• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు రాష్ట్ర ఉత్సవంగా అవతరణ దినోత్సవం

    ఆంధ్ర రాష్ట్ర అవత­రణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యా­లయంలో సీఎం జగన్ ఉదయం 10.15 గంటలకు పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం జాతీయ పతా­కాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ తర్వాత తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తారు.

    మీ అభిమానం మర్చిపోలేనిది: చంద్రబాబు

    రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. కష్టకాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ సంఘీభావం తెలిపారని గుర్తుచేసుకున్నారు. సంఘీభావం తెలపడమే కాకుండా తాను చేసిన అభివృద్ధిని కూడా వివరించారని కొనియాడారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని తెలుగువారందరికీ పేరు పేరునా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

    జైలు నుంచి చంద్రబాబు విడుదల

    రాజమహేంద్రవరం జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో చంద్రబాబును జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు విడుదలతో టీడీటీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు.

    సింపతీ కోసం చంద్రబాబు ప్లాన్: సజ్జల

    టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ మంజూరుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు బయటకు వచ్చారని తెలిపారు. ప్రజల్లో సింపతీ కోసమే చంద్రబాబు మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పారు. చంద్రబాబు బయట ఉన్నా లోపల ఉన్నా పెద్ద తేడా లేదన్నారు.హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

    ‘అదానీ కోసమే ఫోన్ల ట్యాపింగ్‌’

    దేశంలో ప్రతిపక్ష ఎంపీల ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహరంపై రాహుల్‌ గాంధీ స్పందించారు. అదానీని కాపాడేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్స్ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలకు యాపిల్‌ కంపెనీ నుంచి హెచ్చరిక మెయిల్ వచ్చిందన్నారు. హ్యాకింగ్‌కు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి కేంద్రంలోని భాజపా ఓర్వలేకపోతోందన్నారు. అందుకే విపక్షాలను అనేక ఇబ్బందులకు గురి చేయాలని భావిస్తోందని ఆరోపించారు.

    అమరావతికి ర్యాలీగా చంద్రబాబు!

    AP: హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు ఇవాళ సాయంత్రానికి బయటకు వచ్చే అవకాశముంది. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం చంద్రబాబు అమరావతిలోని తన నివాసానికి ర్యాలీగా వెళ్లనున్నారు. రాజమహేంద్రవరం నుంచి వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం మీదుగా విజయవాడ రానున్నారు. అనంతరం తన నివాసానికి చేరుకుంటారు. బుధవారం తిరుమల శ్రీవారి దర్శనానికి చంద్రబాబు వెళ్లనున్నారు.

    బాబు బెయిల్‌పై అంబటి సెటైర్లు

    AP: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ లభించడంపై మంత్రి అంబటి రాంబాబు ట్విటర్‌ (X) వేదికగా స్పందించారు. బాబుకు బెయిల్‌ వచ్చింది నిజం గెలిచి కాదని పేర్కొన్నారు. కళ్లు కనిపించడం లేదని కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిందని ఎద్దేవా చేశారు. స్కిల్‌ స్కాం కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఐదు కండిషన్లు విధిస్తూ నవంబర్‌ 28 వరకు బెయిల్‌ ఇచ్చింది.

    చంద్రబాబు బెయిల్‌ షరతులు ఇవే!

    AP: స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ కాపీలో హైకోర్టు పలు షరతులు విధించింది. ‘చంద్రబాబు మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కేవలం ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనరాదు. బెయిల్‌ గడువు ముగిశాక నవంబర్‌ 24వ తేదీ సాయంత్రం లొంగిపోవాలి. చంద్రబాబు ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ మరుక్షణమే రద్దు అవుతుంది’ అని తీర్పు కాపీలో జస్టిస్‌ మల్లికార్జున రావు స్పష్టం చేశారు.

    చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు

    AP: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు నాలుగు వారాల బెయిల్‌ మంజూరు ‌అయ్యింది. ఆయన వేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు ఆమోదించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ ఇస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్‌ 24 వరకూ మధ్యంతర బెయిల్ వర్తించనున్నట్లు అందులో పేర్కొన్నారు. తిరిగి నవంబర్ 28న సరెండర్ అవ్వాలని చంద్రబాబును కోర్టు ఆదేశించింది. మరోవైపు ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై నవంబర్‌ 10న హైకోర్టు విచారణ చేపట్టనుంది.

    ఏపీలో కుంభకోణం.. రంగంలోకి ఈడీ

    AP: ట్రాఫిక్‌ ఈ-చలానాల కుంభకోణంపై హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసింది. త్వరలోనే దర్యాప్తు చేపట్టనుంది. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్‌తోపాటు అతనికి చెందిన డేటా ఎవాల్వ్‌ సంస్థ, మరికొందరిని ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారు చెల్లించిన చలానాల సొమ్ము రూ.36.53 కోట్లను అవినాష్‌, తదితరులు కొల్లగొట్టారన్నది ప్రాథమిక అభియోగం. దీనిపై ఏపీ పోలీసులు గతంలోనే కేసు పెట్టగా తాజాగా ఈడీ కూడా దర్యాప్తుకు ఉపక్రమించింది.