• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రేమ పేరుతో విద్యార్థినిపై టీచర్‌ లైంగికదాడి

  AP: ప్రేమ పేరుతో ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థినిని మోసం చేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా యండగండి పాఠశాలలో జరిగింది. స్కూల్ లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్న పురెళ్ల సోమరాజు మాయమాటలతో విద్యార్థిని మెడలో తాళి కట్టాడు. పెళ్లి చేసుకున్నట్లు నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉపాద్యాయుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  నవ దంపతులు ఆత్మహత్య

  AP: నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గంగంపల్లిలో చోటుచేసుకుంది. స్థానికంగా దూదేకుల దాదాఖలందర్‌ (24), బోయ జ్యోత్స (20) రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరూ ఇంట్లో రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

  27 నుంచి మళ్లీ లోకేష్ పాదయాత్ర

  టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 27 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. డిసెంబరు నెలాఖరు వరకు సాగే పాదయాత్ర విశాఖపట్నంలో ముగియనుంది. చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయడంతో సెప్టెంబర్ 9 నుంచి లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిలు లభించడంతో పాదయాత్ర కొనసాగించాలని లోకేష్ నిర్ణయించారు. పొదలాడ నుంచే తిరిగి లోకేష్ యాత్ర ప్రారంభం కానుంది.

  విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

  AP: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం శరత్‌ థియేటర్‌ కూడలి వద్ద స్కూల్‌ విదార్థులతో ప్రయాణిస్తున్న ఆటో.. లారీని ఢీకొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆటోడ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఆటోను ఢీకొట్టిన లారీ 100 మీటర్ల దూరం వరకూ వెళ్లి ఆగిందని చెప్పారు. విశాఖలో స్కూల్ విద్యార్థుల ఆటో – లారీ … Read more

  IRR కేసు.. చంద్రబాబు బెయిల్‌పై విచారణ వాయిదా

  రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీఐడీ సమయం కోరడంతో విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

  మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల

  ఓఎన్జీసీ పైపులైన్‌ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  సీఎం జగన్ పర్యటన వాయిదా

  సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా ప‌డిన‌ట్లు సీఎంవో ప్రకటించింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రాయదరువు వద్ద సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. త్వరలోనే రీ షెడ్యూల్‌ చేసి మరో తేదీని ప్రకటించనున్నారు.

  ఒక్క పథకం ఆపితే.. రోడ్లు వేయొచ్చు: కొడాలి నాని

  వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వాటిలో ఏ ఒక్క పథకం ఆపినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. గుడివాడలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు వేయాలంటే రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దీనికి డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపినా సరిపోతుందని తెలిపారు. రోడ్లపై ఉన్న చిన్నచిన్న గుంతల వద్ద చేరి టీడీపీ, జనసేన నేతలు రాద్ధాంతం చేస్తున్నారని నాని మండిపడ్డారు.

  చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు

  AP: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

  ‘ఓటర్ల లిస్ట్‌ కంటే అక్రమ కేసుల లిస్టే పెద్దది’

  ఏపీలో ఓటర్ల లిస్ట్‌ కంటే ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టే ఎక్కువగా ఉందని ఆ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నించినందుకు ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా తమ పార్టీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇక ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయని.. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ అచ్చెన్నాడు సవాల్ విసిరారు.