• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సజ్జల వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ‘తన పార్టీతో సంబంధం లేదని గతంలో రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పుడు ఏ సంబంధం ఉందని తనపై ఆయన మాట్లాడుతున్నారు. తాము మాత్రం సంబంధం లేదనే అనుకుంటున్నాము. మాతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలి. ఏపీలో రోడ్లు, విద్యుత్‌పై కేసీఆర్‌ బాహాటంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెప్పాలి’. అని షర్మిల వ్యాఖ్యానించారు.

    ఆర్టీసీ బస్టాండ్‌లో విషాదం

    AP: విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్‌లో విషాదం చోటుచేసుకుంది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో 112 నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. బస్సు కండెక్టర్‌, మరో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో 10 నెలల చిన్నారి కూడా ఉంది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    చంద్రబాబును పరామర్శించిన పవన్‌

    టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌ వచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.

    జగన్ సిగ్గుతో తలదించుకోవాలి: లోకేష్

    జగన్‌ అసమర్థ పాలన రాష్ట్ర ప్రజలకు శాపమైందని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. చెట్ల కింద రోగుల దుస్థితి.. జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందన్నారు. గిరిజన తండాల ప్రజలకు అండగా ఉన్న ధర్మాస్పత్రిలో మూడేళ్లుగా చెట్లకిందే వైద్యసేవలు అందిస్తున్నారంటే జగన్ సిగ్గుతో తలదించుకోవాలంటూ మండిపడ్డారు. జగన్ దివాలా కోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనాస్పత్రుల్లోనే దూది సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొందని లోకేష్ విమర్శించారు.

    శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

    తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి నేరుగా భక్తుల్ని అనుమతిస్తున్నారు. దీంతో ఎనిమిది గంటల్లో సర్వదర్శం చేసుకోవచ్చు. నిన్న 66,048 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లుగా తేలింది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను నవంబర్‌ 10న ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.

    భార్యపై అనుమానంతో దారుణ హత్య

    భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా అనంత నగరంలో చోటు చేసుకుంది. స్థానికంగా దంపతులు నారాయణమ్మ(38), AP: నాగరాజులు నివాసం ఉంటున్నారు. నాగరాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొద్ది రోజులుగా భార్యపై అనుమానంతో భర్త తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న భార్యపై రోకలితో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో నారాయణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గాలిస్తున్నారు.

    బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు

    తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్నకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. జడ్జిలను దూషించారన్న అభియోగాలపై ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం పలు ఆరోగ్య పరీక్షల కోసం బుద్దా వెంకన్న హైదరాబాద్‌లోనే ఉన్నారు. దీంతో హైదరాబాద్ వెళ్లిన సీఐడీ అధికారులు.. నేరుగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరినట్లు చెప్పారు.

    కాళేశ్వరం ప్రశ్నార్థకమైంది: కిషన్‌ రెడ్డి

    TG: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఫ్లాప్‌ అయ్యిందని రాష్ట్ర భాజపా చీఫ్‌ కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డిలోని రాజారెడ్డి గార్డెన్‌లో ఆయన మాట్లాడారు. రూ.1.20 లక్షలు పెట్టి కేసీఆర్‌ కాళేశ్వరం కడితే అది కుంగిపోతోందని విమర్శించారు. కూలిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. చివరకూ కాళేశ్వరమే ప్రశ్నార్థకంగా మారుతోందని పేర్కొన్నారు. ఓడిపోతానన్న భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు. రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిన సీఎంను కామారెడ్డి ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు.

    నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో నోటిఫికేషన్

    నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. ఈ నెలాఖరులోగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. ఈ మేరకు ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి డిసెంబరులో రాత పరీక్షలు ఉంటాయి’ అని కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ పేర్కొన్నారు.

    జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదు: లోకేష్

    ఏపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా, బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితుడ్ని అని వాపోవడం… జగన్ జమానాలో దళితులపై అణచివేత … Read more