• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు

    తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. నిన్న నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ నార్త్‌లో 4.35సెం.మీ.లు, నిజామాబాద్‌లో 3.93సెం.మీ.లు, నిజాంపేటలో 3.58సెం.మీ.లు, కల్దుర్తి, గోపన్‌పల్లిలలో 3.45సెం.మీ.లు,వర్షాపాతం నమోదైంది

    ముంబై వదిలి ఆర్సీబీకి బుమ్రా?

    టీమిండియా బౌలర్ బుమ్రా ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడనే ఊహాగానాలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ కలకలం రేపింది. ‘కొన్నిసార్లు మౌనంగా ఉండడమే సరైన జవాబు’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో బుమ్రా పోస్ట్‌ పెట్టాడు. దీంతో అతడు ముంబై వదిలి ఆర్సీబీకి వెళ్లిపోయే అవకాశముందని కొందరు అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభం (2015) నుంచి బుమ్రా, ముంబై ఇండియన్స్‌తో ఉన్నాడు.

    ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

    మానసిక ఒత్తిడికి గురైన ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పందిళ్లపల్లిలో చోటు చేసుకుంది. వంశీకృష్ణ (22) డిగ్రీ చదివాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాడు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్‌ ఆర్థిక సంస్థ ద్వారా కారు తీసుకున్నాడు. దీని బకాయిలు చెల్లించాలని సంస్థ నుంచి అతడికి ఒత్తిడి పెరిగింది. మరోపక్క ప్రేమించిన యువతి నిర్లక్ష్యం చేసింది. దీంతో వంశీ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    హత్య కేసులో 9 మందికి యావజ్జీవ శిక్ష

    AP: హత్య కేసులో నిందితులకు తొమ్మిది మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నందిగామ 16వ జిల్లా అదనపు న్యాయమూర్తి కోర్టు తీర్పు చెప్పింది. ముళ్లపాడులో 2006 సెప్టెంబర్‌లో వినాయక విగ్రహ ఊరేగింపులో కాంగ్రెస్‌ వర్గీయుల రాళ్ల దాడిలో టీడీపీకి చెందిన నలజాల నరసింహయ్య(80) మృతి చెందారు. ఆ ఘటనలో 11 మందిపై కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

    ‘కోట బొమ్మాళి’ సినిమా ఎలా ఉందంటే?

    ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మరి తెలుగులోనూ ఈ చిత్రం మెప్పించిందా? లేదా? అని తెలుసుకునేందుకు YouSay Webపై క్లిక్ చేసి రివ్యూలో చూసేయండి Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట … Read more

    ప్రభాస్ మూవీలో చిన్న రోల్ ఇచ్చినా చేస్తా: రన్బీర్

    హీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోకు బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ విచ్చేసి సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో రన్బీర్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తదుపరి ప్రభాస్ తో స్పిరిట్ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో ఏదైనా చిన్న రోల్ తన కోసం ఉన్నా, చేస్తా అంటూ రన్బీర్ చెప్పుకొచ్చాడు. ‘యానిమల్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రన్బీర్ అన్ స్టాపబుల్ షోకి వచ్చారు.

    ఆ రోజే ‘శివాజీ’ చిత్రం రీ రిలీజ్

    సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శ్రియా హీరోయిన్‌గా నటించిన ‘శివాజీ ది బాస్’ చిత్రం ఎంతో ఘన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.. 2007లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహించగా సుమన్ విలన్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగులో ఈ మూవీని డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

    ఇప్పుడే కోలుకుంటున్నా.. సూర్య పోస్ట్

    ‘కంగువా’ చిత్రం షూటింగ్‌లో హీరో సూర్యకు గాయమైన విషయం తెలిసిందే. చిత్రీకరణ సమయంలో రోప్‌ కెమెరా భుజంపై పడి ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్య తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తాను కోలుకుంటున్నట్లు చెప్పారు. ‘ఇప్పుడే కోలుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉంది’ అంటూ సూర్య పోస్ట్ పెట్టారు.

    జగన్‌, సీబీఐలకు సుప్రీం నోటీసులు

    సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు సీబీఐ సహా, జగన్‌కు కేసు ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. గత పదేళ్లుగా జగన్‌ బెయిల్‌పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని.. వెంటనే బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.

    ఇజ్రాయెల్‌–హమాస్‌ల మధ్య కుదిరిన ఒప్పందం

    ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ గాజాలో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ ప్రకటించింది, దాదాపు 50 మంది బందీలకు విముక్తి, ఇజ్రాయెల్‌ జైళ్లలోని పాలస్తీనా ఫైటర్ల విడుదలకు ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణకు, బందీల విడుదలకు తగిన సానుకూల పరిస్థితులను సృష్టించే పనిలో మధ్యవర్తులు నిమగ్నమయ్యారని ఖతార్‌ పేర్కొంది ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య ఒప్పందం కుదిర్చే విషయంలో ఖతార్‌ అత్యంత కీలకంగా వ్యవహరించింది.