• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Drinker Sai Movie Review: బాక్సాఫీస్‌ వద్ద తడబడ్డ ‘డ్రింకర్‌ సాయి’.. తేడా ఎక్కడ కొట్టిదంటే?

    నటీనటులు : ధర్మ కాకాని, ఐశ్వర్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, పోసాని కృష్ణ మురళి, సమీర్‌, కిర్రాక్‌ సీత తదితరులు

    దర్శకత్వం : తిరుమలశెట్టి కిరణ్‌

    సంగీతం: శ్రీ వసంత్‌

    సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ అంకిరెడ్డి

    ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌

    నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్‌, లహరిధర్‌

    విడుదల తేదీ: డిసెంబర్‌ 27, 2024

    ధర్మ, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘డ్రింకర్‌ సాయి’ (Drinker Sai). తిరుమలశెట్టి కిరణ్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేశారు. మద్యం, ధూమపానం వల్ల లైఫ్‌ను ఎలా తలకిందులు చేస్తాయో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌, టీజర్‌ వినూత్నంగా ఉండి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్‌ 27, 2024న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా? సమాజానికి మంచి సందేశం ఇచ్చిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Drinker Sai Movie Review)

    కథేంటి

    కోటీశ్వరుడైన సాయి (ధర్మ) నిత్యం తాగుతూ డ్రింకర్ సాయిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ‌అతడికి మంచి, చెడు చెప్పేవారే లేకుండా పోతారు.  మరోవైపు బాగీ (ఐశ్వర్య శర్మ) క్రమశిక్షణ కలిగిన యువతిగా జీవిస్తుంటుంది. మంచి ఆరోగ్య అలవాట్లను పాటిస్తుంటుంది. ఓ యాక్సిడెంట్‌ ద్వారా డ్రింకర్‌ సాయి ఆమె లైఫ్‌లోకి వస్తాడు. తొలి చూపుతోనే ఆమెను ప్రేమిస్తాడు. బాగీకి అతడంటే ఇష్టం లేనప్పటికీ వైలెన్స్‌ చేస్తాడన్న భయంతో భరిస్తూ వస్తుంటుంది. ఈ బలవంతపు లవ్‌స్టోరీ ఎక్కడ వరకూ సాగింది? డ్రింకర్ సాయిని బాగీ ప్రేమిస్తుందా ? ఒకవేళ ప్రేమిస్తే దానికి గల కారణాలు ఏంటి? బాగీ ప్రేమతో డ్రింకర్‌ సాయిలో వచ్చిన మార్పులు ఏంటి? అన్నది స్టోరీ. 

    ఎవరెలా చేశారంటే

    డ్రింకర్‌ సాయి పాత్ర (Drinker Sai Movie Review)లో యువ నటుడు ధర్మ సాలిడ్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశాడు. అతడి రూపంలో ఇండస్ట్రీకి మంచి నటుడు దొరికాడని చెప్పవచ్చు. భావోద్వేగాలను ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా పలికించాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య శర్మ ఆకట్టుకుంది. హావాభావాలను చక్కగా పలకిస్తూ మెప్పించింది. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కిర్రాక్‌ సీత, రీతు చౌదరి తమ కామెడీతో అక్కడక్కడ నవ్వించారు. మంతెన సత్యనారాయణకు స్పూఫ్‌గా చేసిన వంతెన పాత్రతో నటుడు భద్రం ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పాత్ర పెద్దగా ఫన్‌ క్రియేట్‌ చేయలేకపోయింది. మిగిలిన పాత్రధారులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు తిరుమలశెట్టి కిరణ్‌ రొటీన్‌ కథతో సినిమాను తెరకెక్కించారు. తాగుడుకు బానిసైన హీరో.. తనను చూస్తేనే చికాకు పడే హీరోయిన్‌ను ఎలా ప్రేమలో పడేశాడు? అన్న కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించారు. హీరో, హీరోయిన్ల పాత్రలు పరిచయం, ఆపై బాగీ వెంట సాయి పడటం, ఆమె ఛీకొట్టడం వంటి సీన్లతో తొలిభాగాన్ని ఫన్నీగా నడిపించాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌ వంతెన ఆశ్రమానికి కథ మళ్లడం, ఆశ్రమంలో కనిపించే ప్రతి విషయాన్ని సెటైరికల్‌గా చూపించారు. కొంతవరకూ వంతెన క్యారెక్టర్‌ బాగునప్పటికీ ఆశ్రమం చుట్టూ కథను ఎక్కువగా సాగదీయడం విసుగు తెప్పించింది. ఇక క్లైమాక్స్‌లో దర్శకుడు ఇచ్చిన సందేశం బాగుంది. కథ, కథనం విషయంలో దర్శకుడు కాస్త జాగ్రత్త పడి ఉంటే రిజల్ట్‌ నెక్స్ట్‌ లెవల్లో ఉండేదని చెప్పవచ్చు. 

    సాంకేతికంగా

    టెక్నికల్‌ విషయాలకు వస్తే శ్రీ వసంత్ సమకూర్చిన పాటలు జస్ట్‌ ఓకే అనేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం అక్కడక్కడ ఆకట్టుకుంది. కెమెరామెన్‌ ప్రశాంత్‌ అంకిరెడ్డి మంచి పనితీరు కనబరిచాడు. సినిమాను చూపించిన విధానం మెప్పిస్తుంది. ఎడిటింగ్‌ వర్క్‌ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్ పాయింట్స్‌

    • హీరో, హీరోయిన్‌ నటన
    • భావోద్వేగాలు
    • సందేశం

    మైనస్‌ పాయింట్స్‌

    • రొటిన్‌ కథ, కథనం
    • సాగదీత సన్నివేశాలు
    • సహనానికి పరీక్షించే వంతెన పాత్ర

    Telugu.yousay.tv Rating : 2.5/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv