• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కట్టుకున్నోళ్లనే కడతేర్చిన జంట

    TG: సూర్యపేటలో దారుణం జరిగింది. ఇద్దరి వివాహేతర సంబంధం మరో ఇద్దరి ప్రాణాలను బలిగొంది. భాగ్యనగర్‌ కాలనీకి చెందిన భూక్యా వెంకన్న, షేక్‌ నస్రీన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోగా ఇరువురి ఇళ్లల్లో ఈ విషయం తెలిసింది. దీంతో వెంకన్న తన భార్యను, నస్రీన్‌ తన భర్తను అడ్డుతొలగించుకొని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వెంకన్న తన భార్యను కర్రతో కొట్టి చంపాడు. ఆపై నస్రీన్‌ వెంకన్న సాయంతో భర్తను గొంతు నులిమి చంపి ఫ్యాన్‌కు ఉరి వేసింది. ఈ ఘటనల్లో నలుగురు నిందితుల్ని … Read more

    ఏపీ.. ఫ్యాక్షన్‌ ప్రదేశ్‌గా మారింది: లోకేశ్

    AP: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. వైకాపా అధినేత తన సొంత బాబాయ్‌ వేసేస్తే.. ఆయన ఫ్యాన్స్‌ హార‌న్ కొట్టార‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై హ‌త్యాయ‌త్నం చేశారని ఆరోపించారు. అడ్డంగా ఉన్న బైక్ తీయాల‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్ బీఆర్ సింగ్ హార‌న్ కొట్టడ‌మే నేర‌మైందన్నారు. న‌డిరోడ్డుపై వైకాపా నేత‌లు గూండాల కంటే ఘోరంగా డ్రైవర్‌పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ‌గ‌న్ వల్ల ఆంధ్రప్రదేశ్‌.. ఫ్యాక్షన్ ప్రదేశ్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు.

    టీమిండియా కూర్పులో గందరగోళం

    ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయంతో దూరం కావడంతో టీమిండియా కూర్పులో గందరగోళం నెలకొంది. రేపు ఇంగ్లాండ్‌తో లక్నో వేదికగా మ్యాచ్ జరగనుంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండనుండటంతో థర్డ్‌ స్పిన్నర్‌గా అశ్విన్‌ను తీసుకునే ఛాన్స్‌ కనిపిస్తోంది. అదే జరిగితే పేసర్లలో బుమ్రాకు తోడుగా షమీ లేదా సిరాజ్‌లలో ఎవర్నీ తీసుకోవాలన్న సందిగ్దం నెలకొంది. అటు బ్యాటింగ్‌లో కివీస్‌ మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్‌ను కొనసాగించాలా? లేదా ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌కు చోటివ్వాలా అన్న ప్రశ్న టీమిండియాకు ఎదురవుతోంది.

    ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ అప్పుడే?

    ఏపీ ఎన్నికలకు మార్చిలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముందని రాష్ట్ర ఎన్నికల చీఫ్‌ ముకేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఇప్పటివరకూ 10 లక్షల బోగస్‌ ఓట్లను తొలగించినట్లు చెప్పారు. ఓటర్ల జాబితాపై ఎమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబరు 9 లోపు ఎవరైనా తెలపవచ్చని అన్నారు. డిసెంబరు 26 లోగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తుది ఓటర్ల జాబితాను 2024 జనవరి 5న ప్రకటిస్తామని రాష్ట్ర ఈసీ చీఫ్‌ స్పష్టం చేశారు. ఎన్నికలకు భెల్‌ కంపెనీకి చెందిన EVMలను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

    నేడు చంద్రగ్రహణం.. తిరుమల మూసివేత

    నేడు శారద పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై ఉండనుంది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. దీంతో నేటి రాత్రి నుంచే అన్ని దేవాలయాల తలుపులు మూతపడనున్నాయి. 8 గంటల పాటు ఇది కొనసాగుతుంది. తిరుమల ఆలయాన్ని సైతం రాత్రి 7.05 గం.లకు మూసివేయనున్నారు. తిరిగి రేపు తెల్లవారుజామున 3.15 గం.లకు తెరుస్తారు.

    తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్‌

    AP: అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. ఈ నెల 24 నుంచి 27 తేదీల మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయ ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. వాటి సంచారం ట్రాప్‌ కెమెరాల్లో రికార్డయ్యిందని తెలిపింది. కాబట్టి భక్తులు అప్రమత్తంగా ఉంటూ గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ కోరింది. ఇటీవల కాలంలో తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

    రహదారులపై స్పెషల్‌ డ్రైవ్‌: జగన్‌

    AP: రహదారుల మరమ్మతులకు స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షాకాలం ముగిసినందున నగరాలు, పట్టణాల్లో రహదారుల పనులపై దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. ‘నగరాల్లో వివిధ దశల్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలి. విశాఖలో రహదారుల విస్తరణ, ట్రాఫిక్‌ నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి. విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతివనం, రాజమహేంద్రవరంలో హేవ్‌లాక్‌ బ్రిడ్జి సుందరీకరణ, వరదల వల్ల నెల్లూరు మునిగిపోయే పరిస్థితులు రాకుండా రక్షణ గోడ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలి’ అని అన్నారు.

    అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం

    తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్‌ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాలో రికార్డయింది. దీంతో నడక దారి భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గుంపులు గంపులుగా వెళ్లాలని తెలిపింది. మరో వైపు చిరుత, ఎలుగబంటిని బంధించేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.

    ‘అలా జరిగితే చంద్రబాబు చావు ఖాయం’

    వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ సీఎం అయితే చంద్రబాబు చావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో మళ్లీ జగన్ ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి మళ్లీ వైసీపీనే విజయం సాధిస్తుందన్నారు. చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కళ్యాణ్‌పై ఎన్ని పోరాటాలు చేసినా లాభం లేదని మాధవ్ పేర్కొన్నారు.

    టీడీపీ, జనసేన విజయం ఖాయం: భువనేశ్వరి

    2024లో టీడీపీ-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘దివంగత నేత ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం తీసుకొస్తే.. చంద్రబాబు వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. అలాంటి వ్యక్తిని 49 రోజులుగా జైల్లో పెట్టారు. ఆయన చేసిన నేరం ఏమిటో ఆధారాలు ,చూపించండి’. అని భువనేశ్వరి ప్రశ్నించారు.