• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నన్ను చంపేందుకు కుట్ర: మంత్రి అంబటి

    టీడీపీ నేతలు తనను చంపేందుకు కుట్రచేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంపిన వారికి రూ.50 లక్షలు ఇస్తామని కూడా ప్రకటించారని తెలిపారు. కమ్మం ఓ ప్రేవేటు కార్యక్రమానికి వెళ్తే టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఖమ్మంలో నాకు నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేయించారు. నిన్న గోధుముల బస్తా కారుపై పడటం, నేడు నాపై దాడికి ప్రయత్నించడం నన్ను చంపేందుకు కుట్రలో భాగమే దీనిపై పోలీసులు విచారణ జరపాలి’. అని అంబటి పేర్కొన్నారు.

    భారాస నేతలకు మావోలు వార్నింగ్

    TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లా BRS నాయకులకి మావోయిస్టులు వార్నింగ్‌ ఇచ్చారు. నేతలు ఇసుక మాఫీయా, భూ కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించినవారి పైన దాడులు చేసి హత్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలపై భారాస నేతలు పెత్తనం చెలయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ అక్రమాలను తక్షణమే ఆపేయాలని, లేకపోతే ప్రజల ముందు శిక్షలు తప్పవంటూ పలు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు.

    నా హత్యకు కుట్ర జరుగుతోంది: CBN

    AP: ఏసీబీ కోర్టు జడ్జికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ‘కుట్రపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చింది. దీనిపై పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు. నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్‌ రిలీజ్‌ చేశారు. నా భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు ఉన్నాయి’ అని ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను చంద్రబాబు రాశారు.

    రేషన్‌ కుంభకోణం.. మంత్రి అరెస్టు

    బంగాల్ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌ అరెస్టయ్యారు. తెల్లవారుజామున ఆయన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. జ్యోతిప్రియో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి మాజీ వ్యక్తిగత సహాయకుడి నివాసంతో పాటు మొత్తం 8 ఫ్లాట్లలో తనిఖీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. 20 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం మంత్రిని తన ఇంట్లో అరెస్టు చేసి, ఈడీ కార్యాలయానికి తరలించారు.

    ‘నేర చట్టాల్లో సమూల మార్పులు’

    హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో 75వ బ్యాచ్‌ ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి అమిత్‌షా ట్రైనీ ఐపీఎస్‌లను ఉద్దేశించి మాట్లాడారు. ‘కర్తవ్య నిర్వహణలో అమరవీరుల బలిదానం ప్రేరణ కావాలి. హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్ఠంగా పోరాడాలి. CRPC, IPC, ఎవిడెన్స్‌ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి పార్లమెంట్ ముందుంచింది. త్వరలోనే నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుంది’ అని షా అన్నారు. #WATCH | Hyderabad: Union Home … Read more

    నేడు CBN బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

    AP: నేడు హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ విచారణ చేపట్టనుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి వెకేషన్‌ బెంచ్‌ ముందుకు వాయిదా వేసింది.

    దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు: APPSC

    AP: రాష్ట్రంలోని దివ్యాంగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో వారికి 4 శాతం రిజ్వరేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది రానున్న నోటిఫికేషన్ల నుంచే ఈ రిజర్వేషన్లను అమలు చేయనున్నట్లు కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ 3 శాతం రిజర్వేషన్లను దివ్యాంగులకు ఏపీపీఎస్సీ అమలు చేస్తూ వచ్చింది. తాజాగా దానిని 4 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    ‘ఆ పార్టీల పొత్తుతో రాజకీయ సునామీ’

    AP: జనసేన, తెదేపా కలయిక రాజకీయ సునామి సృష్టిస్తుందని మాజీ మంత్రి హరిరామజోగయ్య అన్నారు. రాబోయే పదేళ్ల కాలంలో ఏ రంగాల్లో లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలో పవన్‌కు లేఖ ద్వారా సూచించినట్లు తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యతోపాటు రవాణా సౌకర్యం అందించాలని కోరానన్నారు. అలాగే కళాశాల విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉచిత పంట బీమా సౌకర్యం, మద్దతు ధర, వ్యవసాయ పెట్టుబడులకు ఏడాదికి రూ.20 వేల సాయం వంటి సూచనలు చేసినట్లు వివరించారు.

    పసిడి ప్రియులకు భారీ షాక్‌

    పసిడి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150, రూ.160 చొప్పున పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.56,950కి చేరింది. అటు ముంబయిలో రూ.56,800, చెన్నైలో రూ.57,000, కోల్‌కత్తాలో రూ.56,800, బెంగళూరులో రూ.56,800గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800కు చేరింది. మరోవైపు వెండి సైతం కేజీపై రూ.500 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,500కు చేరింది.

    తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన ఉల్లి

    తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ఉల్లి ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఆగస్టులో రూ.100కి ఆరు కేజీలు ఉన్న ఉల్లి సెప్టెంబరుకి నాలుగు, ప్రస్తుతం రెండు కేజీలకి తగ్గింది. వర్షాలు సరిగాలేక కర్నూలు, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌, చేవెళ్లలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోనూ ఇదీ పరిస్థితి ఉండటమే కారణమని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. నవంబరు రెండో వారంలో స్థానికంగా ఖరీఫ్‌ పంట అందుబాటులోకి రానుండటంతో ధరలు తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్‌ అధికారులు అన్నారు.