• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోలీసుల అదుపులో దస్తగిరి

    AP: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల క్రితం వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్లలో జరిగిన ప్రేమ వివాహం విషయంలో దర్యాప్తునకు సంబంధించి దస్తగిరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. యువతిని కారులో కిడ్నాప్‌ చేశారన్న ఆరోపణలపై విచారించనున్నట్లు చెప్పారు. కాగా, వివేకా కేసులో కీలక ముద్దాయిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారి కేసు విచారణ సహకరిస్తున్నాడు.

    నేడు CBN బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు

    AP: తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. బెయిల్‌కు సంబంధించి నిన్న (సోమవారం) ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కాగా, చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు పెట్టింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది.

    తిరుమలలో రద్దీ సాధారణం

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. కాగా, నిన్న స్వామి వారికి హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అటు నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

    పసిడి ప్రియులకు భారీ ఊరట

    పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. గత కొన్నిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.210, రూ.230 చొప్పున తగ్గింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.57,200కి చేరింది. అటు ముంబయిలో రూ.57,200, చెన్నైలో రూ. 57,350, కోల్‌కత్తాలో రూ.57,200, బెంగళూరులో రూ.57,200గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200కు తగ్గింది. మరోవైపు కిలో … Read more

    తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు

    AP: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా నేడు పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ప్రధాన రైళ్లయిన హవ్‌డా-సికింద్రాబాద్‌ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, హవ్‌డా-బెంగళూరు (12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌- హైదరాబాద్‌ (18045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. వీటితో పాటు విశాఖ-గుణుపుర్‌, విశాఖ-రాయగడ, విశాఖ-పలాస ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. నిన్న కూడా పలు రైళ్లు రద్దు కాగా మరికొన్నింటిని దారి మళ్లించారు.

    81 కోట్ల మంది ఆధార్‌ వివరాలు లీక్‌..!

    దేశ ప్రజల ఆధార్‌ కార్డ్‌ వివరాలు మరోమారు లీకైనట్లు తెలుస్తోంది. తమ వద్ద 81.5 కోట్ల మంది భారతీయుల బయోమెట్రిక్‌ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ డార్క్‌వెబ్‌లో ఓ ప్రకటన కనిపించింది. దీనిని దేశంలోనే అత్యంత భారీ డాటా చోరీగా పేర్కొంటున్నారు. ICMR వద్ద ఉన్న భారతీయుల వివరాలు సైబర్‌ దొంగల చేతికి చిక్కినట్టు సమాచారం. ICMR మీద గత ఫిబ్రవరి నుంచే సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. గత 8 నెలల్లో సుమారు ఆరువేల సార్లు ఐసీఎంఆర్‌ సర్వర్లపై దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు.

    చంద్రబాబుపై మరో కేసు

    టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేశారు.

    రైలు ప్రమాద ఘటనపై జగన్ ఆరా

    రైలు ప్రమాద ఘటనలో సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైందని సీఎం జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేస్తూ.. ‘విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించ‌డంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను’.అని జగన్ పేర్కొన్నారు.

    ఏపీ రైలు ప్రమాదం.. పట్టాలు పునరుద్ధరణ

    ఏపీ విశాఖ: రైలు ప్రమాద ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకలకు అనుగుణంగా పట్టాలను పునరుద్ధరించారు. 19 గంటల్లో ట్రాక్ పునరుద్ధరణ చేశామని అధికారులు వెల్లడించారు. రైలు ప్రమాద ఘటనలో 13 మంది మరణించారని తెలిపారు. మరో 30 మంది గాయపడ్డారని వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

    చంద్రబాబు బెయిల్ పిటిషన్ రిజర్వ్

    చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ఆరోగ్య రిత్యా బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. 50 రోజులకు పైగా చంద్రబాబు జైలులో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో తమ వాదలు వినిపించేందుకు తగిన సమయం కావాలని సీఐడీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.