కేసీఅర్‌ను ఇంటికి పంపాలి: మోదీ
తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మీ అందరి ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యానని బీసీ ఆత్మగౌరవ సభలో అన్నారు. ‘తెలంగాణ ప్రజలు భాజపాపైనే విశ్వాసంతో ఉన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారు. ఆయన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. వాటితోనే భారాస మోసం చేసింది. బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది భాజపా మాత్రమే’ అని మోదీ అన్నారు.