యంగ్ బ్యూటీ ‘సురభి పురానిక్’ (Surbhi Puranik) తన గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాను అట్రాక్ట్ చేసింది. తన అందచందాలను చూపిస్తూ నెటిజన్లను తల తిప్పుకోనీకుండా చేస్తోంది.
తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసిన సురభి.. అందులో రోజ్‌ను ముద్దాడుతూ కనిపించింది. అదే సమయంలో తన ఎద అందాలను చూపిస్తూ కుర్ర కారుకు కొంటె వల విసిరింది.
తెల్లటి దుస్తుల్లో సురభి (Surbhi Puranik) ఎద పొంగులను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. దేవకన్యలా ఆమె కనిపిస్తోందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఢిల్లీలో పుట్టి పెరిగిన సురభి.. అక్కడి ఇమాగ్నో యాక్టింగ్ స్కూల్లో నటనకు సంబంధించిన పాఠాలు నేర్చుకుంది. సినిమాల్లోకి రాకముందు కొన్ని వాణిజ్య ప్రకటనలకు మోడల్‌గానూ పనిచేసింది.
తమిళంలో వచ్చిన ‘ఇవన్ వీరమాతిరి’ (Ivan Veramathiri) చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఇందులో మాలిని పాత్రలో కనిపించి తమిళ ప్రేక్షకులను మెప్పించింది.
2015లో ‘బీరువా’ (Beeruva) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఆ మరుసటి సంవత్సరమే శర్వానంద్ సరసన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (Express Raja)లో నటించి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్‌తో ఆమె (Surbhi Puranik)కు టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి.
2016లో మంచు మనోజ్‌తో ‘అటాక్’ (Attack), నానితో ‘జెంటిల్‌మెన్’ (Gentleman) సినిమాలో నటించింది. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చెప్పుకోతగ్గ విజయాన్ని అందుకోలేదు.
2017లో అల్లు శిరీష్‌తో కలిసి ‘ఒక్క క్షణం’ (Okka Kshanam) సినిమాలో చేసినప్పటికీ అది కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు. దీంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి.
ఆ తర్వాత వచ్చిన ‘ఓటర్’ (Voter), శశి (Sashi) సినిమాలు కూడా ఈ భామ ఆశలను అడియాశలు చేశాయి. 2021 తర్వాత సురభి టాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా చేయకపోవడం గమనార్హం.
రీసెంట్‌గా తమిళంలో డీడీ రిటర్న్స్ (DD Returns) అనే హారర్ కామెడీ చిత్రంలో ఈ ఢిల్లీ భామ (Surbhi Puranik) నటించింది.
స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లోనూ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం ఎలాంటి సినిమా ఆఫర్లు చేతిలో లేకపోవడంతో సురభి (Surbhi Puranik) సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అందర్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి