• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం

    AP: ఈ ఏడాది కూడా రాష్ట్ర అవతరణ దినో­త్సవాన్ని నవంబర్‌ 1న ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొంటారు. ఉ.10.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమ­రజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పిస్తారు. అటు అన్ని జిల్లా కేంద్రా­ల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్సవంగా నిర్వహించాలని కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మెుదలు పెట్టాలని ఆదేశించింది.

    వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ

    ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల (నవంబర్‌) నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు కందిపప్పు అందించనున్నట్లు ప్రకటించింది. కిలో రూ.67 చొప్పున ప్రతీ కార్డుకు ఒక కేజీ కందిపప్పు అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో 3,660 టన్నులు, రెండో దశలో 3,540 టన్నులు అందించనుంది. వచ్చే నెల అవసరాలకు గాను 2,300 టన్నుల సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మార్కెట్‌లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకూ పలుకుతోంది.

    మంత్రి అంబటికి తప్పిన ప్రమాదం

    ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై లారీలో నుంచి గోధుమ బస్తా పడిపోయింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతింది. అంబటి రాజమండ్రి వైపు నుండి ఖమ్మం వైపు వెళ్తున్న ఈ ప్రమాదంలో జరిగింది. దీంతో ఆయన మరో కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    చంద్రబాబును కేసుల్లో ఇరికించారు: భువనేశ్వరి

    చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి 48 రోజులుగా జైల్లో పెట్టారని ఆయన సతీమణి భువనేశ్వరి అన్నారు. చంద్రబాబును జైల్లో ఉంచినా ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయలేరని తెలిపారు. తిరుపతిలో ‘నిజం గెలవాలి కార్యక్రమం’లో భువనేశ్వరి మాట్లాడారు. అనంతపురానికి చంద్రబాబు కియా మోటార్స్‌, తిరుపతికి ఫాక్స్‌కాన్‌ కంపెనీలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో వచ్చిన కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని భువనేశ్వరి ఆరోపించారు.

    హైకోర్టులో CBN అత్యవసర పిటిషన్

    AP: తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్‌ జరపాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో వివరించారు. కాగా, చంద్రబాబు కంటికి అత్యవసర చికిత్స అవసరమని కంటి వైద్యులు సూచించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

    వైకాపా బస్సు యాత్ర ప్రారంభం

    AP: వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రను ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ‘ఈ యాత్రలో గత నాలుగేళ్లలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. కేబినెట్‌లోనూ సామాజిక న్యాయం చేసిన నాయకుడు జగన్‌. వైకాపాకు ఓటు వేయని వారికి సంక్షేమ ఫలాలు అందించాం. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’ అని వైసీపీ నేతలు అన్నారు.

    28న శ్రీవారి ఆలయం మూసివేత

    AP: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 28న మూసి వేయనున్నారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తితిదే తెలిపింది. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు గుడి తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లు తితిదే స్పష్టం చేసింది.

    ‘చంద్రబాబు కంటికి చికిత్స అవసరం’

    AP: చంద్రబాబు కంటికి చికిత్స అవసరమని ఆయన్ను పరిశీలించిన కంటి వైద్యులు నివేదిక ఇచ్చారని టీడీపీ నేతలు తెలిపారు. అయితే చంద్రబాబు కంటికి ఇప్పట్లో ఎలాంటి చికిత్స అవసరం లేదన్నట్లుగా ఆ నివేదికను మార్చి ఇవ్వాలని ప్రభుత్వ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బుధవారం విడుదల చేసిన చంద్రబాబు హెల్త్‌ బులెటిన్‌లోనూ కంటిసమస్యను ప్రస్తావించకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నాలుగు నెలల క్రితం చంద్రబాబు కంటికి కేటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగినట్లు తెలుస్తోంది.

    పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్!

    అన్ని పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియా స్థానంలో భారత్‌ పదాన్ని ప్రవేశపెట్టాలని NCERT నిర్ణయించింది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మార్పుచేర్పుల కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ‘ప్రాచీన చరిత్ర’కు బదులుగా ‘క్లాసికల్‌ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్టు కమిటీ చైర్‌పర్సన్‌ సి.ఇసాక్‌ తెలిపారు. ముఖ్యంగా ఇండియా పేరును అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లోనూ భారత్‌గా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్లు స్పష్టం చేశారు. 7 వేల ఏళ్లనాటి గ్రంథాల్లోనే భారత్‌ పేరు ఉన్నట్లు చెప్పారు.

    ఆ రోజే చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై అక్టోబరు 27న ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 19న చంద్రబాబు బెయిల్ పిటిషన్ హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. గడిచిన 40 రోజులుగా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించి.. విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.