ఒకప్పుడు సినిమా సక్సెస్‌ను కలెక్షన్స్ బట్టి కాకుండా ఎన్ని రోజులు ఆడింది అన్నదానిని కొలమానంగా తీసుకునేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కలెక్షన్స్‌ను బట్టి ఆ సినిమా సక్సెస్‌ను డిసైడ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మేకర్స్ సైతం ఏ రోజుకారోజు వసూళ్లను ప్రకటిస్తూ ఆడియన్స్‌లో హైప్ పెంచే ప్రయత్నం చేస్తుంటారు. అయితే మేకర్స్ అనౌన్స్ చేసే కలెక్షన్స్ రియాలిటీకి చాలా దూరంగా ఉంటుందన్న కామెంట్స్ ఇండస్ట్రీలో తరుచూ వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) మూవీ కలెక్షన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కలెక్షన్స్‌పై రానా ఏమన్నారంటే?
దగ్గుబాటి రానా (Rana Daggubati)కు నటుడిగా టాలీవుడ్ (Tollywood)లో మంచి పేరుంది. ‘బాహుబలి’ (Baahubali) ‘బాహుబలి 2 (Baahubali 2)’ తర్వాత అతడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. రీసెంట్గా రజనీకాంత్ ‘వేట్టయాన్’ సినిమాలోనూ రానా ప్రతీనాయకుడిగా కనిపించి తన మార్క్ చూపించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా మూవీ కలెక్షన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బాక్సాఫీస్ నంబర్లు అనేది ఒక కామెడీ విషయం. చాలా మందికి తెలుసో లేదో పోస్టర్స్‌లో నెంబర్స్ అనేది టైం పాస్‌కి వేస్తారు. అవి రియల్ నెంబర్స్ కాదు. జస్ట్ మార్కెటింగ్ కోసం వేస్తారు. వచ్చే గ్రాస్‌కి ఫైనల్‌గా వచ్చే డబ్బులకు సంబంధం ఉండదు’ అని అన్నాడు. దీంతో రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. మా హీరోల చిత్రాలకు వచ్చిన కోట్ల కలెక్షన్స్ నిజం కాదా? అని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
ఈసారి బూతులు తగ్గించి..
బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో రానా (Rana Daggubati) చేసిన తొలి వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu) పై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిన వెంకటేష్ ఈ సిరీస్‌లో బూతులు మాట్లాడటాన్ని ఆడియన్స్ తీసుకోలేకపోయారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా సిరీస్ లేదని అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కు పార్ట్ 2 త్వరలోనే రానున్నట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సీజన్ 2పై రానా మాట్లాడారు. సెకండ్ సిరీస్ షూటింగ్ పూర్తైనట్లు చెప్పారు. తొలి సీజన్‌తో పోలిస్తే ఈసారి కంటెంట్, భాష మెరుగ్గా ఉంటుందని రానా హామీ ఇచ్చాడు. అయితే తొలి సిరీస్‌ను ఫ్యామిలీ ఆడియన్స్ చూడొద్దని ముందే సూచించామని రానా గుర్తుచేశారు. కానీ ఎవరు వినలేదని అందుకే ఆ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయని అభిప్రాయపడ్డారు.
అమెజాన్‌లో రానా టాక్ షో
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా చేస్తున్న అన్ స్టాపబుల్ (Unstoppable) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా రూపొందించిన ఈ టాక్ షో మంచి బజ్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ కూడా దగ్గుబాటి రానా హోస్ట్‌గా ఓ టాక్ షోను ప్లాన్ చేసింది. ‘ది రానా దగ్గుబాటి షో’ పేరుతో నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ షోకు రామ్‌గోపాల్ వర్మ, నాని, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా, శ్రీలీల గెస్టులుగా రానున్నట్లు సమాచారం. తొలి సీజన్లో 8 ఎపిసోడ్స్ ఉంటాయని తాజా ఇంటర్వ్యూలో రానా (Rana Daggubati) చెప్పాడు. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభాస్, బాలకృష్ణలను ఈ టాక్ షోకు ఆహ్వానించాలని ఉందని రానా తెలిపారు. దీనిపై వారితో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. దీంతో రెబల్, నందమూరి ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్