మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు చెబితినే ఆయన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుకు ఉన్న క్రేజ్ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మేహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ (Bhoola Shankar)గా వచ్చి పరాజయాన్ని చవి చూశారు. ఈ సినిమా రిజల్ట్‌తో జాగ్రత్త పడిన చిరు తన తర్వాతి చిత్రానికి ఓ సోషియో ఫాంటసీ కథను ఎంచుకున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రంలో నటించబోతున్నారు. అయితే చిరు పక్కన ఏ హీరోయిన్ నటిస్తుందన్న ఆసక్తి ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొంది. చిత్ర యూనిట్ పరిశీలనలో పలువురు (Vishwambhara Heroine) స్టార్ హీరోయిన్లు ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతకి వారెవరు? చిరు పక్కన నటించే లక్కీ ఛాన్స్ ఎవరిని వరించే అవకాశముంది? ఇప్పుడు చూద్దాం.
కాజల్ అగర్వాల్
విశ్వంభర చిత్రాన్ని దర్శకుడు వశిష్ట చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ రేంజ్‌లో ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయని వశిష్ట ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)ను తీసుకుంటే ఎలా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. చిరు కమ్‌బ్యాక్ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’లో ఈ భామే హీరోయిన్‌గా చేసింది. వారి పెయిర్ కూడా బాగుందని టాక్ వచ్చింది. రీసెంట్‌గా ‘భగవంత్ కేసరి’లోనూ కాజల్ నటించి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో కాజల్ పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు టాక్.
త్రిష
స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) పేరు కూడా విశ్వంభర యూనిట్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరు పక్కన త్రిష సరిగ్గా సరిపోతుందని మూవీ యూనిట్‌లోని కొందరు భావిస్తున్నారట. గతంలో చిరు – త్రిష జోడీగా స్టాలిన్ సినిమా వచ్చింది. వీరి కెమెస్ట్రీ బాగా కుదిరిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం త్రిష కోలివుడ్‌లో వరుసగా బడా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇటీవల విజయ్‌తో ‘లియో’, ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాల్లో ఆమె నటించింది. దీంతో ‘విశ్వంభర’ చిత్రంలో త్రిషను తీసుకోవడం ద్వారా ఆమె పాత్రకు వెయిటేజ్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
సంయుక్త మీనన్
యంగ్ హీరోయిన్ ‘సంయుక్త మీనన్’ (Samyuktha Menon) పేరు కూడా హీరోయిన్ల జాబితాలో ఉందట. ఇటీవల ఆమె నటించిన ‘విరూపాక్ష’ చిత్రం టాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో చిరు సరసన ఆమెను తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలిసింది. పైగా డైరెక్టర్ వశిష్ట మెుదటి చిత్రం ‘బింబిసార’లో కూడా సంయుక్తనే హీరోయిన్‌గా చేసింది. ఆమెతో పనిచేసిన అనుభవం వశిష్టకు ఉంది. దీంతో చిరుకు జోడీగా యంగ్ హీరోయిన్‌ను తీసుకోవాలని భావిస్తే సంయుక్త మీననే ఫైనల్ కావొచ్చని అంటున్నారు.
హనీ రోజ్
‘వీరసింహ రెడ్డి’ సినిమాతో బాగా పాపులర్ అయిన హనీరోజ్ (Honey Rose) చిరు హీరోయిన్ల జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హనీరోజ్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే దీనిపై హనీరోజ్ గానీ, విశ్వంభర యూనిట్ గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ వార్తలకు కాస్త బ్రేక్ పడింది. కానీ చిరు సినిమాలో హనీ నటించడం ఖాయమయితే మాత్రం టాలీవుడ్‌లో ఆమె దశ తిరిగినట్టే అని చెప్పవచ్చు.
దీపిక పదుకొనే
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘దీపిక పదుకొనే’ (Deepika Padukone) చిరుకు జోడీగా తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చిత్ర యూనిట్‌లో ఉన్నట్లు సమాచారం. ‘విశ్వంభర’ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండటంతో దీపికను తీసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుందని యూనిట్ భావిస్తోందట. నార్త్ ప్రజలకు తమ చిత్రం రీచ్ అవుతుందని అభిప్రాయపడుతుందట. చివరికి ఏమవుతుందో వేచి చూడాలి.
చిరు కసరత్తుల వీడియో వైరల్
ఇదిలా ఉంటే విశ్వంభర షూటింగ్ కోసం మెగాస్టార్ చిరు రెడీ అవుతున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ తన పాత్ర కోసం సిద్ధమవుతున్నారు. జిమ్‌లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్న చిరు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 68 ఏళ్ల వయసులోనూ చిరు ఈ రేంజ్‌లో జిమ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్ల పక్కన యంగ్‌గా కనిపించాలన్న ఉద్దేశంతోనే చిరు కష్టపడుతున్నారని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!