దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోయిన్లలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడిన ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సూర్య, ధనుష్, నాని, శివ కార్తికేయన్, జయం రవి వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పవన్ పక్కన ‘ఓజీ’ సినిమాలో నటిస్తూ అందరి కళ్లు తనవైపు తిప్పుకుంది. కాగా, ఇవాళ ప్రియాంక మోహన్ పుట్టిన రోజు (HBD Priyanka Mohan). 29వ సంవత్సరంలోకి ఈ అమ్మడు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె కెరీర్‌లోని ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1995 నవంబర్ 20న కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రియాంక మోహన్ (HBD Priyanka Mohan) జన్మించింది. ఆమె అక్కడే విధ్యాబ్యాసం చేసింది. బయలాజికల్ ఇంజనీర్‌గా పట్టా అందుకుంది.
ప్రియాంక అమ్మ కన్నడిగ కాగా ఆమె తండ్రిది తమిళ నేపథ్యం. దీంతో కన్నడతో పాటు తమిళ భాషపైనా ప్రియాంకకు పట్టు వచ్చింది.
ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే ప్రియాంక పలు నాటకాలు వేసింది. ఆ సమయంలోనే రెండు, మూడు ప్రకటనల్లోనూ నటించింది.
ఆ సమయంలోనే ఫ్రెండ్స్ అంతా కలిసి డబ్బులు వేసుకొని మరి తనతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారని ప్రియాంక ఓ ఇంటర్వూలో రివీల్ చేసింది.
అలా చేసిన తన ఫస్ట్ కన్నడ సినిమా ‘ఒందు కథే హెళ్లా’ అని ప్రియాంక (HBD Priyanka Mohan) స్పష్టం చేసింది. అయితే ఈ సినిమా చేస్తున్న సంగతి ఇంట్లో అస్సలు చెప్పలేదట.
రిలీజయ్యాక అందులో ప్రియాంకను చూసి కుటుంబ సభ్యులు చాలా షాకయ్యారట. కానీ ఒక్క మాట కూడా అనలేదని, పైగా ప్రోత్సహించారని ప్రియాంక చెప్పింది.
నటనపై ఆసక్తి ఉనప్పటికీ సినిమాల్లోకి రావాలని ప్రియాంక ఎప్పుడు అనుకోలేదట. మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్నదట.
ఇండస్ట్రీలోకి రాకపోయుంటే ఈపాటికి మంచి కార్పోరేట్ సంస్థలో పని చేస్తూ ఉండేదానిని ప్రియాంక (HBD Priyanka Mohan) చెప్పింది.
నాని ‘గ్యాంగ్ లీడర్స్’ సినిమాతోనే ప్రియాంక తెలుగు తెరపై అడుగుపెట్టింది. తొలి రోజు షూటింగ్‌లో లక్ష్మీ, శరణ్య వంటి దిగ్గజ నటులను చూసి ప్రియాంక చాలా టెన్షన్‌కు గురైందట.
పెద్ద నటులతో చేసేంత అర్హత తనకు ఉందా అని ఆలోచించిందట. వెంటనే దర్శకుడు విక్రమ్ వద్దకు వెళ్లి ‘బాగా ఆలోచించే నన్ను తీసుకున్నారా.. తొందరపడ్డారేమో’ అని అనేసినట్లు ప్రియాంక తెలిపింది.
చిన్నప్పటి నుంచి ప్రియాంకకు సూర్య అంటే చాలా ఇష్టం. హీరో సూర్యతో కలిసి ‘ఈటీ’లో నటించే ఛాన్స్ రావడంతో ఎంతో సంతోషించినట్లు ఈ అమ్మడు తెలిపింది. షూటింగ్ పూర్తయ్యాక సూర్య గిఫ్ట్ పంపిస్తే దానిని ఇన్‌స్టాలో పోస్టు చేసి మరి ఈ భామ మురిసిపోయింది.
ప్రియాంక చాలా మృధుస్వభావి. ఎక్కడకు వెళ్లినా చాలా తక్కువగా మాట్లాడతారు. దీని వల్ల ఆమెకు స్నేహితులు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు.
హీరోయిన్లు నిత్యా మీనన్, అనుష్క, నజ్రియా అంటే ప్రియాంకకు ఎంతో అభిమానం. వారి నటన తనకు ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో ప్రియాంక చెప్పింది.
సాధారణంగా షూటింగ్ గ్యాప్ దొరికితే ఏ హీరోయిన్ అయినా వెంటనే విహారానికి వెళ్లిపోతారు. కానీ ప్రియాంక (HBD Priyanka Mohan) అలా కాదు.
తీరిక సమయాల్లో ఇంట్లోనే హాయిగా విశ్రాంతి తీసుకుంటుందట. లేదంటే నచ్చిన పనులు చేస్తూ ఫ్రీ టైమ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తుందంట. అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తుంది.
పొద్దున్నే లేవాలంటే ప్రియాంకకు చాలా కష్టంగా ఉంటుందట. కెరీర్ తొలినాళ్లలో వ్యాయమం చేయడానికి కూడా చాలా బద్దకించేదానినని ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పింది.
చికెన్ వంటకాలను ప్రియాంక (HBD Priyanka Mohan) బాగా చేస్తుందట. ఏ టైప్ చికెన్ డిష్ కావాలన్న చాలా రుచికరంగా చేసేస్తానని ఓ సందర్భంలో ఈ అమ్మడు తెలిపింది.
ఇక పొద్దున్నే కప్పు కాఫీ పడాల్సిందేనని ఈ అమ్మడు (HBD Priyanka Mohan) చెప్పింది. కాఫీ లేకుండా తన డే అస్సలు స్టార్ట్ కాదని చెపుకొచ్చింది.
తెర వెనుక తాను ఎలా ఉంటుందో సినిమాల్లోనూ అలాగే ఉండేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తోంది. స్కిన్‌షోలకు దూరంగా సంప్రదాయ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోంది.
తెలుగులో ఇప్పటివరకూ ‘గ్యాంగ్ లీడర్’తో పాటు ‘శ్రీకరం’, రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’ చిత్రాలు చేసింది. ప్రస్తుతం పవన్‌తో ‘ఓజీ’లో నటిస్తోంది.
అటు తమిళంలో శివకార్తికేయన్‌తో చేసిన ‘డాక్టర్’, ‘డాన్’.. ధనుష్‌తో చేసిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!