• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సితారా బర్త్‌డే సెలబ్రేషన్స్: చూశారా?

  సూపర్‌స్టార్ మహేష్‌బాబు, నమ్రతల గారాలపట్టి సితార ఘట్టమనేని బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి సితారా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. బర్త్‌డే సందర్భంగా తన స్వగ్రామం బుర్రిపాలెంలోని పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసింది. అందరికీ ఒకేరకమైన పింక్ సైకిళ్లను బహుమతిగా ఇచ్చింది. ఇందుకు సంబంధిచిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ? A shining star with a heart of gold! ?✨ #SitaraGhattamaneni's 11th birthday … Read more

  దిల్ రాజు కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్; పిక్స్ వైరల్

  ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫస్ట్ వైఫ్ కూతురు హన్షితారెడ్డి 32వ జన్మదిన [వేడుకలు](url) గ్రాండ్‌గా జరిగాయి. తన భర్త అర్చిత్ రెడ్డి సమక్షంలో ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. అతి కొద్ది మంది బంధువులు, ఫ్రెండ్స్‌తో పాటు దిల్ రాజు హాజరై తన కూతురును దీవించారు. కాగా హన్షిక పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ‘బలగం’ అనే మూవీ నిర్మిస్తోంది. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించింది. అనంతరం తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. https://www.instagram.com/reel/CoXBw7upRzt/?utm_source=ig_web_copy_link … Read more

  బ్రహ్మానందంకు పుట్టినరోజు శుభాకాంక్షలు

  హాస్యనట కిరీటీ బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. 1956లో ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. జంధ్యాల ‘ఆహా నా పెళ్లంట’ సినిమాతో ప్రేక్షకులకు బ్రహ్మానందం దగ్గరయ్యారు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ అవార్డూ ఆయనను వరించింది. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించగలరు. ఆయన చేసిన ఓ సినిమాలోని సన్నివేశాన్ని చూసి కాసేపు మీరూ నవ్వుకోండి.

  సల్మాన్ ఫ్యాన్స్‌పై లాఠీఛార్జి; వీడియో వైరల్

  కండలవీరుడు సల్మాన్ ఖాన్ 57 జన్మదిన వేడుకలు ముంబైలోని బాంద్రాలో గ్రాండ్‌గా జరిగాయి. ఈ క్రమంలో సల్మాన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రోడ్డుపై భారీగా జనాలు గుమిగూడ టంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వారిని అక్కడి నుంచి పంపించాలని పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీఛార్జి చేశారు. లాఠీఛార్జి ఘటనతో ఫ్యాన్స్ అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారంది. #SalmanKhanBirthday #Police#lathicharge #fans #waiting #Outside #SalmanKhan #House … Read more

  శిఖర్ ధావన్ బర్త్‌డే వేడుకలు; వీడియో వైరల్

  టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన 37వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఢాకాలో కోచ్ రాహుల్ ద్రావిడ్, సహచరులతో కలసి కేక్ కట్ చేసి బర్త్‌డే నిర్వహించుకున్నాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం ధావన్ బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నాడు. ధావన్ భారత వన్డే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో 17 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. View this post on Instagram … Read more

  అల్లు అర్హ బర్త్‌డే; క్యూట్ వీడియో వైరల్

  సౌత్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కూతురు అర్హకు సంబంధించిన ఓ [వీడియో](url) సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నవంబర్ 21న అర్హ బర్త్‌డే సందర్భంగా ఈ వీడియో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో.. కందిరీగల గురించి తన నాన్నకు ముద్దు ముద్దుగా చెబుతూ కనిపించింది. తెలుగులో చాలా క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోను బన్నీ పోస్ట్ చేస్తూ ‘‘ హ్యాపీ బర్త్‌డే మై క్యూట్ బేబీ అర్హ’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. Happy Birthday … Read more

  భారీ కత్తితో కేక్‌ కట్టింగ్‌..కేసు నమోదు

  మహరాష్టలోని బొరివలికి చెందిన 17 ఏళ్ల యువకుడు పెద్ద కత్తితో 20 కేకులు వరుసగా కట్ చేసి తన పుట్టినరోజు జరుపుకున్నాడు. బర్త్‌డే వేడుకలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో ఆ యువకుడి కోసం గాలించగా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Video: Mumbai Teen Cuts Cakes With Sword, Faces Police Case https://t.co/bXFf16Ha2q pic.twitter.com/CgEXVMs3uM — NDTV … Read more

  చిరంజీవిని మెగాస్టార్ చేసిన 5 సినిమాలు

  ‘పునాది రాళ్లు’ సినిమాతో ఇండ‌స్ట్రీలో ఒక చిన్న న‌టుడిగా అడుగుపెట్టారు చిరంజీవి. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదిగా మెగాస్టార్‌గా మారారు. మ‌రి చిరంజీవి మెగాస్టార్‌గా మారడానికి ఉప‌యోగ‌ప‌డ్డ ఆ సినిమాలేంటో ఒక‌సారి తెలుసుకుందాం. ఖైదీ(1983) కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించిన ఖైదీ చిత్రం 1983లో రిలీజ్ అయింది. ఈ మూవీ చిరంజీవికి భారీగా స్టార్‌డ‌మ్ తెచ్చిపెట్టింది. ఒక్క‌సారిగా అంద‌రిదృష్టి ఆయ‌న‌వైపు మ‌ళ్లింది. ఇందులో చేసిన యాక్ష‌న్ సీన్స్‌, యాంగ్రి యంగ్‌మ్యాన్‌లా చిరంజీవి న‌టించిన తీరు మెప్పించింది. మాధ‌వి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. క‌మ‌ర్షియ‌ల్‌గా … Read more

  హ్యాపీ బ‌ర్త్‌డే సయేషా సైగ‌ల్

  న‌టి సయేషా సైగ‌ల్ నేడు బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకుంటుంది. సయేషా ఆగ‌స్ట్ 12, 1997న ముంబ‌యిలో జ‌న్మించింది. ఆమె హిందీ న‌టులు సైరా భాను, దిలీప్‌కుమార్‌ల మ‌న‌వ‌రాలు. న‌ట‌న‌తో పాటు ఆమెకు డ్యాన్స్‌లో కూడా ప్రావిణ్యం ఉంది. ఈ బ్యూటీ 2015లో అఖిల్ సినిమాతో తెలుగు తెర‌పై ఎంట్రీ ఇచ్చింది. హిందీలో అజ‌య్ దేవ‌గ‌న్‌తో శివాయ్‌లో న‌టించింది. త‌మిళ హీరో ఆర్య‌తో గ‌జినీకాంత్, క‌ట్ట‌ప్ప‌న్, టెడ్డీ వంటి వ‌రుస సినిమాల్లో న‌టించింది. ఆ స‌మ‌యంలో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. 2019లో త‌న‌కంటే వ‌య‌సులో 16 … Read more

  హ్యాపీ బ‌ర్త్‌డే సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు

  నేడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే. మ‌హేశ్ ఆగ‌స్ట్ 9, 1975న అప్ప‌టి మ‌ద్రాసులో జ‌న్మించాడు. తండ్రి కృష్ణ సినిమాల‌తో బాల‌న‌టుడిగా ప‌రిచ‌య‌య్యాడు. మొత్తం 9 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా క‌నిపించాడు. ఇక రాజ‌కుమారుడు సినిమా నుంచి మ‌హేశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన మురారి, ఒక్క‌డ‌, అత‌డు, పోకిరి వంటి సినిమాలు మ‌హేశ్‌ను ఇండ‌స్ట్రీలో తిరుగులేని హీరోగా నిల‌బెట్టాయి. మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 8 నంది అవార్డుల‌తో పాటు 25 పుర‌స్కారాల‌ను అందుకున్నాడు. సినిమాల్లోనే కాదు మ‌హేశ్‌బాబు ఫౌండేష‌న్ స్థాపించి చిన్న‌పిల్ల‌ల‌కు గుండె … Read more