• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ramcharan: ఎన్టీఆర్‌ను కొట్టి ఏడ్చేసిన రామ్‌చరణ్‌.. వీడియో వైరల్‌ 

    టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో రామ్‌చరణ్‌ (Ram charan), జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. వారిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్‌ ఉందో అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘RRR’ బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని సైతం అందుకుంది. మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా చరణ్‌, తారక్‌ చేసిన అల్లరి అంతా ఇంత కాదు. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వారు పలు వేదికలపై పంచుకున్నారు. ఇదిలా ఉంటే ‘RRR’ మూవీ షూటింగ్‌ సందర్భంగా తారక్‌ను చరణ్‌ కొరడాతో కొట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వెంటనే చరణ్‌ ఇచ్చిన రియాక్షన్‌ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

    తారక్‌ను కొట్టి బాధపడ్డ చరణ్‌

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR‘ చిత్రానికి సంబంధించిన డాక్యుమెంటరీ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్ బియాండ్‌’ (RRR: Behind And Beyond) పేరుతో దీనిని తీసుకొచ్చారు. మూవీ షూటింగ్స్ సందర్భంగా జరిగిన విషయాలను ఈ డాక్యూమెంటరీలో పంచుకున్నారు. ఇదిలా ఉంటే ‘కొమురం భీముడో’ పాట సందర్భంగా తారక్‌ను రామ్‌చరణ్‌ కొరడాతో కొట్టే సీన్లు ఉంటాయి. తారక్‌ను కొట్టిన అనంతరం చరణ్‌ వెంటనే వెళ్లి హగ్‌ చేసుకునే దృశ్యాలను డాక్యుమెంటరీలో చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తారక్‌కు ఎక్కడ దెబ్బ తగిలిందోనని చరణ్‌ తెగ బాధ పడిపోవడం వీడియోలో గమనించవచ్చు. 

    అది చరణ్‌ అంటే..!

    తాజా వీడియో చూసి మెగా ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. రామ్‌ చరణ్‌ గొప్ప మనసు మరోమారు బయటపడిదంటూ కొనియాడుతున్నారు. రామ్ చరణ్ మనసు చాలా సున్నితమైనదని ప్రశంసిస్తున్నారు. ఎవరికీ ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొరడతో కొట్టే దానికి సంబంధించి గతంలోనే ఓ మహిళా ఆర్టిస్టు ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ‘ఒక రెండు దెబ్బలు ఎన్టీఆర్‌ గారిని కొరడాతో కొట్టారు. ఆయనకు దెబ్బ తగిలిందేమోనని ఈయన వెంటనే ఏడ్చేశారు. సార్‌ను హగ్‌ చేసుకొని సారీ సారీ చెబుతుంటే మా అందరికీ ఆశ్చర్యం వేసింది’ అంటూ ఆమె సదరు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. 

    ఆ సీన్‌ గ్రాఫిక్‌ కాదట.. 

    RRR’ చిత్రంలో రామ్‌చరణ్ ఇంట్రడక్షన్‌ సీన్‌ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పదుల సంఖ్యలో ఉన్న నిరసనకారులతో చరణ్‌ పోరాడే సీన్‌ ప్రతీఒక్కరికీ గూస్‌బంప్స్‌ తెప్పించింది. ఈ సందర్భంగా చరణ్‌ను చూసి భయపడి అక్కడి జనసందోహమంతా ఒక్కసారిగా వెనక్కి జరుగుతుంది. ఈ సీన్‌ను చరణ్‌ కంటిరెప్పల లోపల నుంచి జక్కన్న తెరపై చూపించారు. వాస్తవానికి ఈ సీన్‌ గ్రాఫిక్స్‌ అని అంతా భావించారు. కానీ ఆ సీన్‌ రియల్‌గానే తీసినట్లు జక్కన్న తాజా డాక్యూమెంటరీలో స్పష్టం చేశారు. చెర్రీ కన్నుకు దగ్గరగా కెమెరాను పెట్టి ఆ సీన్‌ను ఎలా తీశారో వివరించారు.

    కొత్త దర్శకులకు ప్రేరణగా..

    ‘ఆర్ఆర్ఆర్‌: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీని ఒక గంట 37 నిమిషాల రన్ టైంతో రిలీజ్‌ చేశారు. షూటింగ్‌ సందర్భంగా రామ్‌చరణ్‌, తారక్‌, రాజమౌళి అండ్‌ టీమ్‌ ఎంత కష్టపడ్డారో ఇందులో చూపించారు. ఈ డాక్యుమెంటరీ కొత్త దర్శకులకు స్ఫూర్తిగా నిలవనుంది. ఇక ఈ మూవీలో తారక్‌, చరణ్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగన్, శ్రేయా కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘RRR‘ మూవీ 2021లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. అంతేకాదు ఆస్కార్ అవార్డును గెలుచుకుని చరిత్రను సృష్టించింది. 

    చరణ్‌, తారక్‌ బిజీ బిజీ..

    రామ్‌చరణ్‌ సినిమాలకు వస్తే ఆయన నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్‌ కాబోతోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌ నటిస్తున్నారు. ‘RC16’ వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ జరుపుకుంటోంది. దీని తర్వాత సుకుమార్‌తో ‘RC 17’ ప్రాజెక్ట్‌లో చరణ్‌ నటించనున్నారు. మరోవైపు ‘దేవర’ తర్వాత స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో తారక్‌ ఓ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు. అలాగే తన ఫస్ట్ బాలీవుడ్‌ చిత్రం ‘వార్‌ 2’లోనూ తారక్‌ నటిస్తున్నాడు. ఇవి కాకుండా తమిళ స్టార్ డైరెక్టర్‌ వెట్రిమారన్‌తోనూ తారక్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు ఉన్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv