• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ram Charan Cutout: రామ్‌చరణ్ బిగ్గెస్ట్‌ కటౌట్‌.. హెలికాఫ్టర్‌తో పూల వర్షం.. ఎక్కడంటే?

    గ్లోబల్‌ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ‘పుష్ప 2‘ (Pushpa 2) తర్వాత టాలీవుడ్‌ నుంచి వస్తోన్న బిగ్‌ ప్రాజెక్ట్‌ కావడంతో ప్రస్తుతం అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కాబోతోంది. జనవరి 10న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే  తమ అభిమాన హీరో కోసం దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ను ఫ్యాన్స్‌ సిద్ధం చేస్తున్నారు.

    దేశంలో అతిపెద్ద కటౌట్‌

    ప్రముఖ సినీ హీరో రామ్‌చరణ్‌ భారీ కటౌట్‌ విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో సిద్ధమవుతోంది. 256 అడుగుల ఎత్తు ఉండే దీన్ని డిసెంబర్‌ 29న ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు ‘గేమ్‌ ఛేంజర్‌’ నిర్మాత ‘దిల్‌’ రాజు హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదగానే ఈ బిగ్‌ కటౌట్‌ లాంచింగ్‌ జరగనుంది. అనంతరం కటౌట్‌పై హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కటౌట్‌ తయారీ పనులు నాలుగు రోజుల నుంచి ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కటౌట్‌ దేశంలోనే అతి పెద్దది అని అభిమానులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి 15 వందల నుంచి రెండు వేల మంది అభిమానాలు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. కటౌట్‌ ఓపెనింగ్‌ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి సైతం లభించినట్లు పేర్కొన్నారు. 

    ట్రైలర్‌ రిలీజ్‌ మరింత ఆలస్యం!

    గేమ్‌ ఛేంజర్‌‘ (Game Changer) సినిమా రిలీజ్‌కు సరిగ్గా 13 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పటివరకూ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయకపోవడంపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. సాధారణంగా ఏ సినిమా ట్రైలర్‌ అయినా విడుదలకు 15 రోజుల ముందు రిలీజ్‌ చేస్తుంటారు. అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’ లాంటి పాన్ ఇండియా చిత్రం ట్రైలర్ ఇంకా విడుదల కాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. లేటెస్ట్ బజ్‌ ప్రకారం సినిమా రిలీజ్‌కు ఐదు రోజుల ముందు ‘గేమ్‌ ఛేంజర్‌’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

    చరణ్‌ రెమ్యూనరేషన్ ఎంతంటే?

    గేమ్ ఛేంజర్‌’ (Game Changer) మూవీకి రామ్‌చరణ్‌ పారితోషికంపై ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు చరణ్‌ రూ.100 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. మూవీ బడ్జెట్‌లో దీని వాటా 22% వరకూ ఉందని ప్రచారం జరుగుతోంది. అటు ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు టాక్‌. సినిమాలోని పాటలకు ఏకంగా రూ.80-90 కోట్లు ఖర్చు అయ్యిందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ‘జరగండి జరగండి’, ‘రా మచ్చ మచ్చ’, ‘నానా హైరానా’, ‘దోప్‌’ సాంగ్స్ టీజర్స్ చూస్తే సాంగ్స్‌కు బాగా ఖర్చు చేసినట్లు అర్ధమవుతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv