మెగా, అల్లు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఎన్నికల అనంతరం పవన్ భాగస్వామిగా ఉన్న కూటమి పార్టీలు భారీ విజయం సాధించడం, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేయడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ల పెంపు విషయంలో పవన్ ఏ విధంగా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర నిర్మాతలు పవన్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. అక్కడ పవన్ స్పందన చూసి అందరూ షాకవుతున్నారు.
పవన్.. గ్రీన్ సిగ్నల్!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13,500 స్క్రీన్స్‌లో ప్రదర్శితం కానుంది. దేశంలో 8,500, ఓవర్సీస్లో 5,000 థియేటర్లలో పుష్ప 2 షోలు పడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్లు దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. దీంతో టికెట్ల రేట్లు పెంపునకు అనుమతివ్వాలని తాజాగా వారు ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నారట. ఈ విషయపై పవన్‌తో నిర్మాతలు చర్చించినట్లు ఏపీ రాజకీయ వర్గాలు తెలిపాయి. టికెట్ల పెంపుపై పవన్ (Pawan Kalyan) సానుకూలంగా స్పందించారని అంటున్నారు. అల్లు వర్సెస్ మెగా అంటూ బయట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పవన్ ఎలా రియాక్ట్ అవుతారోనని నిర్మాతలు తెగ ఆందోళన చెందారట. కానీ, పవన్ చాలా కూల్‌గా ఓకె చెప్పడం చూసి వారు ఆశ్చర్యపోయారట. టికెట్ల పెంపునకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం ఏపీ ప్రభుత్వం నుంచి రానున్నట్లు తెలుస్తోంది.
పవన్ సాయం.. రూ.350 కోట్లు పక్కా!
టికెట్ల పెంపు అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లే త్వరలోనే తెలంగాణ సర్కార్‌ను కూడా ‘పుష్ప 2’ (Pushpa 2) టీమ్ కలవనుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా టికెట్ల పెంపుపై సానుకూలంగా స్పందించే ఛాన్స్ ఉంది. సగటున టికెట్‌పై రూ.100-125 పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్ ధరలు ప్రస్తుతం రూ.175 ఉండగా రూ.300, మల్టీప్లెక్స్‌లలో రూ.275 ఉండగా రూ.425 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు 13,500 స్క్రీన్స్‌లో ప్రదర్శితం కానుండటంతో ‘పుష్ప 2’ తొలిరోజే దాదాపుగా రూ.350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే కలెక్షన్స్ పరంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ డే 1 గ్రాసర్‌గా పుష్ప 2 చరిత్ర సృష్టించనుంది. రూ.223.5 కోట్ల తొలి రోజు కలెక్షన్స్‌తో ప్రస్తుతం RRR టాప్‌లో కొనసాగుతోంది. ‘పుష్ప 2’ తొలిరోజు రూ.350+ కోట్లు కలెక్ట్ చేస్తే టికెట్ల పెంపు ద్వారా పవన్ ఇచ్చిన ప్రోత్సాహం కూడా అందుకు కారణం కానుందని చెప్పవచ్చు.
ట్రైలర్ నేపథ్యంలో మళ్లీ లొల్లి..!
బిహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 (Pushpa 2) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ వేడుకకు ఎవరు ఊహించని స్థాయిలో భారీగా బన్నీ అభిమానులు తరలివచ్చారు. పొరుగు రాష్ట్రంలో బన్నీకి దక్కిన ఈ స్థాయి ఆదరణ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయాన్ని ఆయుధంగా చేసుకొని బన్నీ ఫ్యాన్స్ పవన్‌ను టార్గెట్ చేస్తున్నారు. పవన్‌కు కేవలం ఏపీలో మాత్రమే జనం వస్తారని, కానీ బన్నీకి ఉత్తరాది రాష్ట్రంలోని పాట్నాలో కూడా పోటెత్తారని కామెంట్స్ చేస్తున్నారు. బన్నీకి మద్దతుగా పోస్టులు పెడుతున్న వారిలో వైకాపా అభిమానులు సైతం ఉండటం విశేషం. అల్లు అర్జున్ ముందు పవన్ కల్యాణ్ నథింగ్ అంటూ మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నారు. మరోవైపు పవన్ ఫ్యాన్స్ సైతం గట్టిగా సమాధానం ఇస్తున్నారు. మహాారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్‌కు వచ్చిన ఆదరణ చూడాలని సూచిస్తున్నారు. దేశ ప్రధాని మెచ్చిన గొప్ప వ్యక్తి పవన్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
పుష్ప 2 మరో రికార్డు
‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం రిలీజ్‌కు ముందే పలు రికార్డులను కొల్లగొడుతోంది. తాజాగా ప్రీసేల్ బుకింగ్స్‌లో మరో ఘనత సాధించింది. ఓవర్సీస్లో అత్యంత వేగంగా ‘పుష్ప2’ (Pushpa 2) వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరింది. అమెరికన్ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘పుష్ప2’ నిలిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. ‘మరో రోజు.. మరో రికార్డుతో చరిత్ర సృష్టించాడు. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉంటుంది’ అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇది చూసిన అల్లు ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. పుష్ప గాడి జైత్ర యాత్ర మెుదలైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!