• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Max Movie Review: కిచ్చా సుదీప్‌ మాస్‌ తాండవం.. ‘మ్యాక్స్‌’ ఎలా ఉందంటే?

    నటీనటులు : కిచ్చా సుదీప్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సంయుక్త హోర్నాడ్‌, సుక్రుతా వాగ్లే, అనిరుధ్‌ భట్‌ తదితరులు

    దర్శకత్వం : విజయ్‌ కార్తికేయ

    సంగీతం : అజనీష్‌ లోక్‌నాథ్‌

    ఎడిటింగ్‌ : ఎస్‌. ఆర్‌. గణేష్‌ బాబు

    నిర్మాతలు : కలైపులి ఎస్‌. థను, సుదీప్‌

    విడుదల తేదీ :  డిసెంబర్‌ 27, 2024

    కన్నడ స్టార్ సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మాక్స్’ (Max). ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రలు చేశారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. ఇందులో సుదీప్‌ పవర్‌ఫుల్‌ పోలీసు పాత్ర చేశాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఈ చిత్రం డిసెంబర్ 27న తెలుగు, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. (Max Movie Review)

    కథేంటి

    మాక్స్‌ (సుదీప్‌ కిచ్చా) ఓ కేసు విషయంలో సస్పెండ్‌ అయ్యి (Max Movie Review In Telugu)తిరిగి డ్యూటీలో చేరేందుకు బయలు దేరతాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో ఇద్దరు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో వారిని చితక్కొట్టి అరెస్ట్‌ చేస్తాడు. అయితే వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసు స్టేషన్‌లో ఉన్న నిందితులిద్దరు అనూహ్యంగా మరణిస్తారు. వారిద్దరు ఎలా చనిపోయారు? కుమారులు చనిపోయారన్న వార్త మంత్రులకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? బంధీగా ఉన్న మినిస్టర్స్‌ కొడుకులను విడిపించేందుకు క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రూప (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌), గ్యాంగ్‌స్టర్‌ గని (సునీల్‌) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్‌ ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    సీఐ మ్యాక్స్‌ (Max Movie Review) పాత్రలో కన్నడ నటుడు సుదీప్‌ జీవించేశాడు. యాక్షన్‌, మాస్‌ కలగలసిన ఈ పాత్రలో దుమ్మురేపాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లో తన మార్క్‌ చూపిస్తూ అలరించాడు. ఇక నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో వరలక్ష్మీ చక్కగా ఒదిగిపోయింది. కథలో ఆమెకు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కింది. ఆమెకు ఇచ్చిన ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. విలన్‌ గనిగా సునీల్‌ రొటీన్‌ పాత్రలో కనిపించాడు. ప్రతినాయకుడిగా తనదైన శైలిలో ప్రభావం చూపించాడు. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్‌ తమ నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    దర్శకుడు విజయ్‌ కార్తికేయ.. తమిళ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ తీసిన ‘ఖైదీ’, ‘విక్రమ్’ ఛాయలతో సినిమాను రూపొందించారు. మాస్ ఆడియన్స్‌కు నచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు, హై మూమెంట్స్ ఇందులో చాలానే ఉన్నాయి. థ్రిల్లింగ్ మూమెంట్స్ కావాలని అనుకునే ఆడియన్స్‌కి అవి కూడా ఉంటాయి. మంత్రుల కొడుకులను హీరో అరెస్టు చేయడం, దీంతో పోలీసు స్టేషన్‌ చుట్టూ రౌడీలు తిరుగుతుండటం, వారి కంట్లో పడకుండా పోలీసులు జాగ్రత్త పడటం వంటి సీన్స్‌తో ఫస్టాప్‌ యావరేజ్‌గా సాగింది. సెకండాఫ్‌ నుంచి కథను పరుగులు పెట్టించాడు డైరెక్టర్‌. టైమ్‌ కౌంట్‌ చేస్తూ వచ్చే సీన్స్‌ అదిరిపోతాయి. క్లైమాక్స్ కూడా మెప్పించేలా దర్శకుడు రూపొందించాడు. ఇతర చిత్రాలతో పోలికలను పక్కన పెడితే యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారికి ‘మ్యాక్స్‌’ నచ్చుతుంది. 

    సాంకేతికంగా.. 

    టెక్నికల్‌ విషయాలకు వస్తే (Max Movie Review).. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. అజనీష్‌ లోకనాథ్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. తనదైన BGMతో సినిమా స్థాయిని పెంచేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే నేపథ్య సంగీతం నెక్ట్స్‌ లెవల్లో ఉంటుంది. అయితే పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై కనిపించింది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • సుదీప్‌ నటన
    • యాక్షన్‌ సీక్వెన్స్
    • నేపథ్య సంగీతం

    మైనస్ పాయింట్స్‌

    • ఫస్టాఫ్‌
    • చూసినట్టు ఉండే సీన్స్‌
    Telugu.yousay.tv Rating : 3/5 
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv