• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Trisha Top 20 Bold Pics: ఈ హాట్ ఫొటోలు మీరు చూడకుండా వెళ్లలేరు.. బెట్!

  స్టార్‌ నటి త్రిష (Trisha Krishnan bold) .. చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రంలో హీరోయిన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. దీంతో ఈ అమ్మడి పేరు నెట్టింట వైరల్‌గా మారింది. 

  2006లో వచ్చిన ‘స్టాలిన్‌’ (Stalin) చిత్రంలో తొలిసారి చిరు – త్రిష కలిసి నటించారు. 18 ఏళ్ల తర్వాత ‘విశ్వంభర’లో మరోమారు జోడి కట్టబోతున్నారు.

  ఇదిలా ఉంటే త్రిష (Trisha Krishnan hd images)కు మంచి నటిగానే కాకుండా గ్లామర్‌ బ్యూటీగానూ గుర్తింపు ఉంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఫొటోషూట్‌ చేస్తూ ఆమె ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. 

  త్రిష వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె 04 మే, 1983లో చెన్నైలో జన్మించింది. విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే చేసిన ఈ బ్యూటీ.. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.  

  1999లో వచ్చిన తమిళ చిత్రం ‘జోడి’ ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది. అందులో చిన్న పాత్రకే పరిమితం కావడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

  ఆ తర్వాత 2002 లో ‘మౌనం పెసియాదే’ చిత్రం ద్వారా ఆమె హీరోయిన్‌గా మారింది. ఇందులో తమిళ స్టార్‌ హీరో సూర్య కథానాయకుడిగా చేశాడు. 

  ఇక 2003కు వచ్చేసరికి హీరోయిన్‌గా త్రిష ఫుల్‌ బిజీ అయిపోయింది. ఆ ఒక్క ఏడాదే ఈ బ్యూటీ ఆరు సినిమాల్లో నటించడం విశేషం. 

  అదే ఏడాదిలో ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రం ద్వారా త్రిష టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తరుణ్‌ హీరోగా నటించిన ఈ సినిమా సాంగ్స్‌ అప్పట్లో విశేష ఆదరణ పొందాయి.

  ఆ మరుసటి ఏడాదే వర్షం (2004) సినిమాతో ఈ బ్యూటీ తెలుగులో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా కనిపించి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. 

  2004 చివర్లో మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ‘యువ’ చిత్రంలో ఈ భామ నటించింది. ఇందులో హీరోగా సిద్దార్థకు జోడీగా కనిపించి మెప్పించింది.

  2005లో టాలీవుడ్‌పై త్రిష చెరగని ముద్ర వేసింది. ఆ ఏడాదిలో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. 

  ఆయా చిత్రాల విజయాలతో త్రిషను వరుస అవకాశాలు ముంచెత్తాయి. ‘పౌర్ణమి’, ‘స్టాలిన్‌’, ‘సైనికుడు’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘కృష్ణ’, ‘బుజ్జిగాడు’, ‘కింగ్‌’ వంటి చిత్రాల్లో నటించింది.

  అలాగే ‘కింగ్‌’, ‘శంఖం’, ‘నమో వెంకటేశా’, ‘మన్మధ బాణం’, ‘తీన్‌మార్‌’, ‘బాడీగార్డ్‌’, ‘ధమ్ము’, ‘లయన్‌’ చిత్రాల్లో మెరిసింది.

  అయితే చివరి ఐదు చిత్రాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోవడంతో తెలుగులో ఆమె ఆవకాశాలకు గండి పడింది. దీంతో తమిళ చిత్రాలపై ఈ భామ ఫోకస్‌ పెట్టింది. 

  ఈ క్రమంలోనే విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi)తో ఆమె చేసిన ’96’ (2018) చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత రజనీకాంత్‌ ‘పెట్ట’  (Petta) మూవీలోనూ త్రిష తళుక్కుమంది.

  ఇటీవల ‘పొన్నియన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) మూవీ రెండు పార్ట్‌లలో నటించి అదరగొట్టింది. అందం, అభినయంతో పాటు తనదైన నటనతో వీక్షకులను కట్టిపడేసింది.

  రీసెంట్‌గా విజయ్‌ (Vijay) తో ‘లియో’ (Leo) నటించి మరోమారు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ‘ది రోడ్‌’ (The Road) అనే ఫీమేల్‌ ఒరియెంటేడ్‌ సినిమాలోనూ కనిపించింది.

  ప్రస్తుతం ఐదు చిత్రాల్లో నటిస్తూ త్రిష ఎంతో బిజీగా ఉంది. తమిళంలో ‘విదా మయర్చి’, మలయాళంలో మోహన్‌లాల్‌ (Mohanlal)తో ‘రామ్‌’ చిత్రంలో ఆమె నటిస్తోంది.

  అలాగే చిరు సరసన ‘విశ్వంభర’(Vishwambhara Trisha)తో పాటు ‘ఐడెంటిటీ’, ‘థగ్ లైఫ్‌’ సినిమాల షూటింగ్‌లతో ఈ చిన్నది  తీరిక లేకుండా గడుపుతోంది. 

  ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ త్రిష చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఉత్తేజ పరుస్తోంది. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv