‘పునాది రాళ్లు’ సినిమాతో ఇండస్ట్రీలో ఒక చిన్న నటుడిగా అడుగుపెట్టారు చిరంజీవి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగా మెగాస్టార్‌గా మారారు. మరి చిరంజీవి మెగాస్టార్‌గా మారడానికి ఉపయోగపడ్డ ఆ సినిమాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
ఖైదీ(1983)
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఖైదీ చిత్రం 1983లో రిలీజ్ అయింది. ఈ మూవీ చిరంజీవికి భారీగా స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా అందరిదృష్టి ఆయనవైపు మళ్లింది. ఇందులో చేసిన యాక్షన్ సీన్స్, యాంగ్రి యంగ్‌మ్యాన్‌లా చిరంజీవి నటించిన తీరు మెప్పించింది. మాధవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కమర్షియల్‌గా కూడా ఇది భారీ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ఈ చిత్రం హిందీ, కన్నడలో కూడా రీమేక్ చేశారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ ఫాంటసీ మూవీ ప్రేక్షకులను ఊహాలోకంలో విహరింపజేసింది. రాజు పాత్రలో చిరంజీవి, దేవకన్యగా శ్రీదేవి నటన, కథ, పాటలు మైమరిపించాయి. అమ్రీష్‌పూరీ, రామిరెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మే 9, 1990న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్లు వసూలు చేసింది. తెలుగులో భారీ కలెక్షన్లు సాదించిన మొదటి చిత్రంగా నిలిచింది. ఒక కల్ట్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకుగాను 5 నంది అవార్డులు రావడం విశేషం.
గ్యాంగ్‌లీడర్ (1991)
గ్యాంగ్‌లీడర్‌లో చిరంజీవి, మురళీ మోహన్, శరత్ కుమార్‌లు ముగ్గురు అన్నదమ్ములుగా నటించారు. ఈ చిత్రానికి విజయ బాపినీడు దర్శకత్వం వహించాడు. విజయశాంతి హీరోయిన్. బప్పీలహరి అందించిన మ్యూజిక్‌కి మెగాస్టార్ డ్యాన్స్‌లు అప్పట్లో ఒక ఊపు ఊపేశాయి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. చిరంజీవిని మాస్ హీరోగా మార్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గ్యాంగ్‌లీడర్‌ను తమిళ్, హిందీ, కన్నడలో రీమేక్ చేశారు. హిందీలో కూడా చిరంజీవి హీరోగా నటించాడు.
ఘరానా మొగుడు (1992)
రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఘరానా మొగుడు చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.10 కోట్లు డిస్ట్రీబ్యూటర్ షేర్ నటించిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతో చిరంజీవి ఇండియాలోనే అమితాబ్ కంటే ఎక్కువగా అత్యధిక రెమ్యునరేషన్ పొందుతున్న హీరోగా ఎదిగాడు. నగ్మ, వాణీ విశ్వనాథ్‌లు హీరోయిన్లుగా నటించారు. దీనికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. 1993లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా స్ట్రీమింగ్ జరిగింది.
ఇంద్ర (2002)
చిరంజీవి ఒక ఫ్యాక్షన్ హీరోగా నటించిన మొదటి సినిమా ఇంద్ర. బడా ఫ్యాక్షనిస్టు ఫ్యామిలీలో పుట్టి వారణాసి వెళ్లి సాధారణ జీవితం గడుపుతుంటారు. ఆ తర్వాత అతడి అసలు కథ తెలిసి అందరూ షాక్ అవుతారు. ఈ చిత్రాన్ని బి.గోపాల్ తెరకెక్కించాడు. ఆర్తి అగర్వాల్, సొనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. వైజయంతి మూవీస్ నిర్మాణంలో రూ.10 కోట్లతో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వసూళ్లు సాధించి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటివరకు ఉన్న రికార్డులను అధిగమించి కొత్త చరిత్రను సృష్టించింది. ఆ తర్వాత ఇంధ్ర మూవీ తమిళ్, హిందీ, బోజ్‌పూరీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. బెంగాళి, బంగ్లాదేశ్‌లో రీమేక్ చేశారు.
అయితే కేవలం సినిమాల్లోనే కాదు తన దాతృత్వంతో రియల్ హీరోగా మారాడు చిరంజీవి. బ్లడ్‌బ్యాంక్, ఐ బ్యాంక్ ప్రారంభించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాడు. సినిమాల్లో నటనలకు, డ్యాన్స్‌లకే కాకుండా బయట ఆయన చేసే మంచి పనులకు లక్షలాది మంది అభిమానులుగా మారారు. దీంతో చిరంజీవి మెగాస్టార్‌గా ఇప్పటికీ ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానంలో నిలబడ్డాడు. తాజాగా సినిమా పరిశ్రమలో ఉన్న పేద ప్రజల కోసం తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో ఒక ఉచిత ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ప్రకటించాడు. 2023 నాటికి అది సిద్ధమవుతుందని తెలిపాడు.
చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆయన సూపర్‌హిట్ సినిమాలైనా ఘరానా మొగుడు, ఇంధ్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాల స్పెషల్‌షోలు నిర్వహించనున్నారు.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2 Record: రిలీజ్‌కు ముందే ‘పుష్ప 2’ ఆల్‌టైమ్ రికార్డు.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే!