• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

    స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసినబెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల 15కి వాయిదా చేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. విచారణకు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సీఐడీ కోర్టుకు తెలిపింది. తమకు తగిన సమయం కావాలని కోరింది. దీంతో న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చిచెప్పింది.

    కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌హాసన్‌

    సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయవాడ గురునానక్‌ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని హీరో కమల్‌హాసన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత దేవినేని అవినాష్‌, పెద్ద ఎత్తున కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు పాల్గొన్నారు. ‘ఇండియన్‌-2’ సినిమా చిత్రీకరణ కోసం కమల్‌హాసన్‌ విజయవాడ వచ్చారు. దీనిలో భాగంగానే కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    నేడు చంద్రబాబు బెయిలు పిటిషన్‌ విచారణ

    స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు బెయిలు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో 37వ నిందితులు బెయిల్‌పై బయటే ఉన్నారు. చంద్రబాబుకు మాత్రం బెయిలు దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు ఒక్కరికే బెయిలు రావాలి. ఇదే కేసులో ఏపీఎస్‌ఎస్‌డీసీ పూర్వ ఎండీ, మొదటి నిందితుడు గంటా సుబ్బారావుతో పాటు మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిలు పొందారు. సీమెన్స్‌ సంస్థ, డిజైన్‌టెక్‌కు చెందిన ఎండీ, సీఎండీలు బెయిలు పొందిన వారిలో ఉన్నారు.

    భాజపా నాలుగో జాబితా ప్రకటన

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల నాలుగో జాబితాను భాజపా విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ.. తుది జాబితాను ఖరారు చేసింది. టికెట్‌ ఖరారైన అభ్యర్థులకు భాజపా ముఖ్యనేతలు ఇప్పటికే ఫోన్‌ చేసి సమాచారమందించారు. కంటోన్మెంట్‌-కృష్ణ ప్రసాద్‌, నాంపల్లి-రాహుల్‌ చంద్ర, శేరిలింగంపల్లి-రవికుమార్‌ యాదవ్‌, మల్కాజ్‌గిరి-రామచందర్‌రావు, పెద్దపల్లి-ప్రదీప్ కుమార్, మేడ్చల్-విక్రమ్ రెడ్డికి కేటాయించినట్టు భాజపా ఓ ప్రకటనలో తెలిపింది.

    కేసీఆర్‌ ఆస్తుల విలువ ఎంతంటే?

    TG: సీఎం కేసీఆర్ తన పేరిట రూ.58.7 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ. 35.42 కోట్ల విలువైన చరాస్తులు (నగదు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు), రూ.23.50 కోట్ల విలువైన స్థిరాస్తులు (ఇళ్లు, ఫాంహౌస్‌, ప్లాట్లు) ఉన్నాయని ప్రకటించారు. తన పేరిట సొంత భూమి, కార్లు, బైక్‌, ఇతర వాహనాలు లేవని పేర్కొన్నారు. తన పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు, కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్లో వెల్లడించారు. సంవత్సర ఆదాయం రూ.1.60 కోట్లు అని … Read more

    జగన్‌పై లోకేష్ విమర్శలు

    టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘వాహ్.. ఒక్క యూనిట్ కూడా వాడని ఇంటికి రూ.295 కరెంట్ బిల్లు బాదుడు. సొంత పేపర్, ఛానెల్, సిమెంట్, విద్యుత్ కంపెనీలు, ఊరికో ప్యాలెస్ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్ పేదలకి రూపాయి స్కీం ఇచ్చి వెయ్యి రూపాయలు దోచే స్కాం. జనాన్ని క్యాన్సర్ గడ్డలా పట్టి పీడిస్తున్న నువ్వు బిడ్డ ఎలా అవుతావు జగన్?’ అని లోకేష్ విమర్శించారు.

    ‘నకిలీ లేఖతో చంద్రబాబుపై దుష్ప్రచారం’

    సీఎం జగన్‌పై టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. నకిలీ లేఖతో చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే జగన్‌ నైజమని విమర్శించింది. ‘ఒక సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ చంద్రబాబు పేరుతో నకిలీ లేఖను సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టింది. ఇది చేయడం చేస్తే జగన్‌లో ఓటమి భయం పట్టుకుందని టీడీపీ విమర్శించింది.

    సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు

    ఏపీ సీఎం జగన్‌‌కి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జగన్‌ అక్రమాస్తు కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈమేరకు సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్‌ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

    దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది: లోకేష్

    జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదు. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోంది. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు, ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి’. … Read more

    ఏపీలో త్వరలో జైలర్ సీన్: రఘురామ

    సీఎం నిజ స్వరూపం ఏమిటో ప్రధానికి మోదీకి తెలిసిపోయిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ‘జైలర్‌’ సినిమా సీన్‌ త్వరలో రాష్ట్రంలో కనిపించవచ్చన్నారు. ఆ సినిమాలో రజినీకాంత్‌ తన కుమారుడు దొంగతనాలు చేస్తున్న విషయం తెలిసి అతన్ని చంపాలని ఆదేశిస్తారని..అలాగే రాష్ట్రంలోనూ రేపు అటువంటి దృశ్యమే పునరావృతం కావచ్చని అన్నారు. పీఎం కిసాన్‌ పథకానికి వైఎస్సార్‌ రైతు భరోసా అని రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసిందని రఘురామ విమర్శించారు,