• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌ చంద్రబాబుకు పనివాడు: అంబటి

    AP: చంద్రబాబు జైలులో శత దినోత్సవాలు జరుపుకొంటారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆయన జైలుకెళ్లి 50 రోజులు దాటిన నేపథ్యంలో అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన తప్పులే ఆయన్ను జైలుకు వెళ్లేలా చేశాయని మంత్రి అన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్‌కు అండగా ఉన్న తనపై దాడులు చేస్తున్నారన్నారు. ఓ సామాజికవర్గం వారే తనపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా కోసం ఎంతదూరమైనా వెళ్తానని చెప్పారు. అటు పవన్‌ మనవాడు కాదని చంద్రబాబు దగ్గర పనివాడని అంబటి ధ్వజమెత్తారు.

    ఘోరం.. 14 మంది దుర్మరణం

    AP: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు. 33 మందికి గాయాలైనట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ట్రాక్‌పై ఉన్న రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రుల సంఖ్య వంద మందికిపైనే ఉంటుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పాయి. ఈ ప్రమాదంలో మెుత్తం ఏడు బోగీలు నుజ్జు నుజ్జు అయినట్లు వివరించాయి. Vizianagaram DRO confirms that eight … Read more

    కూసే గాడిద వచ్చి మేసే గాడిదను తిట్టినట్టు: కేసీఆర్

    ఆలేరులో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఆ లక్ష్మీనరసింహుడే మనతో పని చేయించుకున్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పోతాయ్‌ అని ఆనాడు అన్నారు. కరెంటు ఉండదు, చిమ్మ చీకట్లు అవుతాయన్నారు.. సునీత నా బిడ్డలెక్క, ఆమె అడిగిన హామీలు నెరవేరుస్తా.. కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్లు డీకే శివకుమార్‌ మనకు చెబుతున్నారు.. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారు’ … Read more

    తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో ములాఖత్‌లో చెప్పారు. ఏపీలో ప్రస్తుత రాజకీ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణపై ఫొకస్ పెట్టలేమని తెలిపారు. ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నమో టీడీపీ కార్యకర్తలకు వివరించాలని ఆయన సూచించారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తప్పుకున్నట్లైంది.

    విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు

    యంగ్ హీరో విశ్వక్ సేన్ తను తాజాగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం విడుదలపై పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కడూ మన గేమ్‌ మారుద్దాం అని చూస్తాడు. డిసెంబర్ 8న వస్తున్నాం. హిట్, ప్లాప్, సూపర్ హిట్ అనేది ప్రేక్షకుల నిర్ణయం. తగ్గేకొద్ది ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. డిసెంబర్ 8న సినిమా రిలీజ్ కాకపోతే.. ఇకపై ప్రమోషన్లలో కూడా పాల్గొనను’ అని పోస్ట్ చేశాడు,

    భారీగా పెరిగిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.600 పెరగడంతో రూ.57,400కు చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.660 పెరగడంతో రూ.62,620కి ఎగబాకింది. కిలో వెండి ధర రూ.77,500 వద్ద కొనసాగుతోంది.

    మరో వినూత్న నిరసనకు లోకేష్ పిలుపు

    టీడీపీ నేత నారా లోకేష్ మరో వినూత్ననిరసనకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక, చీకటి పాలన సాగిస్తోన్న జగనాసురుడి కళ్లు తెరిపిద్దాం పేరిటి మరో నిరసనకు లోకేష్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 గంటల నుంచి 7:05 మధ్యలో కళ్లకు గంతలు కట్టుకుని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు మద్ధతుగా నిజం గెలవాలి అని గట్టిగా నినదించాలని కోరారు. ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని లోకేష్ సూచించారు.

    చంద్రబాబును చంపేస్తామంటున్నారు: నారా లోకేష్

    జైలులో ఉన్న చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు. ‘ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్ష్యతోనే ఆయనను అరెస్టు చేశారు. కేసులతో సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. 50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారు. ఒక్క ఆధారం కూడా ప్రజల ముందుకు తీసుకురాలేక పోయారు. మా ఆస్తుల వివరాలు ఐటీ రిటర్న్‌లు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నాం’. అని లోకేష్ పేర్కొన్నారు.

    నరరూప హంతకుడు శవమై తేలాడు

    అమెరికాలోని మైనేలో కాల్పులతో విధ్వంసం సృష్టించిన నిందితుడు శవమై తేలాడు. మైనేలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 18 మందిని పొట్టనపెట్టుకున్న రాబర్ట్ కార్డ్ (40) తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు, FBI ఏజెంట్లు రెండ్రోజులుగా తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో అతడి మృతదేహం తాజాగా బయటపడింది. రాబర్ట్ బాడీని లిస్బన్ ఫాల్స్‌లోని రీసైక్లింగ్ సెంటర్‌కు సమీపంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రిటైర్డ్‌ మిలటరీ ఆఫీసర్‌గా గుర్తించారు.

    కాంగ్రెస్‌కు కేటీఆర్‌ బహిరంగ సవాల్‌

    వృద్ధిరేటులో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. ‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న భాజపా హామీ ఏమైంది?. కర్ణాటకను మోడల్‌గా కాంగ్రెస్‌ నేతలు చూపుతున్నారు. కర్ణాటక రైతులు రాష్ట్రానికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. వారికి మేము డబ్బులు ఇచ్చి తీసుకొచ్చామని ఆరోపిస్తున్నారు. కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితి ఆరా తీద్దాం.. సిద్ధమా?’ అని కేటీఆర్‌ సవాలు విసిరారు. ⬆️ అటు రూరల్ డెవలప్‌మెంట్, ఇటు అర్బన్ … Read more