• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Baby Version of Chief Ministers: సీఎంలను ఇంత క్యూట్‌గా ఎప్పుడైనా చూశారా?
    AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు.. అంబానీనీ చూస్తే ఇక అంతే..!
    Hyderabad: సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు అడ్డాగా హైదరాబాద్.. ఇండియాలోనే టాప్ సిటీ
    Neal Mohan: యూట్యూబ్ కొత్త సీఈవోగా మరో భారతీయుడు… నీల్ మోహన్ నేపథ్యంపై స్పెషల్ స్టోరీ
    See More

    ట్రంప్‌ పోలికలతో వ్యక్తి.. వీడియో వైరల్

    అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పోలిన ఓ వ్యకి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అతడు పాకిస్తాన్‌లోని పంజాబ్ సాహివాల్ జిల్లాలో కుల్ఫీలు అమ్ముకుంటున్నాడు. ట్రంప్ పోలీకలు ఉన్న ఆ వ్యక్తి సరదగా పాట పాడుతూ ఉన్న ఓ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 2021లో సైతం కుల్ఫీలు అమ్ముకుంటూ పాటలు పడిన ఇతడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. https://www.instagram.com/reel/CyDI4UpOOuT/?utm_source=ig_embed&ig_rid=8cea3ffe-9c46-4d30-afa4-cbe6900ec7db

    ‘ఛాంపియన్‌తో అల్ఫాహారం.. మర్చిపోలేను’

    టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశాడు. ఈ మేరకు కొన్ని ఫొటోలను రాహుల్ ట్విటర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. వీరితో పాటు యంగ్ హీర్ ఆనంద్ దేవరకొండ ఉన్నాడు. ‘‘నాకు తెలిసిన వారెవరైనా లేదా ట్విటర్‌లో నన్ను అనుసరించే ఎవరికైనా దీని అర్థం తెలుస్తుంది. ఛాంపియన్‌తో ఈ అల్ఫాహారం ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా, ఏసియన్ గేమ్స్‌లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించాడు.

    Vivek Ramaswamy: అమెరికాలో దూసుకెళ్తున్న వివేక్‌ రామస్వామి.. ఆయన గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

    అమెరికాలో భారత సంతతి వ్యక్తి వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) పేరు మార్మోగుతుంది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున వివేక్‌ అధ్యక్ష బరి పోటీలో ఉన్నారు. మాజీ అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత సంతతి మహిళ నిక్కీ హేలితో రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం వివేక్‌ తలపడుతున్నారు. దీంతో రోజు సరికొత్త ప్రకటనలతో, ప్రసంగాలతో వివేక్‌ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.  తాజాగా వివేక్‌ తాను అధ్యక్షుడ్ని అయితే హెచ్​1బీ వీసా లాంటి లాటరీ ఆధారిత … Read more

    New Parliament Building: నూతన పార్లమెంటు భవనం.. ఈ ప్రత్యేకతలు తెలుసా? 

    96 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పాత పార్లమెంట్ భవనానికి విడ్కోలు చెబుతూ.. కొత్త పార్లమెంట్ కొలువుదీరింది. స్వాతంత్రోధ్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలకు పురుడు పోసింది పాత పార్లమెంట్. నూతన పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. జాతీయ గీతాలపన అనంతరం.. కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. “చిన్న కాన్వాస్‌పై పెద్ద బొమ్మ గీయలేం. ఇకపై మనం పెద్ద … Read more

    Top 10 Popular Actresses: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టిన సమంత.. సామ్‌తో అంత ఈజీ కాదు..!

    దేశంలో సినిమా సెలబ్రిటీలకు ఉన్నంత క్రేజ్‌ ఇంకెవరికీ ఉండదు. కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ తారలను సమాజం ఎప్పుడూ ప్రత్యేకంగా చూస్తుంటుంది. వారికి సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటుంది. ఈ క్రమంలో హీరో, హీరోయిన్ల గురించి నెట్టింట తెగ సెర్చ్‌ చేస్తుంటారు ఫ్యాన్స్‌. అభిమాన తారల విషయాలను తెలుసుకొని సంతోషిస్తుంటారు. ఇదిలా ఉంటే జూన్‌ నెలలో బాగా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ల జాబితాను ఓర్‌మ్యాక్స్‌(Ormax) మీడియా సంస్థ తాజాగా విడుదల చేసింది. సినీ ఇండస్ట్రీలో పాపులారిటీ, క్రేజ్, ఫాలోయింగ్, సినిమాలు … Read more

    Mystery Temples in India: భారత్‌లో అంతుచిక్కని ఆలయాలు.. సైన్స్‌ కూడా వీటి ముందు ఓడిపోయింది!

    భారతదేశం ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. రాజుల కాలం నాటి ఎన్నో పురాతన ఆలయాలు దేశంలో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మశక్యం కాని రహస్యాలతో ముడిపడి ఉన్నాయి. సైన్స్‌ కూడా ఆ ఆలయాల వెనక ఉన్న రహస్యాలను కనిపెట్టలేకపోయింది. దీంతో శతాబ్దాల కాలంగా అవి మిస్టరీగానే మిగిలిపోయాయి. దేశంలో సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్న ఆ టెంపుల్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం. 1. బృహదీశ్వర ఆలయం (తమిళనాడు) తమిళనాడులోని తంజావూరులో ఉన్న ‘బృహదీశ్వర దేవాలయం’ గ్రానైట్ రాయితో తీర్చిదిద్దబడింది. అయితే దీనికి … Read more

    India’s Most Beautiful Sculpture Temples: భారత్‌లో శిల్పకళా వైభవాన్ని చాటిన దేవాలయాలు

    ప్రపంచంలోనే అతిగొప్ప ఆధ్యాత్మిక దేశంగా భారత్‌ కీర్తి గడించింది. దేశంలో లక్షలాది హిందూ దేవాలయాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. రాజవంశ పాలకులు నిర్మించిన ఆ దేవాలయాలు.. అద్భుత కట్టడాలుగా, చారిత్రక వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి. ఆ గుళ్లను దర్శిస్తే ఆధ్యాత్మిక భావనతో పాటు… గొప్ప అనుభూతిని పొందొచ్చు. ఇంతకీ ఆ దేవాలయాలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  బృహదీశ్వరాలయం (తమిళనాడు) తంజావూరు లోని బృహదీశ్వరాలయాన్ని చోళ రాజు రాజరాజ చోళుడు క్రీ.శ. 1002 లో నిర్మించాడు. ఇందులో … Read more

    Suicide Thoughts: ఆత్మహత్య చేసుకోబోయే వారు ఎలా ఆలోచిస్తారు.. బయటపడాలంటే ఏం చేయాలి?

    తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు సంబరాల్లో మునిగిపోతుంటే.. తక్కువ వచ్చిన వారు మాత్రం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయితే ఇక తమకు భవిష్యత్తే లేదన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. క్షణికావేశంలో ఎంతో విలువైన ప్రాణాలను హరించేసుకుంటున్నారు. ఇటీవల ఏపీలో 9 మంది ఇంటర్‌ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చారు. అసలు ఆత్మహత్యకు ముందు విద్యార్థుల ఆలోచన తీరు ఎలా ఉంటుంది? ఎలాంటి ఆలోచనలు ఆత్మహత్యకు పురిగొల్పుతాయి? … Read more

    Karnataka Elections: సిద్ధరామయ్య VS డీకే శివకుమార్‌.. సీఎం సీటు కోసం అగ్రనేతలు పోటీ..!

    కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు గెలుపు మాదంటే మాది అని పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి. అయితే భాజపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశముంది. ఇటీవల విడుదలైన పలు సర్వేలు కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.  DK శివకుమార్‌ vs సిద్ధరామయ్య కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థుల జాబితాలో ప్రధానంగా రెండు పేర్లు … Read more

    Telugu Novels:  జీవితంలో ఒక్కసారైనా చదవాల్సిన బెస్ట్ తెలుగు నవలు… వీటిని చదివితే పుస్తకాలతో ప్రేమలో పడటం ఖాయం! 

    ఈ రోజుల్లో వినోదం అనగానే ముందుగా థియేటర్లు, టీవీలు, ఓటీటీలు, బ్రౌజింగ్ క్రికెట్ వంటివి గుర్తుకువస్తాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. మనకి ముందున్న జనరేషన్స్‌ వాళ్లు పుస్తకాలతోనే ఎక్కువగా తమ సమయాన్ని గడిపేవారు. పుస్తకాల నుంచే వినోదంతో పాటు విజ్ఞానాన్ని సంపాదించేవారు. అయితే, నేటి తరం పుస్తకాలను చదవడం తగ్గించేసింది. చాలామందికి చదవాలన్న కుతూహలం ఉన్నా ఏయే పుస్తకాలు చదవాలో క్లారిటీ ఉండదు. ఇందుకోసం YouSay చిరు ప్రయత్నం చేసింది. మిమ్మల్ని బుక్ లవర్స్‌గా మార్చే పుస్తకాలను సంగ్రహించి వాటి తాత్పర్యం, సారాంశాలను … Read more