• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘విక్రమార్కుడు-2’ సీక్వెల్

  ‘టైగర్‌ నాగేశ్వరరావు’ విడుదల సందర్భంగా హీరో రవితేజ ప్రమోషన్లలో బిజీ బిజీ గడుపుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో రవితేజ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమానే తర్వాత కూడా తీయనున్నట్లు చెప్పారు. ‘వచ్చే ఏడాది మరో కామెడీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నా. ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌ గురించి రాజమౌళితో ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇటీవల కాలంలో ‘విక్రమార్కుడు-2’ రానుందని కొన్ని వార్తలు వచ్చాయి. అది నిజం కాదు’’ అని రవితేజ చెప్పుకొచ్చారు.

  మహేష్- రాజమౌళి చిత్రం నుంచి బిగ్‌ అప్‌డేట్

  సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న చిత్రం నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ పూర్తైనట్లు తెలిసింది. ఫైనల్ స్క్రిప్ట్‌ను విజయేంద్ర ప్రాసాద్ లాక్ చేసినట్లు సమాచారం. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అత్యంత సాహోసోపేతమైన కథతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. నవంబర్‌లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది.

  రాజమౌళి ట్వీట్‌పై షారుఖ్‌ క్రేజీ రిప్లై

  జవాన్ మూవీపై దర్శక దిగ్గజం రాజమౌళి ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్‌పై షారుఖ్‌ ఖాన్ సరదా రిప్లే ఇచ్చాడు. ‘థాంక్యూ సో మచ్ రాజమౌళి గారు, మీ క్రియేటివ్ ఇన్ పుట్స్ ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నాము. మా మూవీ మీకు నచ్చితే నేను మాస్ హీరోగా సరిపోతానో లేదో కాల్ చేసి చెప్పండి అంటూ సరదాగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అంతకు ముందు రాజమౌళి తన ట్వీట్‌లో ‘అందుకే షారుఖ్‌ను బాక్సాఫీస్ బాద్‌షా అంటారు. వాట్‌ అన్ … Read more

  చిరకాల స్వప్నం నెరవేరింది: రాజమౌళి

  తన చిరకాల కోరిక నెరవేరిందని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. ‘‘రోడ్ ట్రిప్ చేస్తూ తమిళనాడులోని దేవాలయాలు అన్నీ సందర్శించాలని కోరిక ఉండేది. మా అమ్మాయి సహాయంతో శ్రీరంగం, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, కనడుకథన్, తూత్తుకూడి, మధురై దేవాలయాలను సందర్శించాను. రామేశ్వరంలోని మురుగదాస్ హోటల్‌లో భోజనం రుచిగా ఉంది. వారంలోనే 3 కిలోల బరువు పెరిగాను. ఈ ప్రయాణం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. https://www.instagram.com/reel/Cui7zprOLq6/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

  ఛత్రపతి రీమేక్‌పై రాజమౌళి ఏమన్నాడంటే?

  ఛత్రపతి హిందీలో విడుదలవుతున్న వేళ దర్శకధీరుడు రాజమౌళి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. “ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మాస్‌ దర్శకుల్లో ఒకరైన వి.వి.వినాయక్ తెరకెక్కించడం సంతోషం. సినిమా కథ బెల్లంకొండ శ్రీనివాస్‌కు సరిగ్గా సరిపోతుంది. అతడి బాడీ లాంగ్వెజ్‌కు సూట్ అయ్యే స్టోరి ఇది. చిత్రబృందం మెుత్తానికి ఆల్‌ ది బెస్ట్‌” అంటూ ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. జూన్‌ 12న సినిమా రిలీజ్ అవుతుంది. SS RAJAMOULI SENDS BEST WISHES TO TEAM … Read more

  చిన్న పిల్లాడిలా రాజమౌళి కేరింతలు

  [VIDEO:](url) నాటు నాటు సాంగ్‌ ఆస్కార్ గెలిచిన క్షణంలో రాజమౌళి, కాళభైరవ చిన్నపిల్లలుగా మారారు. కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాజమౌళి భార్య రమ రాజమౌళి సైతం భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. JrNTR, రామ్‌చరణ్ సైతం విజయ నినదాలు చేశారు. అటు నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంపై యావత్ సినీ అభిమానులు RRR టీమ్‌పై శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. Rajamouli Reacts to #NaattuNaattu #Oscar2023 Win! pic.twitter.com/rZRvxWdcXv — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) March 13, 2023

  రాజమౌళిపై ఆర్జీవీ ప్రశంసల వర్షం

  దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఒక భారతీయ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని ఏ దర్శకుడూ అనుకోలేదని పేర్కొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇటీవల పోస్ట్ చేసిన ఓ [వీడియో](url)ను వర్మ రీట్వీట్ చేశారు. కాగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజమౌళి.. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో ముచ్చటించిన వీడియోపై వర్మ కామెంట్స్ చేశాడు. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. "If you ever wanna make a movie over here, let's talk"- … Read more

  అప్పట్లో శ్రీదేవిపై జక్కన్న ఫైర్

  అప్పట్లో అతిలోక సుందరి శ్రీదేవిపై దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో జక్కన్న మాట్లాడుతూ.. ‘‘బాహుబలిలో శివగామికి శ్రీదేవిని అనుకున్నాం. ఆమె 7, 8 కోట్లు డిమాండ్ చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఆమెతో పాటు మరో ఐదుగురికి ఫ్లైట్ టికెట్స్ ఏర్పాటు చేయాలి. వారందరికీ ఫైవ్‌స్టార్ హోటల్‌ లో ఒక ఫ్లోర్ మొత్తం బుక్ చేయాలి. బాహుబలి హిందీ రైట్స్ కూడా అడిగా రు.ఈ డిమాండ్లను తీర్చలేకే శ్రీదేవిని వద్దనుకున్నాం.’’ అంటూ పేర్కొన్నాడు.

  జక్కన్నకు హాలీవుడ్ పురస్కారం

  దర్శక ధీరుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. తాజాగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్స్ అవార్డ్స్‌లో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాకుగానూ [[బెస్ట్ డైరెక్టర్‌](url)గా రాజమౌళి హాలీవుడ్ పురస్కారం దక్కించుకున్నాడు. పలువురు హాలీవుడ్ డైరెక్టర్స్‌తో పోటీపడి మరీ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం.న్యూయార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమా నికి రాజమౌళి కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌ ళి మాట్లాడుతూ.. తన కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొ న్నారు. India's Pride @ssrajamouli Garu Received Best Director Award at @nyfcc ❤️‍?❤️‍?. … Read more

  ఆదిపురుష్ యానిమేషన్.. రాజమౌళి కామెంట్స్ వైరల్

  ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ టీజర్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రాఫిక్స్ స్థాయికి తగ్గట్టుగా లేదని, కార్టూన్ మూవీ అని చెబుతున్నారు. అయితే గ్రాఫిక్స్‌లో దిట్ట అయిన రాజమౌళి గతంలో ‘ఈగ’ సినిమా సమయంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కార్టూన్ గ్రాఫిక్‌కి, రియల్ యానిమేషన్‌కి మధ్య తేడాను అందులో చెబుతుండగా.. రాజమౌళి కామెంట్స్ ఆదిపురుష్‌కు సెట్ అవుతాయని నెటిజన్స్ చెబుతున్నారు. రాజమౌళి మాట్లాడుతున్న వీడియో చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. Master @ssrajamouli on … Read more