• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్భంధించారు: భువనేశ్వరి

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చంద్రగిరిలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..చంద్రబాబుపై మోపిన స్కిల్‌, రింగ్‌రోడ్డు, ఫైబర్‌నెట్‌ కేసులో ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి గురించి ఏ మాత్రం ధ్యాస లేదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డి పనిచేశారని చెప్పారు. రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో నిర్భంధించారని భువనేశ్వరి అన్నారు.

    ఏపీ ప్రభుత్వంపై పురందేశ్వరి ఫైర్

    ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో కల్తీ మద్యం తయారవుతుందని ఆరోపించారు. ఆయా కంపెనీల ఆరోపణలపై సీఎం జగన్ ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాలతో జగన్ ప్రభుత్వం చలగాటం అడుతోందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    పవన్‌, లోకేశ్‌పై నిప్పులు చెరిగిన కొడాలి

    AP: నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకురాలేరని విమర్శించారు. లోకేశ్ పప్పు అని మరోసారి రుజువైందని, ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నారని ధ్వజమెత్తారు. అటు చంద్రబాబు కోసమే పవన్‌ ‘జన సున్నా’ పార్టీ పెట్టారని నాని సెటైర్లు వేశారు. 2019 ఎన్నికల్లో కూడా పవన్ టీడీపీకి మద్దతుగా ఉన్నారని ఆరోపించారు.

    వాషింగ్‌ మెషీన్లలో రూ.1.30 కోట్లు

    AP: విశాఖలో వాషింగ్ మెషీన్లలో తరలిస్తున్న రూ.1.30 కోట్లు హవాలా డబ్బు గుట్టు రట్టయ్యింది. విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా ఎన్‌ఏడీ జంక్షన్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. హవాలా నగదుగా అనుమానిస్తున్న విశాఖ పోలీసులు.. నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. డబ్బు ఎవరిదానే దానిపై పోసులు ఆరా తీస్తున్నారు. ఓ ప్రముఖ కంపెనీ నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు.

    భువనేశ్వరి యాత్రపై రోజా సెటైర్లు!

    AP: నేటి నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యాత్రపై రాష్ట్ర పర్యాటక మంత్రి రోజా సెటైర్లు వేశారు. ఇది బస్సు యాత్ర కాదని, ఫ్యాషన్‌ షో అని ఎద్దేవా చేశారు. లోకేశ్‌ నిజం గెలిస్తే చంద్రబాబు జైల్లోనే ఉంటారని అన్నారు. ఆయనతో పాటే లోకేశ్‌, భువనేశ్వరి కూడా జైలుకు వెళ్లే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భువనేశ్వరికి నిజం గెలవాలని ఉంటే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుపై సీబీఐ విచారణ కోరాలని సూచించారు.

    దేవరగట్టు కర్రల సమరం.. ఒకరు మృతి

    AP: కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరంలో ప్రమాదం జరిగింది. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు స్థానికులు సమీపంలోని చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ విరిగిపడి గణేశ్‌ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ సమరంలో 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓ చేతిలో కర్ర, మరో చేతిలో దివిటీలు, మది నిండా భక్తిభావంతో దేవరగట్టు మారుమోగింది.

    భారీగా పెరిగిన పసిడి ధరలు

    పసిడి ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200, రూ.240 చొప్పున పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.56,700 చేరింది. అటు ముంబయిలో రూ.56,550, చెన్నైలో రూ.56,750, కోల్‌కతాలో రూ.56,550, బెంగళూరులో రూ.56,550గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550కు చేరింది. మరోవైపు వెండి రూ.500 తగ్గి రూ.78,000కు చేరింది.

    మిసెస్‌ ఏసియా వరల్డ్‌వైడ్‌గా ఏపీ మహిళ

    AP: మిసెస్‌ సింగపూర్‌-­2023 పోటీల్లో ఏసియా వరల్డ్‌వైడ్‌ కేటగిరిలో వైఎస్సార్‌ జిల్లా మహిళ విజేతగా నిలిచారు. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి పల్లె గ్రామానికి చెందిన విజయారెడ్డి ఈ ఘనత సాధించారు. అక్టోబర్‌21న సింగపూర్‌లో లూమియర్‌ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో విజయారెడ్డి పాల్గొని విజయం సాధించారు. మొదటి ప్రయత్నంలోనే విజేత కావడం చాలా ఆనందంగా ఉందని విజయ అన్నారు. విజయ తన భర్త ప్రదీప్‌తో కలిసి గత 15 ఏళ్లుగా సింగపూర్‌లోనే ఉంటున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు.

    1న జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో

    AP: జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోను నవంబర్‌ 1న ప్రకటి­స్తా­మని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఆ తర్వాత ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తామన్నారు. మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండాలి? ఉమ్మడి పార్టీల ప్రాధాన్యత వంటి అంశాలు సమన్వయ కమిటీ భేటీలో చర్చకు వచ్చినట్లు చెప్పారు. జనసేన, టీడీపీ కలయిక కోసం ప్రజలు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తాము వైసీపీకి కాదని ఆ పార్టీ విధానాలకే వ్యతిరేకమని పవన్‌ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మద్యంపై రూ.30 వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.

    వివాహితపై ఇద్దరు మహిళల అసహజ శృంగారం

    హైదరాబాద్- యూసుఫ్ గూడలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళపై ఇద్దరు మహిళలు దాడి చేసి.. అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఆమెపై తీవ్రంగా దాడి చేసి వంటిపై ఉన్న నాలుగు తులాల బంగారం అపహరించారు. ఓ వివాహిత భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. బస్టాప్‌లో తలదాచుకుంటున్న ఆమె దగ్గరకు ఇద్దరు మహిళలు సమీపించారు. మాయమాటలు చెప్పి వారింటికి తీసుకెళ్లారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. తెరుకున్న వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.