ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై శుక్రవారం వైకాపా నేత దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పరామర్శించారు. దాడి జరిగిన తీరు గురించి అడిగి తెలుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ విపక్ష వైకాపాపై విరుచుకుపడ్డారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో అభిమానులు చేసిన పనికి పవన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. వారిపై ఫైర్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఫ్యాన్స్‌పై పవన్ ఆగ్రహం..
కడప రిమ్స్‌కు పవన్ వస్తున్నారన్న వార్త విని పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు పోటెత్తారు. పవన్ ప్రెస్‌మీట్ నిర్వహించిన క్రమంలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడి అంశంపై పవన్ సీరియస్‌గా మీడియాతో మాట్లాడుతుండగా ‘ఓజీ.. ఓజీ.. ఓజీ..’ అంటూ స్లోగన్స్ చేశారు. దీంతో పవన్ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. ‘ఏంటయ్య మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఐదు భాషల్లో పవన్ సింగింగ్..!
ప్రస్తుతం పవన్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ లాక్ అయినట్లు తెలుస్తోంది. జనవరి ఒకటో తారీకు 12AMకు రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను పవన్ స్వయంగా పాడినట్లు తెలుస్తోంది. మెుత్తం ఐదు భాషల్లో ఆయన గొంతు వినిపించినట్లు సమాచారం. దీంతో రిలీజ్ తర్వాత ఈ సాంగ్ ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఇప్పటినుంచే అంచనాలు వేస్తున్నారు.
గతంలో పవన్ పాడిన సాంగ్స్..
పవన్.. సినీ నటుడు, పొలిటీషియన్‌గానే కాకుండా మంచి సింగర్‌గాను గుర్తింపు పొందాడు. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో ఆయన గాత్రదానం చేశారు. అవి ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించాయి. పవన్ ఇప్పటివరకూ ‘ఎమ్ పిల్ల మాటాడవా’ (తమ్ముడు), తాటి చెట్టు ఎక్కలేడు (తమ్ముడు), బైబైయే బంగారు రమణమ్మ (ఖుషి), నువ్వు సారా తాగుట (జానీ), రావోయి మా ఇంటికి (జానీ), పాపారాయుడు (పంజా), కాటమరాయుడా (అత్తారింటికి దారేది), రాజులకి రాజు పోతురాజు (జనసేన ప్రైవేట్ సాంగ్), కొడకా కోటేశ్వర్ రావు (అజ్ఞాతవాసి) పాటలు పాడారు.
పవన్ బిజీ బిజీ..
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. వరుస మీటింగ్స్, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు దర్శక – నిర్మాతలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పట్టాలెక్కించిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. తన తదుపరి చిత్రాలు ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ షూట్స్‌లో వీలు కుదిరినప్పుడు పాల్గొంటున్నారు. సుజీత్ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న చిత్రమే ‘ఓజీ’. యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా ఇది సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి