• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Realme: స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు చూస్తే షాకే!

    చైనీస్‌ మెుబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme)కి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆ కంపెనీ బడ్జెట్‌లో నాణ్యమైన మెుబైల్స్‌ను రిలీజ్‌ చేస్తూ టెక్‌ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు రియల్‌మీ సిద్ధమైంది. ‘Realme C65 5G’ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. దేశంలో రియల్‌మీ సీ-సిరీస్‌ నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్‌ ఇదే కావడం విశేషం. అయితే ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో YouSay Webపై క్లిక్ చేసి చూసేయండి. Realme C65 … Read more

    కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లే వస్తాయి: KCR

    ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తామని సీఎం కేసీఆర్ జోష్యం చెప్పారు. మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైందని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టి విక్రమార్కకు ఓటు వేస్తే ప్రజలు నష్టపోతారన్నారు. కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

    కాంగ్రెస్‌కు ఓటేసి ఆగం కావొద్దు: హరీశ్‌‌రావు

    కాంగ్రెస్‌కు అధికారమిచ్చి ప్రజలు ఆగం కావొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు. అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్‌నే కాంగ్రెస్ ఇస్తానంటోందని తెలిపారు. రైతుబంధు ఖర్చు దుబారా అని ఉత్తమ్‌కుమారెడ్డి చెబుతున్నారన్నారు. అలాంటి వారి మాటలు నమ్మి ఓటేస్తే మోసపోవడం ఖాయమని మంత్రి చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటక ఉపన్యాసాలతో ఊదరగొట్టారని విమర్శించారు.

    మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు

    టమాటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీపావళి తర్వాత మార్కెట్‌లో టమాటా ధర ప్రతి ఏటా రూ.15 నుంచి రూ.20 వరకు పలికిన ధర ఇప్పుడు కిలోకు రూ.55 నుండి 60 వరకు అమ్ముడవుతున్నాయి. వర్షాభావంతో టమోటా పంట దెబ్బతింది. టమాటాలను విక్రయించేందుకు నాగ్‌పూర్‌లోని కలమన మండీకి తీసుకువస్తుంటారు. అయితే ఈసారి చాలా తక్కువగా టమాటాలు వస్తుండటంతో వీటి ధరలు మళ్లీ పెరిగాయి.

    ఊటీలో బాలయ్య యాక్షన్

    బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరణ ఊటీలో జరగనుంది. ఈ నెల 24 నుంచి అక్కడ కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాని నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.

    IRR కేసు.. చంద్రబాబు బెయిల్‌పై విచారణ వాయిదా

    రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీఐడీ సమయం కోరడంతో విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

    మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల

    ఓఎన్జీసీ పైపులైన్‌ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ‘మిమ్మల్ని చూసి భారత్‌ గర్విస్తోంది’

    టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మపై దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు ప్రదర్శన పట్ల దేశం గర్విస్తోందని చెప్పారు. ‘ఛాంపియన్స్‌లా ఆడారు. సగర్వంగా తల ఎత్తుకోండి. మీరెప్పుడో విజేతలుగా నిలిచారు. మిమ్మల్ని చూసి భారత్‌ గర్విస్తోంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇది కష్టకాలమని నాకు తెలుసు. కానీ రోహిత్ స్ఫూర్తిని కోల్పోవద్దు. భారత్‌ నీకు మద్దతుగా ఉంది’. అని కపిల్‌ పేర్కొన్నాడు.

    ఆసీస్‌తో టీ20లకు కెప్టెన్‌గా సూర్య

    ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు జట్లును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేష్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌. పేర్లను వెల్లడించింది.

    చిరుపై వైష్ణవ్‌ తేజ్ కామెంట్స్‌

    హీరో వైష్ణవ్‌ తేజ్ నటించిన ‘ఆదికేశవ’ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా వైష్ణవ్‌ తేజ్‌ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పారు. చిరు అని ఇంగ్లీషు అక్షరాలు వచ్చేలా క్రాఫ్‌ చేయించుకున్న ఓ ఫొటోపై వైష్ణవ్‌ స్పందిస్తూ. ‘పెద్ద మామయ్య పుట్టినరోజుకు అందరూ బహుమతులు తెచ్చారు. ఆయనకు నా ప్రాణం తప్ప ఏం ఇవ్వగలను అని అనిపించింది. నేను సర్‌ప్రైజ్‌ చేద్దామని చిరు అని వచ్చేలా క్రాఫ్‌ చేయించుకున్నా’. అని … Read more