• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నేడు దుర్గమ్మ సన్నిధికి పవన్ కళ్యాణ్

  నేడు విజయవాడ – ఇంద్రకీలాద్రికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ రానున్నారు. దుర్గమ్మను పవన్‌ దర్శించుకోనున్నారు. జనసేన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి అమ్మవారి సమక్షంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజ అనంతరం కృష్ణా జిల్లా నేతలో ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచారం రూట్ మ్యాప్‌పై చర్చించనున్నారు. రూట్‌ మ్యాప్‌పై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.

  టీడీపీ ఆఫీస్‌ తొలగింపుతో ఉద్రిక్తత

  ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంటికి సమీపంలో ఉన్న టీడీపీ ఆఫీస్‌ను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీలు, కంప్యూటర్, ఫర్నీచర్‌ను అక్కడి నుంచి తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చారు. దేవినేని ఉమాను గృహనిర్భంధం చేశారు. భూ వివాదాల నేపథ్యంలోనే కార్యాలయాన్ని తొలగించినట్లు తెలుస్తోంది.

  హైదరాబాద్-విజయవాడ మధ్య హైస్పీడ్ ట్రైన్!

  హైదరాబాద్-విజయవాడ మధ్య ఆర్ఆర్టీఎస్(రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) ట్రైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టారు. దేశంలో 7 ఆర్ఆర్టీఎస్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించగా.. వాటిలో హైదరాబాద్-విజయ వాడ మార్గం ఒకటి. ఈ రైలు విమాన ప్రయాణ అనుభూతిని ఇస్తుంది. ఈ రైలు ఏసీ, రెక్లెయినర్ సీట్లు, అద్దాల కిటికీలు, లాంజ్‌లు, లగేజీ ర్యాక్‌లు, రూట్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తారు. గంటకు 160 నుంచి 200 కి.మీ వేగంతో దూసుకెళ్లొచ్చు. 2024లో పనులు చేపట్టే అవకాశం ఉంది.

  ‘వందేభారత్‌’కు మార్గం సుగమం

  విజయవాడ-దువ్వాడ ట్రాక్ ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో సికింద్రాబాద్-విజయవాడ-దువ్వాడ మధ్య 130 కి.మీ వేగంతో రైళ్లు దూసుకెళ్లనున్నాయి. ముఖ్యంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణానికి మార్గం సుగమం అయింది. విజయవాడ నుంచి 7.50కు బయల్దేరిన ట్రైన్ దువ్వాడకు 11.50కు చేరుకుంది. 4 గంటల్లోనే 330 కి.మీ ప్రయాణించింది. ఇదివరకటితో పొల్చితే గంటన్నర సమయం ఆదా అవుతుంది. గౌతమి, గోదావరి, కోణార్క్, ఏపీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 130 కి.మీ వేగంతో పరుగులు తీయనున్నాయి.

  దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

  ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును విజయవాడలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుఝామునే ఉమా ఇంటికి వచ్చిన పోలీసులు ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఉమా ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కానీ ఉమాను ఎందుకు గృహ నిర్భందం చేశారో అంతుబట్టడం లేదు. పార్టీ కార్యకర్తల సమాచారం ప్రకారం కుప్పం ఘటనకు నిరసనగా ఉమా ఆందోళన చేపడతాడని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

  నేటి నుంచి ఏపీకి 10 స్లీపర్ బస్సులు

  హైదరాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, కాకినాడ ప్రాంతాలకు 10 స్లీపర్ బస్సులు ప్రారంభం కానున్నాయి. ఈ బస్సులను ఈరోజు హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ నుంచి ప్రారంభిస్తారు. ఈ బస్సులను టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లు జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటిలో 4 స్లీపర్ బస్సులు, 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. కాకినాడ వైపు వెళ్లే బస్సులు ప్రతిరోజు బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. విజయవాడ వైపు బయలుదేరే బస్సులు మియాపూర్ నుంచి ప్రారంభమవుతాయి.

  దుర్గమ్మ సన్నిధిలో నిలువు దోపిడీ!

  AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. చెప్పుల స్టాండు నుంచి మొదలు కొని ఆఖరుకు కొబ్బరికాయ కొట్టే చోట కూడా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం. దీంతో అమ్మవారికి చెల్లించే ముడుపుల కన్నా.. ఆలయంలోనే ఎక్కువగా వ్యయం అవుతోందంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలున్నా.. ఇలా భక్తుల నుంచి రుసుం వసూలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఆలయ అధికారులకు పట్టదా? అంటూ ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల పనితీరుపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

  హైవేపై ట్యాంకర్ బోల్తా; భారీగా ట్రాఫిక్

  విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తూఫ్రాన్ పేట్ వద్ద హైవేపై గురువారం ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ వరకు ట్రాఫిక్ నిలిచి భారీసంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను పక్కకు తొలగిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  విజయవాడలో హౌస్ సర్జన్ అదృశ్యం

  AP: విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ విద్యార్థి అమూల్య అదృశ్యమయ్యారు. హాస్టల్ రూమ్‌లో ఆమె రాసిన సూసైడ్ నోట్ లభ్యమవడం కలకలం రేపింది. తెలంగాణలోని జహీరాబాద్‌కు చెందిన విద్యార్థి అమూల్య ఏడాది పాటు హౌస్ సర్జన్ చేయడానికి విజయవాడ వచ్చింది. సిద్ధార్థ మెడికల్ ప్రభుత్వ కళాశాలలో చేరి విద్యనభ్యసిస్తోంది. ఈ మేరకు తాజా ఘటన జరగడంతో కళాశాల ప్రిన్సిపల్ విఠల్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులతో పాటు.. విజయవాడ సెంట్రల్ ఏసీపీకీ … Read more

  విజయవాడలో బీఆర్ఎస్ ఆఫీస్

  ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి అధిష్టానం నిర్ణయించింది. జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవే సమీపంలో స్థల సమీకరణ చేశారు. దాదాపు 800 గజాల విస్తీర్ణంలో ఈ ఆఫీస్ నిర్మాణం చేపట్టనున్నారు. పార్టీ ఆఫీస్ ఏర్పాటు పనులను తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18, 19 తేదీల్లో తలసాని విజయవాడకు రానున్నారు.