అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవల బాలకృష్ణ (Balakrishna) అన్‌స్టాపబుల్ (Unstoppable 4) షోకి వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. అందులో పలు ఆసక్తికర విషయాలను బన్నీ పంచుకోగా అవి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ ఎపిసోడ్‌కు పార్ట్ 2 కూడా ఉంటుందని అహా వర్గాలు ప్రకటించాయి. తాజాగా పార్ట్ 2కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ తన పిల్లలు అల్లు అర్హా, అల్లు అయాన్‌తో పాల్గొనడం విశేషం. అయితే తొలి ఎపిసోడ్‌లో లాగానే ఇందులోనూ పలు ప్రశ్నలకు బన్నీ సమాధానం ఇచ్చారు. అటు బన్నీ పిల్లలకు సైతం బాలయ్య క్యూట్ ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో తనకు సంబంధించిన వీక్‌నెస్‌ను బాలయ్య ఎదుట అల్లు అర్జున్ రివీల్ చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
బన్నీ సమస్య ఏంటంటే?
బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable Season 4). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్ కూడా ఫుల్ జోష్‌తో అలరిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్‌తో బాలయ్య చేసిన ఇంటర్వ్యూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో సెకండ్ పార్ట్‌ను నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు ఆహా వర్గాలు ప్రకటించాయి. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ తనను ఎంతోకాలంగా వెంటాడుతున్న ఓ సమస్య గురించి ప్రస్తావించారు. ‘నీలో నువ్వు మార్చుకుందాం అనుకుంటుంది ఏంటి?’ అన్న బాలయ్య ప్రశ్నకు బన్నీ సమాధానం ఇస్తూ ‘ఇకపై తొందరగా పడుకొని నాలుగున్నర, ఐదు గంటల కల్లా లేవాలి’ అని చెప్తాడు. దీన్ని బట్టి లేటుగా పడుకోని పొద్దెక్కే వరకూ లేగకపోవడం బన్నీకి అలవాటని తెలుస్తోంది. దీనిని వీలైనంత త్వరగా మార్చుకోవాలని బన్నీ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ ప్రయత్నంలో బన్నీ సక్సెస్ కావాలని మనమూ కోరుకుందాం.
బాలయ్యను ఫిదా చేసిన అర్హా!
అల్లు అర్జున్ (Allu Arjun) పార్ట్ 2 ఎపిసోడ్ (Unstoppable 4)లో అల్లు అర్హ (Allu Arha), అల్లు అయాన్ (Allu Ayaan) పాల్గొని సందడి చేశారు. ఇద్దరూ షోలో అడుగుపెడుతూనే బాలయ్య పాదాలకు నమస్కరించడం ప్రోమాలో చూడవచ్చు. ఈ క్రమంలో బాలయ్య వీళ్లకు తెలుగు వచ్చా? అని బన్నీని ప్రశ్నిస్తారు. వెంటనే అల్లు అర్హ ‘అటజని కాంచె పద్యం’ చెప్పి బాలయ్య సహా షోలో ఉన్న వారందరినీ ఆశ్చర్య పరిచింది. పదో తరగతి తెలుగు సిలబస్‌లో ఉన్న ఈ పద్యాన్ని గుక్క తిప్పుకోకుండా అర్హ చెప్పడంతో అందరూ మెచ్చుకుంటున్నారు. బాలయ్య సైతం అర్హను దగ్గరకు తీసుకొని అభినందించారు. బన్నీ తన వారసురాలికి తెలుగుపై పట్టు ఉండేలా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయాన్.. యానిమల్ హీరో టైపు!
ప్రోమోలో అల్లు అయాన్ (Allu Ayaan)ను బాలయ్య (Unstoppable 4) ఆసక్తికర ప్రశ్న అడుగుతారు. ‘నాన్నకు నీకంటే చెల్లి మీదే ప్రేమ ఎక్కువ కదా?’ అని అయాన్‌ను ప్రశ్నిస్తారు. అప్పుడు అయాన్ ‘ఏం కాదు’ అని జవాబిస్తాడు. దీంతో బన్నీ కలుగుజేసుకొని ‘యానిమల్ సినిమాలో రణ్‌బీర్ టైపు తను’ అని అయాన్ గురించి చెప్తాడు. నాన్నకు ఇబ్బంది కలుగుతుంటే అస్సలు తగ్గడని వ్యాఖ్యానిస్తాడు. ఈ మాట బాలయ్య విని “ఐకాన్ స్టార్ కు అమ్మ మొగుడు అయ్యేలా ఉన్నాడు” అంటాడు. అప్పుడు వెంటనే అయాన్ ‘తగ్గేదే లే’ అన్న పుష్ప మ్యానరిజాన్ని చూపించి అందరినీ నవ్వించాడు. మెుత్తం బన్నీ, అతని పిల్లలతో సెకండ్ ఎపిసోడ్ సరదా సరదాగా సాగిపోతుందని ప్రోమోను బట్టి తెలిసిపోతోంది.
స్టార్స్ గురించి ఏమన్నారంటే?
ఫస్ట్ ఎపిసోడ్ (Unstoppable 4)లో పలు హీరోలను స్క్రీన్‌పై చూపిస్తూ వారికి గురించి అభిప్రాయం ఏంటో చెప్పాలని బన్నీని బాలయ్య అడిగారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ధైర్యం అంటే తనకు చాలా ఇష్టమని బన్నీ చెప్పారు. సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ మెన్స్‌ను దగ్గర నుంచి చూస్తుంటానని తెలిపారు. కానీ తాను లైవ్‌లో మాత్రం పవన్ కల్యాణ్ ధైర్యాన్ని చూస్తుంటానని ప్రశంసించారు. చాలా డేరింగ్ పర్సన్ అంటూ పవన్‌ను ఆకాశానికెత్తారు. మహేష్ బాబు (Mahesh Babu) గురించి మాట్లాడుతూ అందరూ అతడి అందం గురించే మాట్లాడతారని, కానీ అయన కమ్‌బ్యాక్స్ చాలా బాగుంటాయని పేర్కొన్నారు. ఇక ప్రభాస్ (Prabhas) గురించి ప్రస్తావిస్తూ అతడు ఆరడుగుల బంగారమని కొనియాడాడు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) గురించి మాట్లాడుతూ ఈ జనరేషన్ హీరోల్లో వావ్ అనిపించే యాక్టర్ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ జనరేషన్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ అంటే చాలా ఇష్టమని స్పష్టం చేశాడు.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్