుర్గా దేవీ ఆలయానికి బయలుదేరిన చరణ్ వాహన శ్రేణిని పెద్ద ఎత్తున అభిమానులు అనుసరించారు. మార్గం మధ్యలో బాణా సంచా కాలుస్తూ తమ హీరో రాకను ఊరమాస్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు చరణ్ కంటే ముందే ఆలయం, దర్గా వద్ద చేరుకున్న మెగా ఫ్యాన్స్ అక్కడ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నెట్టింట భారీగా ట్రోల్స్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan Kadapa Dargah) ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పర మతానికి సంబంధించిన దర్గాకు మాలలో ఉండి వెళ్లడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది హిందువులను, ముస్లీములను అవమానించడమేనని నెట్టింట ఆరోపిస్తున్నారు. కొన్ని మతాలకు కట్టుబాట్లు ఉంటాయని దానిని ఎంతటి వారైనా అనుసరించి తీరాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ పిలుపు మేరకు దర్గాకు వచ్చానని చరణ్ అంటున్నారని, అదే రెహమాన్‌ను తిరుమలకు రమ్మని ఆహ్వానించగలవా? అని ప్రశ్నిస్తున్నారు. నీ మాట ప్రకారం రెహమాన్ రాగలడా? అంటూ నిలదీస్తున్నారు. చరణ్‌పై ఇప్పటివరకూ ఉన్న గౌరవం ఈ ఒక్క చర్యతో పోగొట్టుకున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఘాటుగా బదులిస్తున్న చరణ్ ఫ్యాన్స్!
తమ హీరోగా నెట్టింట జరుగుతోన్న ట్రోల్స్‌కు చరణ్ ఫ్యాన్స్ గట్టిగా బదులిస్తున్నారు. వాస్తవాలను ప్రస్తావిస్తూ చరణ్‌కు అండగా నిలుస్తున్నారు. అయ్యప్ప మాలలో ఉన్న వారు దర్గాను సందర్భించడం ఇదే తొలిసారి కాదని స్పష్టం చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలైకు వెళ్లే ముందుకు స్వాములు ముందుగా కేరళ ఎరుమెలిలోని వావర్ మసీదు (Vavar Juma Masjid)ను సందర్శించే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సైతం నెట్టింట షేర్ చేస్తున్నారు. హిందువు అయితే ఇతర మతస్తుల గుళ్లకు వెళ్లకూడదని రాజ్యాంగంలో ఉందా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. హిందుత్వానికి ఎంతో విలువ ఇచ్చే ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ లాంటి వారే దర్గాలకు వెళ్లారని గుర్తుచేస్తున్నారు. మన ధర్మాన్ని, సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి కాబట్టే చరణ్ దర్గాకు వెళ్లాడని సపోర్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీల విషయాల్లో వేలు పెట్టి పాపులర్ కావాలని చూడటం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయ్యిందని మెగా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్