యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) మరోమారు తన సొగసుల సంపదను ఆరబోసింది. ఉప్పొంగే ఎద అందాలతో అందర్ని ఆకట్టుకుంది.
వైట్, రెడ్, బ్లాక్ డ్రెస్సుల్లో నిధి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ భామ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నారు.
ఈ ఫొటోల్లో నిధి.. ఏ మాత్రం తన అందాన్ని దాచుకోకుండా కనిపించింది. ఎద, థైస్, నడుము అందాలను చూపిస్తూ నెటిజన్ల మతి పోగొట్టింది.
ఇక ఈ బ్యూటీ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె హైదరాబాద్‌లో పుట్టింది. కానీ, నిధి విద్యాభ్యాసం, ఎదుగుదలంతా బెంగళూరులోనే జరిగింది.
కెరీర్ ప్రారంభంలో మోడల్‌గా పనిచేసిన ఈ భామ.. ‘మిస్ దివా యూనివర్స్ 2014’ (Miss Diva Universe 2014) పోటీల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.
2017లో ‘మున్నా మైఖేల్’ అనే బాలీవుడ్ చిత్రం ద్వారా ఈ బ్యూటీ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అందులో దీపిక శర్మ పాత్రలో అందర్ని ఆకట్టుకుంది.
మరుసటి ఏడాది ‘సవ్యసాచి’ (Savyasachi) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో నాగచైతన్యకు జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.
‘సవ్యసాచి’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తెలుగులో ఈ అమ్మడికి వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.
ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ (Akhil Akkineni)కు జోడీగా మిస్టర్ మజ్ను (Mr. Majnu)లో ఆమె నటించింది. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించిన ఈ మూవీలో నికితా పాత్రలో ప్రేక్షకులను అలరించింది.
హీరో రామ్ సరసన ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar)లో నటించి తెలుగులో సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది.
‘ఇస్మార్ట్ శంకర్’ మంచి విజయాన్ని సాధించినప్పటికీ తెలుగులో ఈ భామకు అవకాశాలు సన్నగిల్లాయి.
దీంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన నిధి అగర్వాల్.. అక్కడ శింభుతో ఈశ్వరన్ (Eeswaran), జయం రవితో ‘భూమి’ (Bhoomi) సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
2022లో మహేష్ మేనల్లుడు శ్రీరామ్ ఆదిత్యతో కలిసి ‘హీరో’ సినిమాలో ఈ భామ నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో ఈ బ్యూటీకి నిరాశే మిగిలింది.
ప్రస్తుతం నిధి అగర్వాల్ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. పవన్‌తో హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu), ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమాలో జంటగా నటిస్తోంది.
ఆయా సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ అమ్మడు.. ఆ రెండు విజయం సాధిస్తే టాలీవుడ్‌లో ఇక తనకు తిరుగుండదని భావిస్తోంది.
ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ నిధి చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్ దిగుతూ వాటిని ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
ప్రస్తుతం ఈ భామకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇస్టాగ్రామ్‌లో ఆమె ఖాతాను 28.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
మరోవైపు ప్రముఖ యాంకర్, నటి అనసూయ కూడా ఇవాళ అదిరిపోయే హాట్ షోతో రచ్చ రచ్చ చేసింది. నాభి అందాలు చూపిస్తూ నెటిజన్లకు కొంటె వల విసిరింది.
ఈ ఫొటోలను స్వయంగా షేర్ చేసిన అనసూయ.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. చేతులు పైకెత్తి నడుము అందాలు చూపిస్తూ సెగలు పుట్టించింది.
రంగమ్మత్తను ఇంత హాట్‌గా చూసిన నెటిజన్లు.. తమ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమెదంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
యాంకర్‌గా సాగుతున్న అనసూయ కెరీర్‌ను రంగస్థలం (Rangasthalam) సినిమా మలుపు తిప్పింది. రంగమ్మత్త పాత్రలో ఆమె నటన ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.
రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), కథనం (Kathanam), F2, చావు కబురు చల్లగా (Chavu Kaburu Challaga), థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది.
ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా సినిమాలున్నాయి. అల్లు అర్జున్ పుష్ప- 2 (Pushpa 2) మూవీలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.
అటు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా నేడు సోషల్ మీడియాలో అందాల జాతర చేసింది.
టైట్‌ఫిట్ రెడ్ డ్రెస్ ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. హాట్ చిల్లీలా కుర్రకారు గుండెల్లా మంటలను రగిలించింది.
ఈ భామ స్టన్నింగ్ ఔట్ ఫిట్‌ను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్‌లో ఈ బ్యూటీని తలదన్నే అందం మరెవరి వద్ద లేదని పోస్టులు పెడుతున్నారు.
బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో అలరిస్తున్న జాన్వీ కపూర్.. త్వరలో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకోబోతోంది.
కోలివుడ్ హీరో సూర్య నటిస్తున్న ‘కర్ణ’ (Karna) చిత్రంలోనూ ఈ భామకు ఛాన్స్ చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి.
జాన్వీ కపూర్.. ‘ధడ్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో జాన్వీకి పెద్దగా పేరు రాలేదు.
నటనపరంగా జాన్వీకి గుర్తింపు తెచ్చిన సినిమా ‘గుంజన్ సక్సేనా’. నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రంలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత ‘గుడ్‌లక్ జెర్రీ’, ‘మిలి’, ‘బవాల్’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు.
ఇటీవల ‘రాఖీ ఔర్ రానీకి ప్రేమ్ కహానీ’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించి జాన్వీ అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ‘మిస్టర్ అండ్ మిస్ మహీ’ చిత్రంలో నటిస్తూ బిజీగా బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని శరణ్‌శర్మ తెరకెక్కిస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్