• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జి కానున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఆయన్ను డిశ్చార్జి చేయనున్నారు. ఏఐజీ నుంచి ఆయన నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లనున్నారు. చంద్రబాబు కంటి సమస్యకు వైద్యులు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంది. చంద్రబాబు వైద్య పరీక్షల కోసం నిన్న ఏఐజీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే..

    చంద్రబాబు కేసులో కీలక మలుపు

    AP: చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. మొత్తం 12 మంది ఐఏఎస్‌లను విచారించాలంటూ న్యాయవాది ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. తెదేపా హయాంలో సిమెన్స్‌ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఆయన ఫిర్యాదులో కోరారు. కాంట్రాక్ట్‌, చెక్‌ పవర్‌తో సంబంధం ఉన్న వివిధ స్థాయిల్లోని అధికారులను కూడా విచారించాలని సీఐడీకి ఫిర్యాదులో సూచించారు.

    చంద్రబాబుపై సీఐడీ మరోకేసు

    చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదుచేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని ఎపీఎండీసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబును ఏ2గా, మాజీ మంత్రి పీతల సుజాతను ఏ1గా, చింతమనేని ప్రభాకర్‌ను ఏ3గా, దేవినేని ఉమాను ఏ4 నిందితులుగా చేర్చింది. వీరు టీడీపీ హయాంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా చేశారని సీఐడీ ఫిర్యాదులో పేర్కొంది.

    ఏఐజీ ఆస్ఫత్రిలో చంద్రబాబు

    టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నిన్న జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన ఏఐజీ వైద్యులు చంద్రబాబును పరీక్షించారు. వారి సూచన మేరకు చంద్రబాబు ఏఐజీకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.

    జగన్‌పై సుప్రీంకు వెళ్లిన వైకాపా ఎంపీ

    AP: సీఎం జగన్‌ కేసులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్‌ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ‘జగన్‌ కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో జాప్యం జరుగుతోంది. ఈ కేసులను సీబీఐ కోర్టు 3,071 సార్లు వాయిదా వేసింది. జగన్‌ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. వందల కొద్దీ డిశ్చార్జి పిటిషన్లు వేయడంతో కేసు విచారణ జాప్యం జరిగే అవకాశం ఉంది’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ‘సంచలనం కోసమే ఎంపీపై దాడి’

    మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి కేసు వివరాలను సిద్దిపేట సీపీ వెల్లడించారు. సంచలనం కోసమే నిందితుడు రాజు.. ఎంపీపై దాడి చేశారని తెలిపారు. ‘నిందితుడికి ఎవరి సహకారం లేదు. రాజు ఒక్కడే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారం క్రితం కత్తికొనుగోలు చేసి ఎంపీ హత్యకు పథకం రచించాడు. రాజు పలు వెబ్‌ఛానల్స్‌లో పనిచేస్తున్నాడని తెలిసింది. విలేఖరి అని చెప్పుకొంటూ, ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసి జల్సాలకు వాడుకునే వాడు’ అని వివరించారు.

    ‘KCR దోచుకున్నదంతా పేదలకు పంచుతాం’

    TG: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజల కలలన్నీ నిర్వీర్యం అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ధరణి పేరుతో 20 లక్షల మంది రైతులకు నష్టం కలిగించారని ఆరోపించారు. తొలుత కేసీఆర్ పదవికి బైబై చెప్పి ఆ తర్వాత అతను దోచుకున్న డబ్బులను రాబట్టాలన్నారు. కేసీఆర్ దొచుకున్నదంతా వసూలు చేసి ప్రజలకు పంచిపెడతామని రాహుల్‌ హామి ఇచ్చారు. రాష్ట్రంలో యుద్ధం మెుదలైందన్న రాహుల్‌.. దీనిని దొరలు, ప్రజల మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.

    బస్సు బోల్తా 22 మందికి గాయాలు

    AP: చిత్తూరు జిల్లాలో ప్రమాదం జరిగింది, ప్రైవేటు బస్సు బోల్తా 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు- వేలూరు జాతీయ రహదారిపై వద్ద అదుపుతప్పింది. ఈ క్రమంలో గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు తీవ్రంగా గాయపడ్డారు.మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    ఢిల్లీకి వెళ్లిన లోకేష్

    టీడీపీ నేత నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ న్యాయ నిపుణులతో కేసులపై చర్చించనున్నారు. కేసుల విషయంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తారు. చంద్రబాబు క్యాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.. మరోపైపు ఏపీ ప్రభుత్వం లోకేష్‌పై పలు కేసులు మోపుతోంది. .

    నేడు ‘వైఎస్సార్‌’ అవార్డుల ప్రదానోత్సవం

    నేడు ఏపీప్రభుత్వం ‘వైఎస్సార్’ అవార్డులు అందజేయనుంది. ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. దీనికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా, సీఎం జగన్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు లంభించనున్నాయి.