• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రమాద బాధితులకు జగన్‌ పరామర్శ

    AP: కంటాకపల్లి రైలు ప్రమాద బాధితుల్ని సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకుముందు విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన రైలు ప్రమాద ఫొటోలను సీఎం పరిశీలించారు. ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఘటనాస్థలిని పరిశీలించాలని జగన్ భావించినప్పటికీ ట్రాక్‌ పనురుద్ధరణ పనుల రిత్యా వీలు పడలేదు. దీంతో జగన్‌ నేరుగా ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రుల్లో స్థైర్యాన్ని నింపారు. #WATCH | Andhra Pradesh CM YS Jagan … Read more

    భారాస హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం: సర్వే

    తెలంగాణలో భారాస హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తుందని తాజాగా విడుదలైన రాజ్‌నీతి సర్వే పేర్కొంది. 77 సీట్లల్లో గెలిచి BRS అధికారాన్ని నిలబెట్టుకుంటుందని వెల్లడించింది. అటు కాంగ్రెస్‌ 29, భాజపా 6 స్థానాలకు పరిమితం అవుతాయని తమ సర్వేలో తేలినట్లు చెప్పింది. హైదరాబాద్‌లోని ఏడు స్థానాలు మినహా రాష్ట్రంలోని 112 నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు. ఓట్ల పరంగా చూస్తే భారాసకు 43.35% ఓట్లు పోలవుతాయని సర్వే నివేదిక వెల్లడించింది.

    యుద్ధ ప్రాతిపదికన పనురుద్ధరణ పనులు

    AP: రైలు ప్రమాదం జరిగిన విజయనగరం జిల్లా భీమాలి వద్ద ట్రాక్‌ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బోగీలను తొలగించేందుకు విశాఖ నుంచి బాహుబలి క్రేన్‌ను తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 7 సహాయ బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. పలాస ప్యాసింజర్‌లోని 11 బోగీలను అలమండ స్టేషన్‌కు, రాయగడ ప్యాసింజర్‌ 9 బోగీలను కంటకాపల్లి స్టేషన్‌కు తరలించారు. సహాయ చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే సిబ్బందితో పాటు NDRF, SDRF, RPF బలగాలు పాల్గొన్నాయి. Thirteen … Read more

    మనీశ్ సిసోదియాకు బెయిల్‌ నిరాకరణ

    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ నేత మనీశ్ సిసోదియాకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రూ.338 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు కొన్ని ఆధారాలున్నాయని దర్యాప్తు సంస్థ చూపించిందని కోర్టు తెలిపింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున ఈ దశలో బెయిల్‌ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. అయితే విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సుప్రీం ఆదేశించింది.

    వైసీపీలోకి జేడీ లక్ష్మీనారాయణ.. క్లారిటీ!

    AP: వైసీపీలోకి చేరబోతున్నట్లు వస్తోన్న వార్తలను జేడీ లక్ష్మీనారయణ ఖండించారు. ఆ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. ‘శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి గారిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశా. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో నేను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరుతున్నట్లు కాదు’ అని జేడీ స్పష్టం చేశారు.

    రైలు ప్రమాద స్థలికి సీఎం జగన్

    AP: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఘటనాస్థలికి సీఎం జగన్‌ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన అక్కడికి చేరుకోనున్నారు. విమానంలో తాడేపల్లి నుంచి విశాఖ వెళ్లనున్న జగన్‌, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అలమండ వెళ్తారు. అలమండ నుంచి ప్రత్యేక రైలులో వెళ్లి ప్రమాదస్థలిని పరిశీలించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితులను జగన్‌ పరామర్శిస్తారు.

    తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే!

    AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి నాలుగు కాంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ తెలిపింది. రూ.300 దర్శనానికి 3 గం.లు పడుతున్నట్లు చెప్పింది. నిన్న 85,497 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,873 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.41కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

    చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు

    ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం వరకు రూ.100కు 6 కేజీల వరకు దొరికిన ఉల్లి ఇప్పుడు వందకు కేజీన్నరకు పడిపోయింది. హైదరాబాద్‌ మార్కెట్లలో కిలో ఉల్లిని రూ.60-70కి విక్రయిస్తున్నారు. దీపావళి పండగ సీజన్‌ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. గత 15 రోజులుగా ఉల్లిపాయల రాకపోకలు దాదాపు 40% పడిపోయాయని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. నవంబరు రెండో వారం వరకూ ఈ పరిస్థితులు ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి.

    స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

    పసిడి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 చొప్పున పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.57,560కి చేరింది. అటు ముంబయిలో రూ.57,410, చెన్నైలో రూ. 57,710, కోల్‌కత్తాలో రూ.57,410, బెంగళూరులో రూ.57,410గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800కు చేరింది. మరోవైపు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,500 వద్ద కొనసాగుతోంది.

    నారా లోకేశ్‌పై ఆర్జీవీ సెటైర్లు

    AP: టీడీపీ నేత నారా లోకేశ్‌ తనపై చేసిన విమర్శలపై దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సెటైర్లు వేశారు. లోకేశ్‌ను చూసి నవ్వాలా? జాలి పడలా? నవ్వాలా? ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు పరిస్థితి చూసి లోకేశ్‌ మైండ్‌ స్టబిలైజ్‌ అయ్యిందేమో అని విమర్శించారు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిదేమో అని సలహా ఇచ్చారు. సబ్జెట్‌ తెలియకుండా మాట్లాడితే మీ తండ్రిని దేవుడు కూడా కాపాడలేడని ఆర్జీవీ అన్నారు. కొద్ది రోజులు లండన్‌కు వెళ్లి రెస్ట్‌ తీసుకోవాలని లోకేశ్‌కు సూచించారు. Hey @NaraLokesh … Read more